సివిల్స్ ఇంటర్వ్యూ.. విజయానికి దారిదీ!! | Civils: Interview Guidance | Sakshi
Sakshi News home page

సివిల్స్ ఇంటర్వ్యూ.. విజయానికి దారిదీ!!

Published Thu, Jan 16 2014 2:05 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Civils: Interview Guidance

స్వీయ అభ్యున్నతికి అసలైన సోపానంగా, సమాజ సేవకు దీటైన మార్గంగా వెలుగులీనుతున్న సివిల్ సర్వీసెస్ మహాయజ్ఞంలో రెండో దశ మెయిన్స్ పూర్తయింది. విషయ పరిజ్ఞానమే అభ్యర్థి మేధస్సుకు కొలమానమన్న పద్ధతికి స్వస్తిచెప్పి, బుద్ధికుశలతను, సామాజిక, సమకాలీన సమస్యలపై అవగాహనను పరీక్షించాలన్న ఉద్దేశంలో సరికొత్తగా నిర్వహించిన మెయిన్స్ మెట్టును అధిరోహిస్తామన్న ధీమాతో ఉన్నవారు పర్సనాలిటీ టెస్ట్ (మౌఖిక పరీక్ష)కు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో స్పెషల్ ఫోకస్...
 

 
 గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లతో నిర్వహించిన సివిల్స్ మెయిన్స్‌కు రాష్ట్రం నుంచి దాదాపు 600 మంది హాజరయ్యారు. వీరిలో 100 మంది వరకు మార్చి మూడో వారంలో ప్రారంభం కానున్న పర్సనాలిటీ టెస్ట్‌కు వెళ్లే అవకాశముంది. సివిల్స్ పరీక్ష మొత్తం 2,025 మార్కులకు ఉంటే అందులో 275 మార్కు లు ఇంటర్వ్యూకు కేటాయించారు. నచ్చిన సర్వీస్, కేడర్ చేజిక్కాలంటే ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు సాధించాలి. కనీసం 50-60 శాతం మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. ఏడు వరకు ఇంటర్వ్యూ బోర్డులుంటాయి. బోర్డులో వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉంటారు.


 
 సన్నద్ధతకు మార్గాలు
 
 వ్యక్తిగత వివరాలు: ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యక్తిగత వివరాలపై ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. అందువల్ల అభ్యర్థి తన పేరుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలి. సొంతూరు ప్రాధాన్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని, అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి. తన ఊరుకే ప్రత్యేకం (ఠజ్ఞీఠ్ఛ జ్ఛ్చ్టఠట్ఛట) అయిన అంశాలను తప్పకుండా తెలుసుకోవాలి. సొంత జిల్లా, రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, చదవాలి. ఉ్ఠ: అభ్యర్థి తిరుపతికి చెందిన వారైతే ఏడు కొండల పేర్లు చెప్పండి? అనే ప్రశ్న ఎదురుకావచ్చు.
 
తల్లిదండ్రుల నేపథ్యం: అభ్యర్థి కుటుంబ నేపథ్యంపై ప్రశ్నలు అడిగే అవకాశముంది. అందువల్ల తల్లిదండ్రుల వృత్తికి సంబంధించిన ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలి. అభ్యర్థి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారైతే తాము వేస్తున్న పంటలు, ధరలు వంటి వాటిని తెలుసుకోవాలి. అభ్యర్థి ఉత్సుకతను అంచనా వేసేందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు.
 
 అభిరుచులు:
ఇంటర్వ్యూలో తప్పనిసరిగా అభ్యర్థి అభిరుచుల (ఏౌఛఛజ్ఛీట)కు సంబంధించి ప్రశ్నను అడుగుతున్నారు. ఆ అభిరుచి.. పుస్తకాలు చదవడమైనా, క్రికెట్ ఆడటమైనా, ఇలా ఏదైనా కావొచ్చు. కానీ, తప్పనిసరిగా ఆ హాబీకి సంబంధించి వివిధ కోణాల్లో సమాచారాన్ని తెలుసుకోవాలి. హాబీ అంటేనే ఖాళీ సమయంలో చేసే ఇష్టమైన పని. అలాంటి ఇష్టమైన విషయానికి సంబంధించిన సమాచారం తెలియకపోతే, మిగిలిన విషయాలపై ఆసక్తి ఏముంటుంది? అని బోర్డు అభిప్రాయపడే అవకాశముంది.
 
 అకడమిక్ వివరాలు: అభ్యర్థి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. అందువల్ల అకడమిక్ నేపథ్యం, ప్రజా సేవలో వాటి ఆవశ్యకత అనే కోణంలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో విశ్లేషించుకొని ఇంటర్వ్యూకు సిద్ధమవాలి.
 
 ఆప్షనల్ సబ్జెక్టు: మెయిన్స్‌లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు కూడా వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల ఆప్షనల్‌కు సంబంధించిన సమకాలీన అంశాలను అధ్యయనం చేయాలి.
 
 టాప్ 3 సర్వీసులు: అభ్యర్థి ఎంపిక చేసుకున్న టాప్ 3 సర్వీస్‌ల ప్రాధాన్యాన్ని, వాటి వర్తమాన అంశాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు ఇలా ఎంపిక చేసుకున్న సర్వీస్‌లలో ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) ఉంటే ఇటీవల చోటుచేసుకున్న అమెరికాలో భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రాగడె ఉదంతం గురించి తెలుసుకోవాలి.
 
 వర్తమాన అంశాలు: అభ్యర్థులు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలపై తప్పనిసరిగా పట్టు సాధించాలి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడానికి కారణాలు, ఎన్నికల సంస్కరణలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు, పన్నుల సంస్కరణల అమలు అవసరమన్న మోడీ వ్యాఖ్యలు తదితరాలపై అడిగే ప్రశ్నలకు స్పష్టమైన అభిప్రాయాలను చెప్పగలగాలి. దీనికోసం దినపత్రికల్లోని సంపాదకీయాలను చదవడం, జాతీయ చానళ్లలో వివిధ అంశాలపై జరిగే చర్చలను గమనించాలి.
 
 అపోహలు వద్దు:
ఇంగ్లిష్‌లో ధారాళంగా మాట్లాడితేనే మంచి మార్కులు వస్తాయి.. దక్షిణాది వారితో పోలిస్తే ఉత్తరాది వారికే మార్కులు బాగా వేస్తారు.. ఫలానా బోర్డుతో ఇంటర్వ్యూ చాలా కష్టంగా ఉంటుంది.. ఎక్కువ సమయం ఇంటర్వ్యూ చేస్తేనే మంచి మార్కులు వస్తాయి.. ఇలాంటి లేనిపోని అపోహలు, భయాలు అనవసరం. నిజాయితీగా కష్టపడి, ఆత్మస్థైర్యంతో ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెడితే విజయం తప్పక వరిస్తుంది.
 
 మాక్ ఇంటర్వ్యూలు:
మాక్ ఇంటర్వ్యూలకు హాజరు కావడం వల్ల ఒక ప్రశ్నకు సమాధానం ఎలా చెబుతున్నాం? బలాలు, బలహీనతలేంటి? వంటి విషయాలను విశ్లేషించుకోవచ్చు. ఒక విషయంపై స్నేహితులు, ఫ్యాకల్టీతో చర్చించడం వల్ల ఇంటర్వ్యూకు అనుగుణంగా మాట్లాడే తీరు అలవడుతుంది.
 
 రోజువారీ ప్రణాళిక: ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌కు రోజుకు కనీసం గంటన్నర కేటాయించాలి. ఒకవేళ ఇంటర్వ్యూకి ఎంపిక కాకున్నా, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రిపరేషన్ మరో అవకాశాన్ని అందుకునేందుకు మార్గం సుగమం చేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
 
 
 ఎక్స్‌పర్ట్ వ్యూస్
 
 అభ్యర్థి నుంచి ఇంటర్వ్యూ బోర్డు ఆశించే అంశాలు:
 సమస్యపై స్పందించే గుణం.
 వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం.
 ఆలోచన, అవగాహన, విశ్లేషణా సామర్థ్యం.
 భావ వ్యక్తీకరణ సామర్థ్యం.
 నిజాయితీ (Integrity).

 
 దృష్టిసారించాల్సినవి:

 సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు.
 పరిశోధనలు- కొత్త ఆవిష్కరణలు.
 మార్స్ ఆర్బిటర్ మిషన్, జీఎస్‌ఎల్‌వీ డి-5 వంటి ప్రయోగాలు.
 రాష్ట్రంలో ఐటీ, వ్యవసాయ రంగం- తీరుతెన్నులు.
 ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన పరిణామాలు.
 సెజ్‌లు, కొత్త పోర్టుల ఏర్పాటు వంటి వాటిపై దృష్టిసారించాలి.
 సరికొత్త సిలబస్‌తో మెయిన్స్ పరీక్ష జరిగినట్లే, ఇంటర్వ్యూలోనూ నవ్యత కనిపించే అవకాశముంది. ఒక సంఘటనను వివరించి, ఆ సమయంలో నువ్వు ఎలా స్పందిస్తావు? తరహా ప్రశ్నలు అడిగే అవకాశముంది.
 
 రిఫరెన్స్:
 హిందూ దినపత్రిక- ఎడిటోరియల్స్.
 కనీసం రెండు తెలుగు దినపత్రికలు.
 వివిధ అంశాలపై జాతీయ చానళ్లలో చేపట్టే చర్చలు.
 వివిధ మంత్రిత్వ శాఖల అధికారిక వెబ్‌సైట్లు.
 -గురజాల శ్రీనివాసరావు, సీనియర్ ఫ్యాకల్టీ.
 
 
 
 విన్నర్ వ్యూస్..
 
 నిజాయితీగా సమాధానం చెప్పాలి

 మెయిన్స్ ఎలా రాసినప్పటికీ, ఇప్పటి నుంచే ఇంటర్వ్యూకి సిద్ధం కావడం మంచిది. దీనివల్ల వివిధ అంశాలపై మనదైన అభిప్రాయాలను ఏర్పరచుకునేందుకు వీలవుతుంది. ఒక అభ్యర్థి విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు ప్రిలిమ్స్, మెయిన్స్ సరిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే పర్సనాలిటీ టెస్ట్ అనేది అభ్యర్థి వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు ఉద్దేశించినది. ఇంటర్వ్యూలో ముఖ్యమైంది నిజాయితీ. అభ్యర్థి ఎంత నిజాయితీగా సమాధానం చెబుతున్నాడన్న దాన్ని బోర్డు నిశితంగా పరిశీలిస్తుంది. ఓ సమస్యపై స్పందించే గుణాన్ని, వ్యక్తి జీవిత వికాసానికి వారధుల్లాంటి నైతిక విలువలను అంచనా వేస్తుంది. ఈ క్రమంలో ఒక సమస్యను వివరించి, నీవైతే ఏం చేస్తావు? అనే కోణంలో ప్రశ్నలు అడుగుతుంటారు.
 
 ప్రశ్నను బాగా వినాలి. కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఒకవేళ సమాధానం తెలియకుంటే, తెలియదని చెప్పాలి. అంతేగానీ ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నించకూడదు. ముఖంపై చిరుదరహాసాన్ని చెదరనీయకూడదు. బోర్డు సభ్యులు చాలా ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఉంటారు. అందువల్ల ఒత్తిడికి గురికావాల్సిన పనిలేదు.
 
 నేను ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో భాగంగా ప్రత్యేక నోట్స్ రూపొందించుకున్నాను. ఒక్కో పేజీకి ఒక్కో అంశాన్ని కేటాయించి, దానికి సంబంధించి ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగేందుకు అవకాశముందో రాసుకున్నాను.


 పేజీ నెం.    అంశం    ఎలాంటి ప్రశ్నలు    అడగొచ్చు?
 1 నా పేరు ఆ పేరుకు అర్థం ఏమిటి? ఆ పేరుతో ఎవరైనా ప్రముఖులున్నారా?
 2 తల్లిదండ్రుల నేపథ్యం    .....
 3 పుట్టిన ఊరు    .....
 4 సొంత జిల్లా    .....
 నాకు పురుషోత్తమ్ అగర్వాల్ బోర్డ్‌తో దాదాపు 30 నిమిషాలు ఇంటర్వ్యూ జరిగింది. డిజిటల్ డివైడ్, సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్లు, రైల్వే, తెలుగు సినిమాలు తదితరాలపై ప్రశ్నలు అడిగారు.
 - జె.మేఘనాథ్ రెడ్డి, ట్రైనీ ఐఏఎస్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement