
'నా లవ్‌తో బ్రేక్ చాలా అవసరం'
ప్రేమ పక్షులు విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు న్యూయార్క్‌లో వాలాయి.
న్యూయార్క్: ప్రేమ పక్షులు విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు న్యూయార్క్‌లో వాలాయి. న్యూయార్క్ నగర వీధుల్లోని గాలిలో ప్రేయసితో కలిసి తిరుగుతుండటం కోహ్లికి బాగా ఊరటనిస్తున్నట్లుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లలో వరుసగా మ్యాచ్‌లలో పాల్గొన్న విరాట్.. మచ్ నీడెడ్ బ్రేక్ విత్ మై లవ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్కతో కలిసివున్న ఓ ఫోటోను పోస్టు చేశాడు.
ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరలైంది. నెటిజన్లు ‘విరుష్క’ చక్కటి జంట అంటూ లైకులు, కామెంట్స్ పెడుతున్నారు. అనుష్క.. న్యూయార్క్‌లో జరగనున్న ఐఫా అవార్డుల కార్యక్రమం నిమిత్తం వెళ్లినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. జులై 15న న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ స్టేడియంలో ఐఫా ఈవెంట్ జరగబోతోంది. మరోవైపు విరాట్ వెస్టిండీస్ టూర్ ముగించుకుని అటు నుంచి యూఎస్ వచ్చినట్లు తెలుస్తోంది.