గ్రామాలను చిన్న గణతంత్ర దేశాలుగా అభివర్ణించింది? | Grand Test VRO / VRA | Sakshi
Sakshi News home page

గ్రామాలను చిన్న గణతంత్ర దేశాలుగా అభివర్ణించింది?

Published Thu, Jan 23 2014 4:01 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Grand Test  VRO / VRA

1.చెన్నైలో గతేడాది డిసెంబర్‌లో ముగిసిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిందెవరు?
 1) విశ్వనాథన్ ఆనంద్
 2) మాగ్నస్ కార్ల్‌సన్
 3) గ్యారీ కాస్పరోవ్
 4) క్రామ్నిక్
 
 2.ఏ నవలకుగాను 2012 సంవత్సరానికి రావూరి భరద్వాజకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు లభించింది?
 1) పాకుడు రాళ్లు    
 2) వివుల
 3) నా గొడవ
 4) సొంత ఊరు
 
 3.ఇటీవల భారత పోస్టల్ డిపార్ట్‌మెంట్ సుప్రీంకోర్టుకు కేటాయించిన ప్రత్యేక పిన్‌కోడ్?
 1) 110202
 2) 202110
 3) 110201
 4) 110211
 
 4.ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో రెండో అతి పెద్ద పార్టీగా నిలిచి అరవింద్ కేజ్రివాల్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల గుర్తు?
 1) కాగడా     
 2) చీపురు
 3) తుపాకీ     
 4) బాణం
 
 5.సచిన్ టెండూల్కర్‌తోపాటు భారతరత్నకు ఎంపికైన శాస్త్రవేత్త ?
 1) ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు
 2) ఎం.ఎస్.స్వామినాథన్
 3) యు.ఆర్.రావు
 4) రాధాకృష్ణన్
 
 6.2013 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని ఎవరికి ప్రదానం చేశారు?
 1) షేక్ హసీనా     
 2) జాన్సన్ సర్లీఫ్
 3) ఏంజెలా మెర్కల్
 4) హిల్లరీ క్లింటన్
 
 7.కబడ్డీ వరల్డ్ క ప్ పురుషుల, మహిళల టైటిల్స్‌ను గెలుచుకున్న జట్టు?
 1) పాకిస్థాన్     
 2) భారత్
 3) న్యూజిలాండ్     
 4) ఆస్ట్రేలియా
 
 8.లాల్‌తన్ హవ్లా 2013, డిసెంబర్ 14న ఏ రాష్ట్రానికి ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు?
 1) ఛత్తీస్‌గఢ్
 2) త్రిపుర
 3) అరుణాచల్‌ప్రదేశ్
 4) మిజోరాం
 
 9.ఏ జిల్లాలో ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీసిటీ ఉంది?
 1) మెదక్
 2) చిత్తూరు
 3) రంగారెడ్డి
 4) విశాఖపట్నం
 
 10.వేర్వేరు సంగీత పరికరాల నుంచి వెలువడే ధ్వనిని వినడానికి ఉపయోగపడే ధ్వని లక్షణం?
 1) తీవ్రత
 2) పిచ్
 3) నాణ్యత     
 4) 1, 2
 
 11.సాధారణ వాతావరణ పీడనం వద్ద పాదరస స్తంభం ఎత్తు?
 1) 76 సెం.మీ.
 2) 7.6 సెం.మీ.
 3) 76 మీ.మీ.
 4) 100 సెం.మీ.
 
 12.రెండు నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం 18 గి, సమాంతరంగా తెలిపితే 4 గి అయితే ఆ నిరోధ విలువలు?
 1) 9 W, 9 W    
 2) 6 W, 12 W
 3) 4 W, 14 W    
 4) 3 W, 6 W
 
 13.వేగుచుక్క, సాయంకాలం చుక్క అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
 1) బుధుడు
 2) శుక్రుడు
 3) కుజుడు    
 4) శని
 
 14.న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం పనిచేసే సందర్భం?
 1) సౌర వ్యవస్థలో మాత్రమే
 2) భూమిపై వస్తువుల మధ్య
 3) గ్రహాలలో మాత్రమే
 4) విశ్వం మొత్తం
 
