టెక్నాలజీ సంబంధిత మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్న సంస్థల వివరాలు....
టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్‌వర్క్
మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) వివరాలు తెలియజేయండి?
-కరీం, నల్గొండ
మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్).. బిజినెస్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ప్రముఖ పరీక్ష. ప్రస్తుతం దేశంలోని 600కు పైగా బిజినెస్ స్కూళ్లు మ్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ పరీక్షను ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ)లోని సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగం నిర్వహిస్తోంది. మ్యాట్‌ను నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్‌గా మానవ వనరుల అభివృద్ధి శాఖ గుర్తించింది.
మ్యాట్‌ను ఏడాదికి నాలుగుసార్లు ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్‌లలో నిర్వహిస్తారు.
అర్హత: గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లోనూ పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
పరీక్ష విధానం:
మ్యాట్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 200 మార్కులు కేటాయించారు.
విభాగం {పశ్నల సంఖ్య
లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ 40
మ్యాథమెటికల్ స్కిల్స్ 40
డేటా అనాలసిస్ అండ్ సఫిసియెన్సీ 40
ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్ 40
ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ 40
వెబ్‌సైట్: www.aima.in
ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏమిటి? సంబంధిత కోర్సులను అందజేస్తున్న సంస్థలేవి?
- రాజేందర్, శ్రీకాకుళం
నెట్‌వర్క్ భద్రతా వ్యవస్థలోని లోపాలను గుర్తించి, భద్రతను మెరుగుపరిచే విధానాలు సూచించేది ఎథికల్ హ్యాకింగ్. నెట్‌వర్క్ భద్రతను పరిశీలించేందుకు ఎథికల్ హ్యాకర్లు.. హ్యాకింగ్ టూల్స్, టెక్నిక్స్‌ను ఉపయోగిస్తారు. ఎథికల్ హ్యాకింగ్ కోర్సులో నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్స్; నెట్‌వర్క్ ప్రోటోకాల్స్; హ్యాకింగ్‌లో ఉపయోగించే టూల్స్, టెక్నిక్స్ అంశాలను బోధిస్తారు.
కోర్సులు: ఇన్ఫర్మేషన్/ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్‌లో కోర్సులను అందజేస్తున్న సంస్థలు..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, హైదరాబాద్.. సర్టిఫైడ్ ప్రొఫెషనల్ హ్యాకర్ కోర్సును అందిస్తోంది.
వెబ్‌సైట్: www.iisecurity.in
జేఎన్‌టీయూ, హైదరాబాద్.. ఎంటెక్ కంప్యూటర్ నెట్‌వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోర్సును అందిస్తోంది. ఎంట్రన్స్/ గేట్ ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.jntuh.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఎంటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నెట్‌వర్క్స్ కోర్సును అందిస్తోంది.
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
ఐఐఐటీ, హైదరాబాద్.. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.iiit.ac.in
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, ఘజియాబాద్.. ఏడాది కాల వ్యవధితో సైబర్ సెక్యూరిటీలో పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది. అర్హత: గ్రాడ్యుయేషన్.
వెబ్‌సైట్: www.imtcdl.ac.in
కెరీర్: ఎథికల్ హ్యాకింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్‌తో సంబంధమున్న కంపెనీలు; బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో అవకాశాలుంటాయి.
టెక్నాలజీ సంబంధిత మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి?
- శ్వేత, కాగజ్‌నగర్.
సింబయోసిస్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పుణె.. ఐటీ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది.
అర్హత: గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: www.siu.edu.in
ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది. వెబ్‌సైట్: ఠీఠీఠీ.జఝట.్ఛఛీఠ
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్..
టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది.
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్
ఎంఎస్ రామయ్య స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్, బెంగళూరు..ఇంజనీరింగ్ ఆపరేషన్స్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది.
అర్హత: బీఈ/ఎంకాం/ఎంఎస్సీ/బీబీఏ/బీకాం/బీఎస్సీ/ బీఏ.
మెరిట్, ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.msrsas.org
నేను ఫైనాన్షియల్ ప్లానర్ కెరీర్‌లోకి అడుగుపెట్టాలనుకుంటున్నాను. దీనికి ఏం చేయాలి?
- భాగ్య, పటాన్‌చెరువు.
ఫైనాన్షియల్ ప్లానర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (సీఎఫ్‌పీ) కోర్సును పూర్తిచేయాలి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సేవల రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ సర్టిఫికేషన్ వీలు కల్పిస్తుంది. భారత్‌లో సీఎఫ్‌పీ సర్టిఫికెషన్‌ను ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డు ఇండియా అందిస్తుంది.
సీఎఫ్‌పీ సర్టిఫికేషన్‌ను సాధించిన వారు ఎప్పటికప్పుడు ఆర్థిక సేవల రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవాలి. ఆర్థిక ప్రణాళికల వ్యూహాలు, ఆర్థిక ఉత్పత్తులపై అవగాహన పెంపొందించుకోవాలి. అప్పుడే మెరుగైన సేవలను అందించగలరు.
సర్టిఫికేషన్ పొందిన వారికి బ్యాంకులు, పెట్టుబడుల సంస్థలు, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, విద్యా సంస్థల్లో అవకాశాలుంటాయి. సొంతంగా కన్సల్టెన్సీ సేవలను ప్రారంభించవచ్చు.
వెబ్‌సైట్: www.fpsbindia.org