ఇంజనీరింగ్ కాలేజీలు.. విద్యార్థుల ఆశయాలకు ఊపిరిపోస్తాయి.. లక్ష్య సాధనకు సోపానాలవుతాయి..
ఇంజనీరింగ్ కాలేజీలు.. విద్యార్థుల ఆశయాలకు ఊపిరిపోస్తాయి.. లక్ష్య సాధనకు సోపానాలవుతాయి.. సబ్జెక్టుల సారాన్ని మెదడుకు ఒంటబట్టించి.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సముపార్జనకు సిద్ధం చేస్తాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కొత్త టెక్నాలజీలు కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా నచ్చిన కోర్సును ఎంపిక చేసుకొని, ఉన్నత కొలువుకు బాటలు వేసుకోవాలి.. ప్రస్తుతం యువతకు అధిక ఉద్యోగావ కాశాలను అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ‘డాట్ నెట్’పై ఫోకస్..
డాట్ నెట్ (dot net) అనేది ఒక సాఫ్ట్‌వేర్ ఫ్రేంవర్క్. ‘మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ’ ఆధారంగా అద్భుత కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే వారికి డాట్ నెట్ పునాది వంటిది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వెబ్ అప్లికేషన్స్, డెస్క్‌టాప్ అప్లికేషన్స్, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్‌ను అభివృద్ధి చేయొచ్చు. డాట్ నెట్ కోర్సు పూర్తిచేసిన వారికి ఉన్నత ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం యువతకు ఈ కోర్సుపై అమితాసక్తి ఉంది.
కోర్సుకు అర్హులెవరు?
బీఈ/ బీటెక్; ఎంసీఏ; ఎంఎస్సీ (సీఎస్/ఐటీ) కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులు డాట్ నెట్ కోర్సును నేర్చుకోవచ్చు.
బీఎస్సీ (సీఎస్ లేదా ఐటీ)ని ఉత్తమ ప్రతిభతో పూర్తిచేసిన వారు కోర్సులో చేరొచ్చు. ఇతర ఐటీ సంబంధిత కోర్సులను పూర్తిచేసిన వారు కూడా కోర్సులో అడుగుపెట్టొచ్చు.
మార్కెట్లో అనేక ఐటీ శిక్షణ సంస్థలు స్వల్పకాలిక డాట్‌నెట్ కోర్సును అందిస్తున్నాయి. తరగతి గది బోధనకు ప్రాక్టికల్స్‌ను జోడించి కోర్సులను నిర్వహిస్తున్నాయి. డాట్ నెట్ ప్యాకేజీలో భాగంగా ఇు, వీబీ డాట్ నెట్, ఏఎస్‌పీ డాట్ నెట్ పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు.
కోర్సు కరిక్యులం:
డాట్ నెట్ ఫ్రేంవర్క్.
ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్.
వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ యూజింగ్ ఏఎస్పీ.నెట్
డాట్ నెట్ రిమోటింగ్ అండ్ వెబ్ సర్వీసెస్ తదితర అంశాలను బోధిస్తారు.
డబ్ల్యూసీఎఫ్.
ఏజేఏఎక్స్.
టాప్ రిక్రూటర్స్:
మైక్రోసాఫ్ట్.
ఇన్ఫోసిస్.
ఐబీఎం.
ఇన్ఫోటెక్.
గూగుల్.
విప్రో.
డాట్‌నెట్‌తో ఉన్నత అవకాశాలు
ఇప్పుడు కళాశాలలు ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా డాట్‌నెట్‌పై కొంత పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఇలా కళాశాలల్లో డాట్‌నెట్‌పై ప్రాథమిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న విద్యార్థులు కళాశాలల నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తిస్థాయి కోర్సులో చేరి, ఉన్నత కెరీర్‌ను లక్ష్యంగా ఎంచుకోవాలి. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో డాట్‌నెట్ కోర్సు పూర్తి చేసిన వారిని అత్యున్నత ప్యాకేజీలతో ఉద్యోగావకాశాలు పలకరిస్తున్నాయి. డాట్‌నెట్‌తో పాటు SQL server, షేర్‌పాయింట్, ఎంఎస్‌బీఐ పరిజ్ఞానాన్ని కూడా సొంతం చేసుకుంటే కంపెనీల నియామక ప్రక్రియల్లో ముందుంటారు. స్పష్టమైన లక్ష్యంతో ఏ కోర్సులో చేరినప్పటికీ, కష్టపడి చదువుతూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తేనే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాన్ని అందుకోగలం.
- రావులింగ ప్రసాద్,
సీనియుర్ ఫ్యాకల్టీ
పీర్స్ టెక్నాలజీస్, హైదరాబాద్.