 15.22 గ్రాముల కార్బన్‌డయాక్సైడ్ ఎన్ని మోల్‌లకు సమానం?
 1) 1 మోల్
 2) 0.5 మోల్
 3) 2 మోల్స్
 4) 4 మోల్స్
 
 16.క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఐసోటోపు?
 1) పాస్ఫరస్     
 2) యురేనియం
 3) సోడియం     
 4) కోబాల్ట్
 
 17.పాశ్చరైజేషన్ వల్ల దేన్ని ఎక్కువ కాలం నిల్వచేయవచ్చు?
 1) పెరుగు     
 2) వెన్న
 3) పాలు     
 4) నెయ్యి
 
 18.గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ కలిగించే ప్రధాన వాయువు?
 1) కార్బన్‌మోనాక్సైడ్
 2) కార్బన్‌డయాక్సైడ్
 3) సల్ఫర్‌డయాక్సైడ్
 4) నైట్రస్ ఆక్సైడ్
 
 19.శరీరంలో అతి ముఖ్య గ్రంథి?
 1) అధివృక్కగ్రంధి
 2) పిట్యుటరీ (పీయూష)
 3) థైరాయిడ్     
 4) పైవన్నీ
 
 20.ఆర్నిథాలజీ దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
 1) క్షీరదాలు
 2) పాములు
 3) మొసళ్లు     
 4) పక్షులు
 
 21.PMR (ఆధార జీవక్రియరేటు)ను కొలిచే పరికరం ఏది?
 1) స్పైరోమీటర్
 2) సూడోమీటర్
 3) నానోమీటర్
 4) ఏదీకాదు
 
 22.మూడో నెల గర్భధారణ నుంచి ఎదిగే పిండాన్ని ఏమంటారు?
 1) ఎంబ్రియో
 2) భ్రూణం
 3) జరాయువు     
 4) గర్భస్థశిశువు
 
 23.మానవుడి కంటిలో శంఖువులు (కోన్స్), దండకణాల (రాడ్స్) నిష్పత్తి?
 1) 15:1
 2) 1:15
 3) 1:4     
 4) 4:1
 
 24.జ్వాలా కణం కలిగిన జీవి?
 1) ప్లనేరియా
 2) బొద్దింక
 3) తేలు
 4) సీ ఎనిమోన్స్
 
 25.భారతదేశ నదీ జలాల్లో ఎంత శాతం వున రాష్ట్రంలో ప్రవహిస్తున్నారుు?
 1) 10 శాతం
 2)15 శాతం
 3) 20 శాతం
 4) 25 శాతం
 
 26.లక్షల సంవత్సరాల పూర్వం భూమి భౌగోళిక పరిస్థితిలో పరిణావు వరుస క్రవుం?
 1)సవుుద్రాలు ఏర్పడడం-వుండుతున్న వాయుుగోళం-చల్లబడటం-వర్షం కురవడం
 2)వర్షం కురవడం-చల్లబడటం-వుండుతున్న వాయుుగోళం-సవుుద్రాలు ఏర్పడటం
 3)వుండుతున్న వాయుుగోళం- చల్లబడటం- వర్షం కురవడం- సవుుద్రాలు ఏర్పడటం
 4)చల్లబడటం-వుండుతున్న వాయుుగోళం- వర్షం కురవడం- సవుుద్రాలు ఏర్పడటం
 
 27.భారతదేశంలో జాతీయు చైతన్యం వృద్ధి చెందడానికి తగిన రాజకీయుపరమైన వేదికను సిద్ధం చేసినవి?
 1) సావూజిక వుత సంస్కరణ ఉద్యవూలు
 2) ఆర్థికపరమైన కారణాలు
 3) రాజకీయు పరమైన సంస్కరణలు
 4) విదేశీ విధానాలు
 
 28.గ్రావు పంచాయుతీలకు ఏ పన్ను ప్రధాన ఆదాయుం?
 1) వాహన పన్ను
 2) ఇంటి పన్ను
 3)ఎక్సైజ్ పన్ను     
 4) భూమి శిస్తు
 
 29.స్థానిక సంస్థల ఏర్పాటు ప్రధాన లక్ష్యం?
 1) పరిపాలన వ్యవహారాల్లో ప్రజల భాగస్వావ్యుం
 2) రాజకీయు చైతన్యం
 3) ప్రభుత్వ పథకాలపై అవగాహన
 4) పైవేవీ కావు
 
 30.ఒక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అరుున అంతివు వస్తుసేవల సవుుదాయూన్ని ఏవుంటారు?
 1) జాతీయు ఉత్పత్తి
 2) జాతీయాదాయుం
 3) జాతీయు అభివృద్ధి
 4) జాతీయు సరఫరా
 
 31.మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని (2013) ఎప్పుడు నిర్వహించారు?
 1) నవంబర్ 1-14     
 2) నవంబర్ 15-21
 3) నవంబర్ 11-26
 4) నవంబర్ 14-26
 
 32.ఏ తేదీ తర్వాత జన్మించిన ఆడపిల్లలకు బంగారుతల్లి పథకం వర్తిస్తుంది?
 1) జనవరి 1, 2013
 2) మార్చి 1, 2013
 3) మే 1, 2013
 4) నవంబర్ 1, 2013
 
 33. ఏడో విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2013, డిసెంబర్ 6న ఎక్కడ ప్రారంభించారు?
 1) హైదరాబాద్     
 2) మహబూబ్‌నగర్
 3) గుంటూరు     
 4) శ్రీకాకుళం
 
 34.వందశాతం వైకల్యంగల పిల్లలకు పింఛన్ ను రూ. 500 లనుంచి ఎంతకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది?
 1) రూ.700
 2) రూ. 800
 3) రూ. 900
 4) రూ. 1000
 
 35.భారతదేశ గ్రామాలను చిన్న గణతంత్రదేశాలు (రిపబ్లిక్‌లు)గా అభివర్ణించిందెవరు?
 1) లార్డ్ రిప్పన్
 2) సర్ ఛార్లెస్ మెట్‌కాఫ్
 3) లార్డ్ మేయో
 4) బెంటింక్
 
 36.గిరిజన ప్రాంతాల్లో స్వపరిపాలన కోసం మూడంచెల పాలన నిర్మాణాన్ని సిఫారసు చేసిన కమిటీ?
 1) బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ
 2) అశోక్‌మెహతా కమిటీ
 3) భూరియా కమిటీ
 4) రాయల్ కమిటీ
 
 37.స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువతకు శిక్షణ పథకం (ట్రైజమ్)ను భారత ప్రభుత్వం 1979లో ప్రారంభించింది. ఇది ఏ వయసు వారికి వర్తిస్తుంది?
 1) 15-35     
 2) 18-35
 3) 18-50
 4) అన్ని వయసుల వారికి
 
 38.జనపనార మిల్లులు అధికంగా ఏ జిల్లాలో ఉన్నాయి?
 1) మహబూబ్‌నగర్
 2) విజయనగరం
 3) కృష్ణా     
 4) విశాఖపట్టణం
 
 39.ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను సూచించిన కమిటీ?
 1) మల్హోత్రా కమిటీ
 2) ఎల్.కె.ఝా కమిటీ
 3) నరసింహం కమిటీ
 4) టెండూల్కర్ కమిటీ
 
 40.8 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వృత్తి విద్యా శిక్షణను ఇచ్చే పథ కం పేరేమిటి?
 1) బాలకిరణాలు
 2) రాజీవ్‌గాంధీ విద్యా యోజన
 3) కిశోర బాలిక పథకం
 4) అక్షర భారతి
 
 41.అమ్మహస్తం పథకంలో లబ్ధి పొందేవారు సుమారుగా?
 1) 1.25 కోటు
 2) 1.50 కోట్లు
 3) 1.75 కోట్లు
 4) 2.25 కోట్లు
 
 42.యువతను అసాంఘిక శక్తుల నుంచి, అప్రజాస్వామిక విధానాల నుంచి మళ్లించి సమాజ నిర్మాణంలో ప్రముఖపాత్ర వహించేలా చేయడానికి ఏర్పాటు చేసిన పథకం ఏమిటి?
 1) యువశక్తి     
 2) యువకిరణాలు
 3) అభయహస్తం
 4) ఉద్యోగశ్రీ
 
 43.కిందివాటిలో స్వచ్ఛమైన ఉచిత వస్తువు?
 1) ఉద్యానవనాలు
 2) సూర్యరశ్మి
 3) గాలి     
 4) నీరు
 
 44.నవజాత శిశువులకు పోషక విలువలుగల ఆహారం అందించే లక్ష్యంతో 2013 నవంబర్ 14న ప్రారంభించిన పథకం?
 1) బంగారు తల్లి     
 2) బాల అమృతం
 3) బాలకిరణాలు
 4) కిశోర బాలిక
 
 45.భూకమతాలకు సంబంధించిన సమాచారాన్ని ఏ సంవత్సరం నుంచి సేకరిస్తున్నారు?
 1) 1951-52     
 2) 1956-57
 3) 1960-61     
 4) 1970-71
 
 46.ఆంధ్ర ప్రాంతంలో రబీ సీజన్‌ను ఏమని పిలుస్తారు?
 1) దాళ్వా     
 2) సార్వా
 3) అభి
 4) తభి
 
 47.విస్తరాకుల తయారీలో ఉపయోగించే మోదుగాకు అత్యధికంగా లభించే జిల్లా?
 1) ఖమ్మం
 2) ఆదిలాబాద్
 3) శ్రీకాకుళం     
 4) వరంగల్
 
 48.నిజాం తన సొంత ఖర్చులకు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకున్న భూములను ఏమని పిలుస్తారు?
 1) జాగీర్
 2) దివాన్
 3) ఈనామ్
 4) సర్ఫేఖాస్
 
 49.ఆసియా ఖండంలో మొదటి రబ్బర్ డ్యామ్‌ను జంఝావతి నదిపై నిర్మించారు. ఇది ఏజిల్లాలో ఉంది?
 1) విజయనగరం
 2) కడప
 3) శ్రీకాకుళం
 4) చిత్తూరు
 
 50.20 సూత్రాల పథకాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించారు?
 1) నాలుగు
 2) ఐదు
 3) ఆరు     
 4) ఏడు
 
 51.మొక్కజొన్న పంట ప్రధానంగా ఏ ప్రాంతంలో పండుతుంది?
 1) ఉత్తర తెలంగాణ
 2) దక్షిణ తెలంగాణ
 3) కోస్తా
 4) రాయలసీమ
 
 52.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఏది?
 1) సీఎస్‌ఓ
 2) ఎన్‌ఎస్‌ఎస్
 3) ప్రణాళికాసంఘం
 4) డీఈఎస్
 
 53.ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి ఐఐటీని ఎక్కడ ప్రారంభించారు?
 1) నూజివీడు-కృష్ణా జిల్లా
 2) ఇడుపులపాయ- వైఎస్‌ఆర్ జిల్లా
 3)బాసర- ఆదిలాబాద్ జిల్లా
 4) కంది-మెదక్ జిల్లా
 
 54.కిసాన్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్?
 1) 1090
 2) 1050
 3) 1551     
 4) 1881
 
 55.చౌక ధరల దుకాణాలకు ప్రభుత్వం సరఫరా చేసే ఆహార ధాన్యాల ధరను ఏమని పిలుస్తారు?
 1) కనీస మద్దతుధర (ఎమ్‌ఎస్‌పీ)
 2) సేకరణధర
 3) జారీ ధర
 4) సబ్సిడీధర
 
 56.వాన్‌పిక్ ప్రాజెక్టు ఏజిల్లాలకు సంబంధించింది?
 1) కృష్ణా-గుంటూరు
 2) గుంటూరు- ప్రకాశం
 3) తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి
 4) అనంతపురం-కర్నూలు
 
 57.భారతదేశంలో వ్యవసాయ రాయితీలో అతిపెద్ద విభాగం ఏది?
 1) విత్తనాల రాయితీ
 2) ఎరువుల రాయితీ
 3) పురుగుమందుల రాయితీ
 4) ఆహార పదార్థాల రాయితీ
 
 58.2013, ఏప్రిల్ 11న హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రారంభించిన ‘అమ్మహస్తం’ పథకంలో ఎన్ని నిత్యా వసర వస్తువులను తెల్లకార్డుదారులు పొందవచ్చు?
 1) 9     
 2) 10     
 3) 11     
 4) 12
 
 59.ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ను ప్రవేశపెట్టినపుడు అప్పటి ముఖ్యమంత్రి?
 1) బూర్గుల రామకృష్ణ
 2) బెజవాడ గోపాలరెడ్డి
 3) నీలం సంజీవరెడ్డి
 4) ఎన్‌టీ రామారావు
 
 60.కృష్ణానదీ జలాల వివాదం ఏఏ రాష్ట్రాల మధ్య సాగుతుంది?
 1) ఆంధ్రప్రదేశ్-ఒడిశా
 2) ఆంధ్రప్రదేశ్-తమిళనాడు
 3) ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్‌గఢ్
 4) ఆంధ్రప్రదేశ్- కర్ణాటక
 
 61.ప్రస్తుతం తండ్రి వయసు, కొడుకు వయసుకు ఐదు రెట్లు. మూడు సంవత్సరాల క్రితం తండ్రి వయసు, కొడుకు వయసుకు 8 రెట్లు. అయితే ప్రస్తుతం తండ్రి, కొడుకుల వయసులు ఎంతెంత?
 1) 30 సంవత్సరాలు, 6 సంవత్సరాలు
 2) 35 సం, 7 సంవత్సరాలు.
 3) 40 సంవత్సరాలు, 8 సంవత్సరాలు
 4) 50 సంవత్సరాలు, 9 సంవత్సరాలు
 
 62.అ/3 = ఆ/4 = ఇ/5 అయితే అ:ఆ:ఇ నిష్పత్తి ఎంత?
 1) 3:4:5     
 2) 5:4:3
 3) 4:15:12     
 4) ఏదీకాదు
 
 63.40 లీటర్ల మిశ్రమంలో పాలు, నీళ్లు 3:1 నిష్పత్తిలో కలవు. అందులో ఎన్ని లీటర్ల నీరు పోస్తే వాటి నిష్పత్తి 1:1 అవుతుంది?
 1) 10 లీ.     
 2) 20 లీ    
 3) 30 లీ
 4) 40లీ
 
 64.‘ఎ’ అనేవాడు ఒక పనిని 20 రోజుల్లో , ‘బి’ అనేవాడు అదే పనిని 24 రోజులలో పూర్తి చేస్తారు. ఇద్దరు కలిసి పని ప్రారంభించిన  ఐదు రోజుల తర్వాత ‘ఎ’ పని నుంచి తప్పుకున్నాడు. మిగిలిన పనిని ‘బి’ ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు?
 1) 10 రోజులు
 2) 11 రోజులు
 3) 12 రోజులు
 4) 13 రోజులు
 
 65.ఒక నీటి ట్యాంకును మొదటి కుళాయి 20 నిమిషాలలో, రెండో కుళాయి 40 నిమిషాలలో నింపగలవు. ట్యాంకు కింద చిన్న రంధ్రం ఉండటం వల్ల పూర్తిగా నిండి ఉన్న ట్యాంకు 60 నిమిషాలలో ఖాళీ అవుతుంది. అయితే రెండు కుళాయిలు ఒకేసారి తెరిస్తే ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది?
 1) 17 1/7 నిమిషాలు
 2) 19 2/7 నిమిషాలు
 3) 20 నిమిషాలు
 4) ఎప్పటికీ నిండవు
 
 66.6 మొదటి 12 గుణిజాల సరాసరి ఎంత?
 1) 6     
 2) 12
 3) 26     
 4) 39
 
 67.క్రికెట్‌బ్యాట్స్‌మన్ తను ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు వరుసగా 72, 64ూ, 58, 80ూ, 76, 90, 80. అయితే అతని సరాసరి పరుగులెన్ని?
 (ూ అంటే ఔట్ కాలేదు)
 1) 74.28     
 2) 104
 3) 118     
 4) 84
 
 68.400 మీ. పొడవున్న రైలు గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే, వ్యతిరేకదిశలో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక బాలుడ్ని, ఆ రైలు ఎంత సమయంలో దాటుతుంది?
 1) 8 సెకన్లు     
 2) 10 సెకన్లు
 3) 12 సెకన్లు
 4) 16 సెకన్లు
 
 69.ఒక వ్యక్తి 25 మీటర్/సెకన్ వేగంతో ప్రయాణిస్తూ తన గమ్యాన్ని రెండు గంటలలో చేరుకున్నాడు. అయితే అతను ప్రయాణించిన దూరం ఎంత?
 1) 50 మీటర్లు     
 2) 50 కి.మీ
 3) 180 మీటర్లు     
 4) 180 కి.మీ
 
 70.ఒక వ్యక్తి తన ఇంటినుంచి ఆఫీస్‌కు 30 కి.మీ./గంట వేగంతో ఆఫీస్ నుంచి ఇంటికి 60 కి.మీ./గంట గంట వేగంతో ప్రయాణిస్తే అతని సరాసరి వేగం ఎంత?
 1) 40 కి.మీ./గంట
 2) 45 కి.మీ./గంట
 3) 30 కి.మీ./గంట
 4) 35 కి.మీ./గంట
 
 71.ఒక వ్యాపారి 10 వస్తువులు అమ్మడం వల్ల రెండు వస్తువుల అమ్మకపు వెలకు సమానమైన లాభాన్ని పొందాడు. అయితే లాభశాతమెంత?
 1) 10 శాతం     
 2) 20 శాతం
 3) 25 శాతం
 4) 30 శాతం
 
 72.ఒక వ్యాపారి వస్తువు కొన్న వెల కంటే 30 శాతం అధికంగా ధర ముద్రించి 10 శాతం డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే అతనికి ఎంత శాతం లాభం వస్తుంది?
 1) 20 శాతం     
 2) 17 శాతం
 3) 15 శాతం     
 4) 40 శాతం
 
 73.50, 80ల మధ్యలో 9తో భాగించబడుతూ, 3తో భాగించబడని సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?
 1) 1     
 2) 2     
 3) 3     
 4) ఏమీలేవు
 
 74.902కు ఏ కనిష్టసంఖ్యను కలిపితే అది 9తో నిశ్శేషంగా భాగిస్తుంది?
 1) 4     
 2) 5     
 3) 6     
 4) 7
 
 75.40 మీ., 30 మీ. పొడవు, వెడల్పులు గల ఒక దీర్ఘచతురస్రాకారపు పొలం చుట్టూ 5 మీ. వెడల్పుతో బయట వైపు రోడ్డు వేస్తే ఆ రోడ్డు వైశాల్యం ఎంత?
 1) 375 చ.మీ     
 2) 400 చ.మీ
 3) 600 చ.మీ     
 4) 800 చ .మీ
 
 76.ఒక ట్రెపీజియమ్ (సమలంబ చతుర్భుజం) రెండు సమాంతర భుజాలు వరుసగా 22 మీటర్లు, 33మీటర్లు. దాని వైశాల్యం 1210 చ.మీ. అయితే రెండు సమాంతర భుజాల మధ్యదూరం ఎంత?
 1) 44 మీ.
 2) 33 మీ.
 3) 22 మీ.
 4) 11 మీ.
 
 77.సమబాహు చతుర్భుజం రెండు కర్ణాలు వరుసగా 6మీ, 8మీ. దాని చుట్టుకొలత ఎంత?
 1) 48మీ     
 2) 40 మీ
 3) 20మీ
 4) 28మీ
 
 78.కొంత అసలు బారువడ్డీ ప్రకారం నాలుగు సంవత్సరాలలో రెట్టింపు అయింది. ఆవడ్డీ రేటు ఎంత?
 1) 10 శాతం
 2) 20 శాతం
 3) 25 శాతం
 4) 35 శాతం
 
 79.రఘు ఒక వ్యక్తి నుంచి రూ.6 వేలను బారువడ్డీ ప్రకారం సంవత్సరానికి 10 శాతం చొప్పున తీసుకొని, వెంటనే ఆ మొత్తాన్ని తన మిత్రునికి 13 శాతం వడ్డీ రేటు చొప్పున బారువడ్డీ ప్రకారం ఇచ్చాడు. అయితే రెండు సంవత్సరాలలో రఘుకు ఎంత లాభం వస్తుంది?
 1) రూ. 400     
 2) రూ. 360
 3) రూ. 1,200
 4) రూ. 1,560
 
 80. రూ. 1,250 సంవత్సరానికి 20 శాతం వడ్డీరేటు చొప్పున మూడేళ్లకు ఎంత చక్రవడ్డీ అవుతుంది?
 1) రూ. 1,000     
 2) రూ. 960
 3) రూ. 910     
 4) రూ. 600
 
 81.6, 8, 10 లచే నిశ్శేషంగా భాగించబడే నాలుగు అంకెల గరిష్ఠసంఖ్య ఏది?
 1) 9980
 2) 9960
 3) 9840
 4) 9720
 
 82.ఏ కనిష్ట సంఖ్యకు నాలుగు కలిపితే వచ్చే సంఖ్య 10, 15, 20 లచే నిశ్శేషంగా భాగించబడుతుంది?
 1) 52
 2) 56     
 3) 64     
 4) 72
 
 83.ఒక యంత్రం ప్రస్తుత విలువ రూ.10,000. ఆ యంత్రం ప్రతి ఏటా తన విలువలో 10 శాతం కోల్పోతున్నట్ల యితే రెండేళ్ల తర్వాత యంత్రం విలువ ఎంత?
 1) రూ. 8,000     
 2) రూ. 8,100
 3) రూ. 8,500
 4) రూ. 9,000
 
 84.ఎ, బిల నెలసరి వేతనాల నిష్పత్తి 5:6. వారిద్దరికీ 10శాతం ఇంక్రిమెంట్ ఇస్తే వారి కొత్త వేతనాల నిష్పత్తి ఎంత?
 1) 5:6     
 2) 6:5    
 3) 3:4     
 4) 4:7
 
 85.20% 400 - 30% 120 విలువ ఎంత?
 1) 34     
 2) 44     
 3) 42     
 4) 38
 
 86.ఒక చతురస్ర కర్ణం 10 మీటర్లు. అయితే దాని వైశాల్యం ఎంత?
 1) 100 చ.మీ     
 2) 75 చ .మీ
 3) 50 చ.మీ     
 4) 45 చ.మీ
 
 87.ఎ, బి లు వరుసగా రూ. 4 లక్షలు, రూ. 5 లక్షల పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించారు. సంవత్సరం చివర వారికి రూ. 45 వే లు లాభం వస్తే అందులో ఎ వాటా ఎంత?
 1) రూ. 20 వేలు     
 2) రూ. 21వేలు
 3) రూ. 22 వేలు
 4) రూ. 30వేలు
 
 88.రాము రూ. 6 వేల పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించాడు. 4 నెలల తర్వాత రాజు రూ. 10 వేల పెట్టుబడితో ఆ వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివర వారి లాభాల నిష్పత్తి ఎంత?
 1) 3:5     
 2) 3:2    
 3) 9:10
 4) 15:17
 
 89.40 శాతాన్ని సామాన్య భిన్నంగా రాస్తే....?
 1) 5/2     
 2) 2/5    
 3) 1/4     
 4) 3/4
 
 90.0.23 ణ 0.4 =?
 1) 9.2     
 2) 0.92
 3) 0.092
 4) 0.0092
 
 91.’అ’, ’ఆ’ లు సోదరులు. ’ఇ’, ’ఈ’ లు సోదరీమణులు. ’అ’ కూతురు ’ఇ’ ఐతే ’ఈ’ కి ’అ’ ఏమవుతారు?
 1) తండ్రి
 2) పెదనాన్న
 3) కొడుకు
 4) సోదరుడు
 
 92.ఒక కోడ్ భాషలో RED ను TGF గా రాస్తే, అదే కోడ్ భాషలో KY ని ఏ విధంగా రాస్తారు?
 1) ULZ    
 2) UMA
 3) VNB    
 4) RJX
 
 93.ఒక వ్యక్తి దక్షిణ దిశలో 5 కి.మీ ప్రయాణించి ఎడమవైపు 10 కి.మీ ప్రయాణించాడు. తర్వాత ఎడమవైపు 5 కి.మీ ప్రయాణించి చివరగా కుడివైపు 12 కి.మీ ప్రయాణించాడు. ఇప్పుడతను తన ప్రారంభ స్థలం నుంచి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు?
 1) 22 కి.మీ. తూర్పు    
 2) 22 కి.మీ. పడమర
 3) 2 కి.మీ. తూర్పు     
 4) 2 కి.మీ. పడమర
 
 94.A, E, I, _, U
 1) J
 2) N     
 3) O    
 4) W
 
 95.2, 10, 30, 68, 130, .....?
 1) 200
 2) 210     
 3) 216
 4) 222
 
 96.4 గంటల 10 నిమిషాల సమయంలో అద్దంలో ప్రతిబింబించే సమయం ఎంత?
 1) 7 గంటల 50 నిమిషాలు
 2) 6 గంటల 50 నిమిషాలు
 3) 7 గంటల 10 నిమిషాలు
 4) 6 గంటలు 10 నిమిషాలు
 
 97. 2 4 6 3 1 4 6 5 4 2 4 6 1 5 4 6 2 అమరికలో 4 కంటే ముందు బేసిసంఖ్య, 4 తర్వాత 6 ఉండే విధంగా ఎన్ని 4లు కలవు?
 1) 4     
 2) 3     
 3) 2     
 4) 1
 
 98.40 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో రాజు అనే విద్యార్థి పై నుంచి నాలుగో ర్యాంకు సాధిస్తే కింది నుంచి అతని ర్యాంకు ఎంత?
 1) 35     
 2) 36     
 3) 37     
 4) 38
 
 99.పరుగెత్తడం : అలసిపోవడం :: చిచిచిచి:చిచిచిచి
 1) ఉపాధ్యాయుడు : విద్యార్థి
 2) జింక : జంతువు
 3) ఉపవాసం : ఆకలి
 4)ై పెవన్నీ
 
 100. కిందివాటిలో భిన్నంగా ఉన్న దాన్ని కనుక్కోండి?
 1) 1     
 2) 64     
 3) 729
 4) 1296
 
 జవాబులు
     1) 2    2) 1    3) 3    4) 2    5) 1
     6) 3    7) 2    8) 4    9) 2    10) 3
     11) 1    12) 2    13) 2    14) 4     15) 2
     16) 4    17) 3    18) 2    19) 2    20) 4
     21) 1    22) 2    23) 1    24) 1    25) 2
     26) 3    27) 1    28) 2    29) 1    30) 1
     31) 3    32) 3    33) 1    34) 4    35) 2
     36) 3    37) 2    38) 2    39) 3    40) 1
     41) 4    42) 1    43) 2    44) 2    45) 1
     46) 1    47) 3    48) 4    49) 1    50) 2
     51) 1    52) 4    53) 4    54) 3    55) 3
     56) 2    57) 2    58) 1    59) 3    60) 4
     61) 2    62) 1    63) 2    64) 4    65) 1
     66) 4    67) 2    68) 4    69) 4    70) 1
     71) 3    72) 2    73) 4    74) 4    75) 4
     76) 1    77) 3    78) 3    79) 2    80) 3
     81) 2    82) 2    83) 2    84) 1    85) 2
     86) 3    87) 1    88) 3    89) 2    90) 3
     91) 1    92) 2    93) 1    94) 3    95) 4
     96) 1    97) 3    98) 3    99) 3    100) 4
 
 రూపొందించినవారు
 ఎ.శ్రీనివాసులు రెడ్డి      - కరెంట్ అఫైర్‌‌స
 బి. శ్రీనివాస్     - సోషల్ స్టడీస్
 ఎస్. సత్యనారాయణ    - బయాలజీ
 నాగరాజశేఖర్     - ఫిజికల్ సైన్‌‌స
 అల్లాడి అంజయ్య     - గ్రామీణాంశాలు
 బి. రవిపాల్ రెడ్డి     - అర్థమెటికల్, లాజికల్ రీజనింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement