క్విక్ రివ్యూ | Quick Review on Physical Science | Sakshi
Sakshi News home page

క్విక్ రివ్యూ

Published Thu, Feb 20 2014 3:19 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Quick Review on Physical Science

 ఉపయోగాలు
 
 స్క్రూగేజీ: సన్నని తీగ వ్యాసాన్ని, గోళం వ్యాసాన్ని, పలుచటి గాజుపలక మందాన్ని కనుగొనేందుకు ఉపయోగిస్తారు.
 గురుత్వ మాపకం: గురుత్వ త్వరణం (జ) విలువలో కలిగే స్వల్ప మార్పులను కనుగొనేందుకు ఉపయోగిస్తారు.
 అపకేంద్రయంత్రం: ఇచ్చిన మిశ్రమం నుంచి ఎక్కువ భారం ఉన్న పదార్థాలను, తక్కువ భారం ఉన్న పదార్థాలను వేరు చేసేందుకు ఉపయోగిస్తారు.
 పరారుణ వికిరణాలు: చీకటిలో ఫొటోలు తీసేందుకు, శారీరక మర్ధనకు ఉపయోగిస్తారు.
 థర్మోఫైల్, బొలోమీటర్: పరారుణ వికిరణాల ఉనికిని తెలుసుకోవడానికి.
 మైక్రో తరంగాలు: రాడార్, టెలిమెట్రి, మైక్రో ఓవెన్‌లలో ఉపయోగిస్తారు.
 రేడియో తరంగాలు: రేడియో ఖగోళశాస్త్రంలో ఉపయోగిస్తారు.
 కఠిన గీ-కిరణాలు: పరిశ్రమల్లోని వస్తువులను శోధించడానికి, పదార్థాల నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.
 మృదు గీ-కిరణాలు: రేడియోగ్రఫీ, రేడియో థెరపీలలో ఉపయోగిస్తారు.
 రిఫిల్ ట్యాంక్: కాంతి పరావర్తనాన్ని, కాంతి వక్రీభవనం అర్థం చేసుకొనేందుకు.
 ఏూ్ఛ్ఛ లేసర్: భూభ్రమణం రేటును నిర్థారించేందుకు, కాంతి వేగం అన్ని దిశల్లో సమానం అని రుజువు చేసేందుకు ఉపయోగిస్తారు.
 లేసర్: హాలోగ్రఫీ, వాతావరణ దృశ్య శాస్త్రంలో ఉపయోగిస్తారు. రక్తం కారకుండా చేసే శస్త్ర చికిత్సలో, పేగులోని అల్సర్లను గుర్తించేందుకు, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధుల నివారణలో.
 అమ్మీటర్: కరెంట్‌ను కొలిచేందుకు ఉపయోగిస్తారు.
 వోల్ట్‌మీటర్: పొటెన్షియల్ బేధాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తారు.
 టాప్-కీ: విద్యుత్ వలయాన్ని జత చేయడానికి, విడదీయటానికి ఉపయోగిస్తారు.
 విద్యుత్ విశ్లేషణ నియమం: లోహ సంగ్రహణకు, ఎలక్ట్రో ప్లేటింగ్, ఎలక్ట్రో టైపింగ్‌లో ఉపయోగిస్తారు.
 ట్రాన్‌‌సఫార్మర్: ఏసీ వోల్టేజీ పరిమాణాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి.
 సోడియం ఐసోటోప్: రక్తం గడ్డ కట్టివున్న భాగాన్ని గుర్తించేందుకు.
 కోబాల్ట్ ఐసోటోప్: క్యాన్సర్ కణాల్ని నిర్మూలించేందుకు ఉపయోగిస్తారు.
 అయోడిన్ ఐసోటోప్: థైరాయిడ్ గ్రంథి పనితీరుని పరిశీలించేందుకు
 కార్బన్ ఐసోటోప్: శిలాజాలు, వృక్షాల వయసును లెక్కించేందుకు
 యురేనియం ఐసోటోపు: శిలల వయసును నిర్ధారించేందుకు.
 మితకారి: న్యూక్లియర్ రియాక్టర్‌లో న్యూట్రాన్‌ల వేగాన్ని తగ్గించేందుకు.
 డయోడ్: రెక్టిఫైయర్‌గా, ఎలక్ట్రానిక్ స్విచ్‌గా, కాంతి ఉద్గార డయోడ్‌గా.
 జంక్షన్ ట్రాన్సిస్టర్: ఆంప్లిఫైయర్‌గా, స్టెబిలైజర్‌గా, డోలకాలుగా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లలో ఉపయోగిస్తారు.
 కంపైలర్: ఉన్నతస్థాయి భాషను యంత్రభాషలో మార్చేందుకు ఉపయోగిస్తారు.
 పౌలింగ్ స్కేలు: రుణ విద్యుదాత్మకతను కొలిచేందుకు ఉపయోగిస్తారు.
 ప్రమాణ కుప్పె: ప్రమాణ ద్రావణాలను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు.
 కార్బన్ డై ఆక్సైడ్: సోడా, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా తయారీకి, అగ్నిమాపక యంత్రాల్లో ఉపయోగిస్తారు.
 ఎసిటిలిన్: వెల్డింగ్‌లో, కాయలను కృత్రిమంగా పండించేందుకు ఉపయోగిస్తారు.
 ఎథిలిన్: పాలిమర్‌లు, ఆల్కహాల్, మత్తు మందు తయారీకి ఉపయోగిస్తారు.
 బగాసే: కాగితం తయారీలో, విద్యుత్ తయారీకి ఉపయోగిస్తారు.
 ప్రెస్‌మడ్: ఎరువుగా ఉపయోగిస్తారు.
 మొలాసిస్: ఆల్కహాల్ తయారీకి ఉపయోగిస్తారు.
 ఆల్కహాల్: ద్రావణిగా, మందుల పరిశ్రమల్లో, మత్తు పానీయాల్లో, థర్మామీటర్‌లో.
 పొటాషియం లవణం: శరీర శుభ్రతకు ఉపయోగించే సబ్బు తయారీకి.
 సోడియం లవణం: బట్టలు ఉతికే సబ్బు తయారీకి.
 కాల్షియం, అల్యూమినియం లవణం: నీటిలో తడవని గుడ్డ తయారీ.
 మెగ్నీషియం లవణం: ముఖానికి వాడే పౌడర్ల తయారీ.
 ట్రై ఇథనాల్ అమ్మోనియం లవణం: డ్రై క్లీనింగ్‌లో వాడే సబ్బు తయారీ.
 లిథియం లవణం: గ్రీజులు
 3,4,5 - ట్రై బ్రోమోసాలిసిలేనిలైడ్: దుర్వాసన తొలగించే సబ్బుల తయారీకి.
 స్వేచ్ఛా స్టియరిక్ ఆమ్లం: గడ్డం గీసుకునేందుకు వాడే సబ్బుల తయారీకి.
 గ్లిసరాల్: పారదర్శక సబ్బుల తయారీకి.
 సోడాగాజు: కిటికీ అద్దాలు, గాజు సీసాల తయారీకి.
 పెరైక్స్ గాజు: ప్రయోగశాల గాజు పరికరాల తయారీకి
 క్వార్‌‌ట్జ్ట్జగాజు: విద్యుత్ పరికరాలు, దృశ్య పరికరాల తయారీకి
 ఫ్లింట్‌గాజు: దృశ్య పరికరాల తయారీకి ఉపయోగిస్తారు.
 బోరోసిలికేట్ గాజు: ప్రయోగశాల గాజు పరికరాల తయారీకి
 పాలిథీన్ అల్పసాంద్రత: పాలప్యాకెట్లు, ప్లాస్టిక్ సంచులు, వర్షపు కోట్ల తయారీకి.
 పాలిథీన్ అధిక సాంద్రత: బొమ్మలు, విద్యుత్ బంధకాల తయారీ.
 పాలిస్టెరీన్: దువ్వెనలు, టీవీ, రిఫ్రిజిరేటర్‌లకు అస్తరు ప్యాకింగ్‌కు.
 పాలివినైల్ క్లోరైడ్:    గొట్టాలు, చేతి సంచులు, గ్రామ్‌ఫోన్ రికార్డుల తయారీకి.
 పాలి ఎస్టర్‌‌స: ఫిల్ములు, టేపుల తయారీకి.
 నైలాన్ 6, 61: బ్రష్‌లు, తివాచీలు, దారాల తయారీకి.
 బ్యూటెన్, ఐసో బ్యూటెన్: వంటగ్యాస్ తయారీకి.
 సూక్ష్మ ఎరువులు: ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదలకు.
 తుమ్మ జిగురు: కాగితాలు అతికించేందుకు.
 యూరియా ఫార్మాల్డిహైడ్ రెసీన్: చెక్క సామాగ్రికి ఫ్లైవుడ్ లామినేషన్‌కు.
 
 ముఖ్య నిర్వచనాలు
 
 స్వేచ్ఛా పతన వస్తువుకు గురుత్వాకర్షణ బలం వల్ల ఏర్పడే త్వరణాన్నే గురుత్వ త్వరణం అంటాం.
 వస్తువు గాలిలో ఉండే కాలాన్ని గమన కాలం అంటారు.
 మృదు గీ-కిరణాలను ఉపయోగించి వైద్యరంగంలో రోగనిర్ధారణ చేయడాన్ని రేడియోగ్రఫీ అంటారు.
 మృదు గీ-కిరణాలను ఉపయోగించి వైద్యరంగంలో రోగ నివారణ చేయడాన్ని రేడియో థెరపీ అంటారు.
 కాలంతో తగ్గిపోయే కంపన పరిమితులున్న ఆవర్తన చలనాన్ని అవరుద్ధ కంపనాలు అంటారు.
 ఒకే సహజ పౌనఃపున్యాలున్న రెండు వస్తువులు, ఒకదాని ప్రభావంతో మరొక అత్యధిక డోలనా పరిమితితో కంపనాలు చేసే దృగ్విషయాన్ని అనునాదం అంటారు.
 జనాభా విలోమాన్ని సాధించే ప్రక్రియను పంపింగ్ అంటారు.
 ఒక విద్యుత్ సాధనం విద్యుచ్ఛక్తిని వినియోగించుకొనే రేటును దాని వాటేజ్‌గా నిర్వచిస్తారు.
 జౌల్ నియమం- ఒక పనిని ఏ విధంగా చేసినా ఉత్పత్తి అయ్యే ఉష్ణరాశి మాత్రం ఒకటే.
 సందేశాన్ని ట.జ వాహక తరంగాల్లో కలపడాన్ని మాడ్యులేషన్ అంటారు.
 కేథోడ్ కిరణాలు, కాంతి ఘటాలు ఉన్న కెమెరాను ఐకనో స్కోప్ అంటారు.
 సమానశక్తి గల ఆర్బిటాళ్లను సమశక్తి ఆర్బిటాళ్లు అంటారు.
 సాధారణ టీవీని కినీస్కోప్ అంటారు.
 మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు - మెండలీఫ్ ఆవర్తన నియమం.
 గాఢత తెలిసిన ద్రావణాన్ని ప్రమాణ ద్రావణం అంటారు.
 హైడ్రోజన్ అయాన్ గాఢత రుణ సంవర్గ మానాన్ని ్కఏ అంటారు.
 ఒకే మూలకం రెండు లేదా అంతకంటే ఎక్కువ రూపాల్ని కలిగి ఉండటాన్ని రూపాంతరత అంటారు.
 ఒకే మూలకంలోని పరమాణువులు ఒకదానితో ఒకటి కలసి పొడవైన గొలుసులను ఏర్పర్చడాన్ని కాటనేషన్ అంటారు.
 అమ్మోనికల్ సిల్వర్ నైట్రెట్ ద్రావణాన్ని టోలెన్‌‌స కారకం అంటారు.
 రూపంలో మార్పు చెంది, రోగికి ఇచ్చే మందును ఔషధం అంటారు.
 మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు - మోస్లే ఆవర్తన నియమం.
 ఏ రెండు ఎలక్ట్రాన్‌లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానం కావు- పౌలివర్జన నియమం
 ఒక కాండెలా ప్రమాణమున్న కాంతి జనకం, ఒక ఘనకోణంలో ఒక సెకను కాలంలో ఉద్గారించే కాంతిశక్తిని ల్యూమెన్ (ఎల్‌ఎం) అంటారు.
 ఏదైనా ఒక దిశలో కాంతి జనకం కాంతి తీవ్రతని కాండెలాలో చెప్పినప్పుడు దాన్ని కాండిల్ సామర్థ్యం అంటారు.
 ఓమ్ నియమాన్ని పాటించే వాహకాలను ఓమీయి వాహకాలు లేదా రేఖీయ వాహకాలు అంటారు.
 ఓమ్ నియమాన్ని పాటించని వాహకాన్ని అఓమీయ వాహకాలు అంటారు.
 విద్యుద్విశ్లేష్యం గుండా ఒక కూలుమ్ విద్యుత్ ఆవేశం ప్రవహించినప్పుడు విడుదలయ్యే అయాన్‌ల ద్రవ్యరాశిని, ఆ పదార్థపు విద్యుత్ రసాయన తుల్యానికి (్ఛ.ఛి.్ఛ) అంటారు.
 ఒకే పరమాణు సంఖ్య వేర్వేరు పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలున్న ఒకే మూలకం పరమాణువులను ఐసోటోపులు అంటారు.
 ఒకే పరమాణు ద్రవ్యరాశి వేర్వేరు పరమాణు సంఖ్యలున్న వివిధ మూలకాల పరమాణువులను ఐసోబార్‌లు అంటారు.
 ఒకే న్యూట్రాన్‌ల సంఖ్య, వేర్వేరు పరమాణు సంఖ్యలున్న మూలకాల పరమాణువులను ఐసోటోన్‌లు అంటారు.
 ఒక రేడియోధార్మిక పదార్థంలోని సగం పరమాణువులు విఘటనం కావటానికి పట్టే కాలాన్ని దాని అర్ధ జీవితకాలం అంటారు.
 చాలా తక్కువ మోతాదులో మలిన పదార్థాలను స్వచ్ఛమైన పదార్థాల్లో ప్రవేశపెట్టడాన్ని మాదీకరణం అంటారు.
 1 లేదా 0 బైనరీ డిజిట్‌ను బిట్ అంటారు. 8 బిట్ల సముదాయాన్ని బైట్ అంటారు.
 కర్బన పదార్థాల పాలిమర్‌లను రెసిన్‌లు అంటారు.
 ఆల్కహాల్‌కు పిరిడిన్ కలిపిన దాన్ని అసహజ స్పిరిట్ అంటారు.
 
 అత్యధికం - అత్యల్పం
 గురుత్వ త్వరణం అత్యధికంగా ఉండే చోటు? ధృవాలు
 గురుత్వ త్వరణం అత్యల్పంగా ఉండేచోటు? భూమధ్యరేఖ
 స్థిర తరంగాల్లో అత్యధిక స్థానభ్రంశం గల బిందువు?
 ప్రస్పందన బిందువు
 స్థిర తరంగాల్లో అత్యల్ప స్థానభ్రంశం గల బిందువు?
 అస్పందన బిందువు
 అత్యధిక అయనీకరణ సామర్థ్యం గల కిరణాలు?
 ఆల్ఫా కిరణం
 అత్యల్ప అయనీకరణ సామర్థ్యం గల కిరణాలు?
 గామా కిరణాలు
 అత్యధిక చొచ్చుకొనిపోయే సామర్థ్యం గల కిరణాలు?
 గామా కిరణాలు
 అత్యల్ప చొచ్చుకొనిపోయే సామర్థ్యం గల కిరణాలు?
 ఆల్ఫా కిరణాలు
 అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం? ఫ్లోరిన్
 అత్యల్ప శక్తి గల కర్పరం? జు
 అత్యధిక ఎలక్ట్రాన్ అఫినిటీ గల మూలకం? క్లోరిన్
 అత్యంత తీయనైన చక్కెర? ఫ్రక్టోజ్
 అత్యంత శ్రేష్టమైన బొగ్గు? ఆంథ్రసైట్
 అత్యధిక ఆక్సీకరణ సామర్థ్యం గల మూలకాలు?
 హాలోజన్‌లు
 అత్యధిక క్షయకరణ సామర్థ్యం గల మూలకాలు?
 క్షారలోహాలు
 
 ఆకృతులు
 
 అణువులు/ఆర్బిటాల్    ఆకృతులు
 నీరు    కోణీయం, v ఆకృతి
 అమ్మోనియా    పిరమిడల్
 ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్    పిరమిడల్
 ఫాస్ఫరస్     {Osె గోనల్ బై
 పెంటాక్లోరైడ్    పిరమిడ్
 కార్బన్ డై ఆక్సైడ్    రేఖీయం
 వజ్రం    చతుర్ముఖీయం
 గ్రాఫైట్    షట్కోణాకృతి
 బక్ మినిస్టర్     పుల్లరిన్ ఫుట్‌బాల్
 s-ఆర్బిటాల్    గోళాకృతి
 P- ఆర్బిటాల్,     డంబెల్
 d- ఆర్బిటాల్    డబుల్ డంబెల్
 
 ఉపయోగాలు
 
 డోలాయమాన చలనం: గోడ గడియారానికి ఉండే లోలకం చేసే చలనం, సంగీత వాయిద్యాల తీగలు చేసే చలనం, స్ప్రింగ్ ద్రవ్యరాశి వ్యవస్థలోని చలనం.
 తిర్యక్ తరంగాలు: నీటి తరంగాలు, కాంతి తరంగాలు.
 అనుధైర్ఘ్య తరంగాలు: ధ్వనితరంగాలు, స్ప్రింగ్ ద్రవ్యరాశి వ్యవస్థలోని తరంగాలు.
 ఘనస్థితి లేసర్: రూబి లేసర్
 వాయుస్థితి లేసర్: హీలియం - నియాన్ లేసర్
 డయా అయస్కాంత పదార్థాలు: గాలి, నీరు, బిస్మత్, బంగారం, ఆల్కహాల్, పాదరసం.
 పారా అయస్కాంత పదార్థాలు: ఆక్సిజన్, అల్యూమి నియం, క్రోమియం, ప్లాటినం.
 ఫెర్రో అయస్కాంత పదార్థాలు: ఇనుము, కోబాల్డ్, నికెల్, గడోలినియమ్
 ఓమీయ వాహకాలు: లోహవాహకాలు.
 అఓమీయ వాహకాలు:అర్ధ వాహకాలు, విద్యుద్విశ్లేష్యాలు
 ఐసోటోపులు:1H1,1H2, 1H3; 10Ne20, 10Ne21, 10Ne22
 ఐసోబార్‌లు: 19K40, 20Ca40
 ఐసోటోన్‌లు: 14Si31, 15P32
 మితకారి: భారజలం
 విద్యుత్ బంధకాలు: ప్లాస్టిక్, చెక్క, వజ్రం, రబ్బరు.
 అర్ధవాహకాలు: స్వచ్ఛమైన జర్మేనియం, సిలికాన్.
 యంత్రభాష: అసెంబ్లెర్
 ఉన్నతస్థాయి భాష: బేసిక్, కోబాల్, ఫోర్ట్రాన్, జావా.
 నివేశ సాధనం: మౌస్, కీ-బోర్
 నిర్గమ సాధనం: ప్రింటర్, మానిటర్
 అతిపాతం: హైడ్రోజన్ అణువు
 P-P అతిపాతం: ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అణువులు
 S-P అతిపాతం: HCl, HI, (HBr)
 సిగ్మాబంధ…: HCl, H2, Cl2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement