టెక్నాలజీ సంబంధిత మేనేజ్‌మెంట్ కోర్సుల వివరాలు తెలియజేయండి?
- శ్రావణ్, తెనాలి.
ఐఐఎం అహ్మదాబాద్.. కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గ్రూప్ ఎలక్టివ్‌గా పీజీపీ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.iimahd.ernet.in
ఐఐఎం, బెంగళూరు.. సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజ్ మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను అందిస్తోంది.
వెబ్‌సైట్: www.iimb.ernet.in
ఐఐఎం, కోజికోడ్.. ఐటీ అండ్ సిస్టమ్స్ ఎలక్టివ్‌గా ఎంజీపీ ప్రోగ్రాంను అందిస్తోంది.
వెబ్‌సైట్:www.iimk.ac.in
ఐఐఎం, కోల్‌కతా.. కంప్యూటర్ ఎయిడెడ్ మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్:www.iimcal.ac.in
ఐఐఎం, లక్నో.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్ ఎలక్టివ్‌గా పీజీపీ మేనేజ్‌మెంట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్‌సైట్: www.iiml.ac.in
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుండాలి. క్యాట్ స్కోర్, జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
శైలేష్ జె.మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఐఐటీ బాంబే.. ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్టివ్స్‌తో మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాంను ఆఫర్ చేస్తోంది.
అర్హత: ఇంజనీరింగ్ లేదా సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ.
వెబ్‌సైట్: www.som.iitb.ac.in
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత: కనీసం 45 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. ఐసెట్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్:www.osmania.ac.in
ఎంఎస్ రామయ్య స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్, బెంగళూరు.. ఇంజనీరింగ్ ఆపరేషన్స్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది.
అర్హత: బీఈ, ఎంకామ్, ఎంఎస్సీ, బీబీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ. అకడమిక్ మెరిట్, ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.msrsas.org
ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.fms.edu
మైనింగ్ అండ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సు వివరాలు తెలియజేయండి?
- రఘు, ఖమ్మం.
మైనింగ్ అండ్ మెషినరీ ఇంజనీరింగ్‌ను ఇంజనీరింగ్‌లో ఉన్నత స్పెషలైజేషన్‌గా చెప్పుకోవచ్చు. ఇది గనుల్లో ఉపయోగించే యంత్రాలకు సంబంధించిన మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంశాలను వివరిస్తుంది. ఖనిజాల వెలికితీత, శుద్ధి ప్రక్రియలలో ఉపయోగపడే యంత్ర సామగ్రికి సంబంధించిన అంశాలను కోర్సులో భాగంగా బోధిస్తారు. ఈ కోర్సు కరిక్యులంలో మైనింగ్ మెథడ్స్ అండ్ మెషినరీ; మెకానిక్స్; ప్లానింగ్; మైన్ డెవలప్‌మెంట్; జియో మెకానిక్స్ అండ్ గ్రౌండ్ కంట్రోల్; అండర్‌గ్రౌండ్ హజార్డ్స్ అండ్ సర్ఫేస్ ఎన్విరాన్‌మెంట్; సర్వేయింగ్; మైన్ ప్లానింగ్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ అంశాలుంటాయి.
కోర్సు వివరాలు:
ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్‌ఎం), ధన్‌బాద్.. మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంటెక్ కోర్సులను అందిస్తోంది. బీటెక్ కోర్సుకు అర్హత 10+2. ఐఐటీ-జేఈఈలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. సంబంధిత అంశంలో బీటెక్ పూర్తిచేసినవారు ఎంటెక్ కోర్సులో చేరేందుకు అర్హులు. ఎంట్రన్స్/ గేట్‌లో ప్రతిభ ఆధారంగా ఎంటెక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
వెబ్‌సైట్: www.ismdhanbad.ac.in
కెరీర్: కోర్సు పూర్తిచేసినవారు మైనింగ్ ఇంజనీర్, జియోలాజికల్ ఇంజనీర్, మైనింగ్ మెషీన్ ఆపరేటర్, మైనింగ్ సూపర్‌వైజర్, ఎన్విరాన్‌మెంటల్ అండ్ హెల్త్ సేఫ్టీ మేనేజర్, మినరల్ సేల్స్ ఆఫీసర్ వంటి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. మైనింగ్‌తో సంబంధమున్న ప్రభు త్వ, ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, ఆర్సిలర్ మిట్టల్, కెయిర్న్ ఎనర్జీ,ఆదాని మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను టాప్ రిక్రూటర్లుగా చెప్పుకోవచ్చు.
కస్టమ్స్ ఆఫీసర్‌గా కెరీర్‌ను ప్రారంభించాలనుకుంటున్నాను. దీనికి ఏం చేయాలి?
-మధు, హైదరాబాద్.
కస్టమ్స్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్)కు ఎంపిక కావాలి. ఈ సర్వీస్‌లో ఇన్‌కం ట్యాక్స్, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ విభాగాలుంటాయి. దేశంలోకి వచ్చే వస్తువులపై పన్ను అంశాలు కస్టమ్స్ కిందకు వస్తాయి. దేశంలో ఉత్పత్తి అయిన వస్తువుల పన్ను అంశాలు ఎక్సైజ్‌కు సంబంధించినవి. ఐఆర్‌ఎస్‌కు ఎంపిక కావాలంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాయాలి. సివిల్స్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తుంది. గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు ఈ పరీక్ష రాయొచ్చు. ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసులతో పాటు ఐఆర్‌ఎస్ సర్వీస్‌కు కూడా అధికారులను ఎంపిక చేస్తారు.
సివిల్స్ పరీక్ష మూడు దశలుగా ఉంటుంది. 1. సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CSAT). 2. మెయిన్స్ ఎగ్జామినేషన్ 3. పర్సనాలిటీ టెస్ట్.
వెబ్‌సైట్: www.upsc.gov.in