ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే.. | Preparation Plan For JEE Main - 2014 | Sakshi
Sakshi News home page

ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే..

Published Thu, Jan 16 2014 2:22 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Preparation Plan For JEE Main - 2014

నిట్‌లు, ట్రిపుల్ ఐటీలతో పాటు వివిధ జాతీయస్థాయి ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ మెయిన్‌లో ప్రతిభ కనబర్చాలి. ఈ పరీక్షకు 60 శాతం వెయిటేజీ ఉండగా, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన మొదటి 1,50,000 మంది విద్యార్థులు ఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హులు. ఏప్రిల్‌లో జరిగే జేఈఈ మెయిన్ -2014లో అత్యధిక మార్కుల సాధనకకు ప్రిపరేషన్ వ్యూహాలు..
 
 
 మ్యాథమెటిక్స్
 2013 జేఈఈ మెయిన్ లేదా గత మూడేళ్ల ఏఐఈఈఈ పరీక్ష పత్రాలను పరిశీలిస్తే, మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ ప్రశ్నలు ఆల్జీబ్రా, కాలిక్యులస్ నుంచి వస్తున్నట్లు గమనించవచ్చు. ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతి సిలబస్‌కు సంబంధించి ఉంటున్నాయి.
 రాష్ట్ర ఇంటర్మీడియెట్ అకాడమీ మ్యాథమెటిక్స్ పుస్తకం లో ఉన్న చాప్టర్లతో పాటు మీన్ వాల్యూ థీరమ్; సెట్స్ అండ్ రిలేషన్స్; 3డీ లైన్స్; మ్యాథమెటికల్ లాజిక్; స్టాటిస్టిక్స్; సీక్వెన్స్ అండ్ సిరీస్‌లపై దృష్టిసారించాలి.
 జేఈఈ మెయిన్-2013 ప్రశ్నపత్రంలో మ్యాథమెటిక్స్ లో 30ప్రశ్నలు ఇచ్చారు. వీటిలో 16 ప్రశ్నలు(64 మార్కులు) 11వ తరగతి సిలబస్ నుంచి, 14 ప్రశ్నలు (56 మార్కులు) 12వ తరగతి సిలబస్ నుంచి వచ్చాయి.
 ఇంటర్ పరీక్షల తర్వాత చాలా తక్కువ వ్యవధిలో జేఈఈ మెయిన్ ఉంటుంది కాబట్టి, పటిష్టమైన ప్రిపరేషన్ ప్రణాళిక అవసరం. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షలను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో ఉన్న సమయంలో మొదటి 10 రోజులు ఇంటర్ ఫస్టియర్ అంశాల్లోని జేఈఈ స్థాయి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. 4-5 రోజులు ఇతర అంశాలైన 3-డి లైన్స్; సిరీస్; మ్యాథమెటికల్ లాజిక్; సెట్స్ అండ్ రిలేషన్స్‌లపై దృష్టిసారించాలి. 15 రోజులు ఇంటర్ సెకండియర్ సిలబస్‌కు కేటాయించాలి. అంటే ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షల కోసం చదువుతూ, అదే సమయంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలపై పట్టు సాధించాలి. అధిక ప్రాధాన్యత గల అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి.
 ఎంసెట్‌తో పోల్చితే జేఈఈ మెయిన్‌లో తక్కువ ప్రశ్నలుంటాయి. నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. అందువల్ల ఎన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించామనే దానికంటే, ఎన్నింటికి కచ్చితమైన సమాధానాలు గుర్తించామన్నది ముఖ్యం. ఎక్కువ పుస్తకాలను చదివేకంటే ప్రామాణిక మెటీరియల్‌ను క్షుణ్నంగా చదివి, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలపై దృష్టిసారించాలి.
 
 జేఈఈ మెయిన్-2013
 అంశాల వారీగా ప్రాధాన్యం
 కోఆర్డినేట్- 17 శాతం
 ఆల్జీబ్రా- 30 శాతం
 కాలిక్యులస్- 23 శాతం    
 ట్రిగనోమెట్రీ-10 శాతం
 ప్రాబబిలిటీ- 3 శాతం
 వెక్టార్స్ అండ్ 3-డి- 10 శాతం
 లాజికల్ రీజనింగ్, స్టాటిస్టిక్స్- 7 శాతం
 
 - ఎం.ఎన్.రావు,
 సీనియర్ ఫ్యాకల్టీ,
 శ్రీ చైతన్య విద్యా సంస్థలు.
 
 
 ఫిజిక్స్
 ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు, జేఈఈ మెయిన్‌కు మధ్య తక్కువ వ్యవధి ఉంటుంది కాబట్టి కచ్చితమైన సమయపాలనతో ప్రిపరేషన్ కొనసాగించాలి.
 ప్రిపరేషన్‌లో భాగంగా ఏదైనా ప్రశ్నను ఈ కింది 5 పాయింట్ ఫార్ములాతో సరిచూసుకుంటే ఆ ప్రశ్నను తేలిగ్గా సాధించవచ్చు. ఇది జేఈఈ మెయిన్‌కు బాగా ఉపయోగపడుతుంది.
 1.ముందుగా సాధించాల్సిన ప్రశ్న జఢత్వ చట్రం (Inertial Frame) లేదా త్వరణీకృత చట్రం (Non Inertial Frame) లో ఉందో తెలుసుకోవాలి.
 2.ప్రతి వస్తువుకీ స్వేచ్ఛా వస్తు పటాలు (Free Body Diagrams) గీసి వాటిపై ఉండే బలాలను లెక్కించాలి.
 3.ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రాన్ని ప్రయోగించవచ్చో లేదో చూసుకోవాలి. ఉదాహరణకు బాంబు పేలుళ్లు, తాడనాలు (Collisions), అన్ని రేడియో ధార్మికత పదార్థాల క్షీణతలు, అన్ని అణు చర్యల్లో Law of Conse-rvation of Linear Momentum ఉపయోగించాలని తెలుసుకోవాలి.
 4.ఇచ్చిన ప్రశ్నకు శక్తి నిత్యత్వ సూత్రాన్ని అనువర్తింపజేయవచ్చో లేదో తెలుసుకోవాలి. ఈ ప్రాథమిక సూత్రం.. ఉష్ణంలో First law of Thermodynamics గానూ, Fluid mechanicsలో బెర్నూలీ సమీకరణంగానూ, విద్యుత్‌లో కిర్కాఫ్ రెండో నియమంగానూ, విద్యుదయస్కాంత ప్రేరణలో లెంజ్ సూత్రంగానూ కనిపిస్తుంది.
 5.ఉపగ్రహాలు, దృఢ వస్తువు భ్రమణంలో కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రాన్ని ఉపయోగించాలి.
     
 ఫ్లూయిడ్ మెకానిక్స్; వేవ్స్, ఆధునిక భౌతిక శాస్త్రంలోని యంగ్ జంట చీలికల ప్రయోగం; ఫిజికల్ ఆప్టిక్స్ వంటి చిన్న యూనిట్లపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
 Ex: Two coherent point sources S1 and S2 are seperated by a small distance 'd'. The fringes obtained on the screen will be.. (JEE Main 2013). (ఈ ప్రశ్న సంబద్ధ కాంతి జనకాల లక్షణాలకు సంబంధించినది).
 1. points    2. straight lines    3. semicircles    4. concentric circles    Ans: 4
 జేఈఈ మెయిన్‌లోని 30 ప్రశ్నలకు గంటలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి కాన్సెప్టులు, వాటి అనువర్తనాలను క్షుణ్నంగా నేర్చుకుని.. అధిక మోడల్ పేపర్లను సాధన చేయాలి.
 
 జేఈఈ మెయిన్- 2013:
 పాఠ్యాంశం    {పశ్నల శాతం
 ఎలక్ట్రో డైనమిక్స్     30
 హీట్ అండ్ థర్మోడైనమిక్స్     7
 మెకానిక్స్     23
 మోడర్న్ ఫిజిక్స్     17
 ఆప్టిక్స్     13
 ఎస్‌హెచ్‌ఎం అండ్ వేవ్స్     10
 
 మెరుగైన స్కోర్‌కు మార్గం:
 జేఈఈ మెయిన్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు సిలబస్‌లోని ప్రతి అంశానికి చెందిన కాన్సెప్ట్‌లు, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, కన్జర్వేషన్ థీరమ్స్‌లను గుర్తించాలి. ఈ మూడు అంశాలకు సంబంధించి ఒకట్రెండు అనువర్తనాలతో సారాంశ పట్టికను రూపొందించుకోవాలి. ఈవిధంగా చేస్తే మొత్తం సిలబస్‌ను 40 కాన్సెప్టులు, 50 మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, 100 వరకు అనువర్తనాలకు కుదించవచ్చు. ఈ సారాంశ పట్టికను వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 ప్రిపరేషన్ లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి, సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి.
 ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో వాటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి. సాధనకు లొంగనిది ఏదీ ఉండదనే విషయాన్ని గుర్తించాలి.
 - జి. విజయసారథి,
 సీనియర్ ఫ్యాకల్టీ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు.
 
 
 
 
 కెమిస్ట్రీ
కెమిస్ట్రీ పాఠ్యాంశాలను స్థూలంగా మూడు విభాగాలుగా వర్గీకరించవచ్చు. అవి.. 1. ఫిజికల్ కెమిస్ట్రీ. 2. ఆర్గానిక్ కెమిస్ట్రీ. 3. ఇనార్గానిక్ కెమిస్ట్రీ. గత ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే ఈ మూడు విభాగాలకు సమానంగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి.
 
 ముఖ్యమైన అంశాలు:
 పీరియాడిక్ టేబుల్    
 కెమికల్ బాండింగ్
 మోల్ కాన్సెప్ట్ (కాన్సన్‌ట్రేషన్స్ కలిపి)
 రిడాక్స్ రియాక్షన్స్    
 క్వాలిటేటివ్ అనాలిసిస్
 జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ
 ఈ చాప్టర్లపై పట్టు సాధిస్తే, మిగిలిన చాప్టర్లను కూలంకశంగా చదివేందుకు దోహదపడుతుంది. పీరియాడిక్ టేబుల్‌పై అవగాహన పెంచుకొంటే, వివిధ అంశాలను అర్థం చేసుకోవడం తేలికవుతుంది.
 
 ఫిజికల్ కెమిస్ట్రీ:
 ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలను గుర్తించాలంటే తొలుత ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. ఇచ్చిన సమస్యను బట్టి సూత్రాన్ని అన్వయించుకునే సామర్థ్యం పెంపొందించుకోవాలి. విశ్లేషణాత్మకంగా ప్రిపరేషన్ సాగించాలి.
 
 మెరుగైన స్కోర్‌కు మార్గాలు:
 నేర్చుకున్న సూత్రాలను నోట్స్ రూపంలో పొందుపరుచుకోవాలి.
 ఒక టాపిక్‌ను చదవడం పూర్తయిన వెంటనే.. దానికి సంబంధించి వివిధ పుస్తకాల్లోని విభిన్న రకాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
 ప్రతి టాపిక్‌కు సంబంధించి కనీసం మూడు ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయాలి.
 
 ఆర్గానిక్ కెమిస్ట్రీ:
 ఈ విభాగానికి సంబంధించి తేలిగ్గా సమాధానం గుర్తించగల స్టీరియో ఐసోమరిజమ్ తరహా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రాథమిక భావనలపై పట్టు సాధించడంతో పాటు, విస్తృత స్థాయిలో చదవడమనే ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. ఇందులో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్ చాలా ముఖ్యమైంది. ఈ అంశంపై పట్టు సాధిస్తే, మిగిలిన అంశాలను అవగాహన చేసుకోవడం ఏమంత కష్టం కాదు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంశాలను ఎంతబాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది.
 
 మెరుగైన స్కోర్ సాధించాలంటే:
 చాప్టర్ల వారీగా రియాక్షన్స్‌ను నోట్ చేసుకోవాలి. ప్రతి రియాక్షన్‌కు సంబంధించి దాని విశ్లేషణ, వ్యవస్థ, ఉత్పత్తులు, అవసరమైన నిబంధలను ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి.
 రోజూ ఒక టాపిక్‌లోని కన్జర్వేషన్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్‌లో సబ్జెక్టివ్ వ ర్క్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యతనివ్వాలి.
 ఎంసెట్/జేఈఈ/ఏఐఈఈఈ గత ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
 ఇనార్గానిక్ కెమిస్ట్రీ:
 కెమిస్ట్రీలో.. ఇనార్గానిక్ కెమిస్ట్రీ పరిధి విస్తృతం. కాబట్టి అధిక శాతం మంది విద్యార్థులు ఈ అంశాన్ని కష్టమైందిగా భావిస్తారు. వాస్తవానికి పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, రిడాక్స్ రియాక్షన్స్, ఈక్విలిబ్రియం, ఎలక్ట్రో కెమిస్ట్రీ అంశాలపై పట్టుతో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఈ విభాగం నుంచి కాన్సెప్ట్ బేస్డ్ (ప్రాథమిక భావనల ఆధారంగా), స్ట్రక్చర్స్ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. అంతేకాకుండా కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి ప్రాధాన్యత పెరిగింది. ఇనార్గానిక్ కెమిస్ట్రీలోని మెటలర్జీ, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఎస్-బ్లాక్ ఎలిమెంట్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కీలక అంశాలు.
 
 మెరుగైన స్కోర్‌కు చేయాల్సినవి:
 నిర్దేశించిన సిలబస్‌ను అనుసరిస్తూ.. రిప్రెజెంటేటివ్ ఎలిమెంట్స్‌కు సంబంధించి నోట్స్ రూపొందించుకోవాలి.
 కోఆర్డినేట్ కాంపౌండ్స్‌కు అధిక సమయం కేటాయించాలి.
 మెటలర్జీ, క్వాంటిటేటివ్ అనాలిసిస్‌కు సంబంధించి ఫ్లో చార్ట్స్ రూపొందించుకోవడం మంచిది.
 ప్రిపరేషన్‌లో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి కనీసం రోజుకు గంట కేటాయించాలి.
 
 జేఈఈ మెయిన్-2013 అంశాల వారీగా ప్రశ్నలు:
 అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్     3
 కెమికల్ బాండింగ్     4
 Stoichiometry     3
 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్     2
 కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం     1
 కెమికల్ కైనటిక్స్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ     1
 కెమికల్ థర్మోడైనమిక్స్     1
 జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫంక్షనల్ గ్రూప్-1     4
 ఆర్గానిక్ కెమిస్ట్రీ- ఫంక్షనల్ గ్రూప్-2      2
 ఆర్గానిక్ కెమిస్ట్రీ- ఫంక్షనల్ గ్రూప్-3     2
 కెమిస్ట్రీ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్     2
 ట్రాన్సిషన్ ఎలిమెంట్స్     2
 కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ ఆర్గానోమెటాలిక్స్    1
 సర్ఫేస్ కెమిస్ట్రీ     1
 బయో మాలిక్యూల్స్     1
 - విజయకిశోర్,
 సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement