సచిన్, సీఎన్‌ఆర్ రావుకు.. భారతరత్న | Bharat Ratna for Sachin Tendulkar, scientist Professor CNR Rao | Sakshi
Sakshi News home page

సచిన్, సీఎన్‌ఆర్ రావుకు.. భారతరత్న

Published Thu, Jan 2 2014 1:48 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

తాలిబన్లను ఎదిరించి బాలికల హక్కులకోసం పోరాడిన పాకిస్థానీ అమ్మాయి మలాలాను ఎన్నో అవార్డులు.. నోబెల్‌కు మించిన నగదు మొత్తంలో బ్రేక్ త్రూ ప్రైజ్.. గతేడాది విశేషాలు

 2013 - అవార్డులు
 
తాలిబన్లను ఎదిరించి బాలికల హక్కులకోసం పోరాడిన పాకిస్థానీ అమ్మాయి మలాలాను ఎన్నో అవార్డులు..  నోబెల్‌కు మించిన నగదు మొత్తంలో బ్రేక్ త్రూ ప్రైజ్.. గతేడాది విశేషాలు
 
ఒరియా నవలా రచయిత్రి ప్రతిభా రే.. 2011 సంవత్సరానికి  జ్ఞాన్‌పీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు.  ఈ పురస్కారాన్ని అందుకునే 47వ రచయిత్రి ప్రతిభారే.
 
 ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ ‘2012 అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు’కు ఎంపికయ్యారు.
 
ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తమ పనితీరు కనబరిచిన మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాలకు కృషికర్మన్ అవార్డులు వరించాయి.
 
2012 సంవత్సరానికి ‘చైనా అకాడమీ ఆఫ్ సెన్సైస్’ అవార్డుకు ప్రముఖ శాస్త్రవేత్త, డాక్టర్ సీఎన్‌ఆర్ రావు ఎంపికయ్యారు.
 
భారత ప్రభుత్వం ఏటా ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డులను జనవరి 25న ప్రకటించింది. మొత్తం 108 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించగా.. నలుగురికి పద్మవిభూషణ్, 24 మందికి పద్మభూషణ్, 80 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.  వీరిలో మన రాష్ట్రం నుంచి పద్మ అవార్డులు పొందిన వారు: పద్మభూషణ్: డి.రామానాయుడు (సినీ నిర్మాత). పద్మశ్రీ: గజం అంజయ్య (ఆర్ట్), రేకందర్ నాగేశ్వరరావు అలియాస్ సురభి బాబ్జీ (ఆర్ట్), డాక్టర్ ముదుండి రామకృష్ణరాజు (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), డాక్టర్ జయరామన్ గౌరీశంకర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), డాక్టర్ సి.వెంకట ఎస్.రామ్ అలియాస్ చిట్టా వెంకట సుందర రామ్ (వైద్యం), డాక్టర్ రాధిక హర్జ్‌బెర్గర్ (సాహిత్యం, విద్య). వీరుగాక.. రాష్ట్రానికి చెందిన సినీ ప్రముఖులు ఎస్.జానకి (తమిళనాడు- పద్మభూషణ్, ఈమె పురస్కారాన్ని తిరస్కరించారు), బాపు (తమిళనాడు-పద్మశ్రీ), శ్రీదేవి (మహారాష్ట్ర-పద్మశ్రీ)లకు ఇతర రాష్ట్రాల కోటాలో పద్మ అవార్డులు లభించాయి.
 
 ఉత్తమ ఓటర్ల విధానాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేసిన కృషికిగాను గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లకు 2012 సంవత్సరానికి ఎన్నికల సంఘం అవార్డులు దక్కాయి
 
 దక్షిణ సూడాన్‌కు చెందిన బిషప్ ఎమిరైటస్ పరైడ్ తబన్‌కు 2013 ఐక్యరాజ్య సమితి శాంతి బహుమతి దక్కింది. ఈ బహుమతిని ‘సెర్గియా వియోరా డి మెల్లో’గా పిలుస్తారు. 2003లో ఇరాక్‌లో బాంబు దాడిలో మరణించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం అధిపతి సెర్గియో వియోరా డీ మెల్లో (బ్రెజిల్) పేరిట ఈ బహుమతిని అందజేస్తు న్నారు. ఈ బహుమతి కింద 5,500 డాలర్లు బహూకరిస్తారు.
 
 భారత సంతతికి చెందిన కృష్ణ అరోరా (85) అలియాస్ ఆంటీజీకి 2013 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా మెడల్’ లభించింది. ఆస్ట్రేలియాలో ఆమె చేసిన స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. 2012లో ఈ పురస్కారం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు దక్కింది.
 
 85వ ఆస్కార్ అవార్డులు: ఉత్తమ చిత్రం-ఆర్గో, ఉత్తమ దర్శకుడు-ఆంగ్ లీ (లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ నటుడు-డేనియల్ డే లూయిస్(లింకన్), ఉత్తమ నటి - జెన్నిఫర్ లారెన్స్ (సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్), ఉత్తమ విదేశీ చిత్రం - ఆమర్; ప్రపంచంలో ఇప్పటివరకూ ఎవరూ ప్రకటించనంత భారీ మొత్తంలో రూ.15 కోట్లతో (నోబెల్ బహుమతి కంటే రెండింతలు ఎక్కువ) ‘బ్రేక్ త్రూ ప్రైజ్’ అనే సైన్స్ బహుమతిని సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, రష్యా వ్యాపారవేత్త యూరీ మిల్నర్‌లు నెలకొల్పారు.
 
 ప్రవాస భారతీయ విద్యావేత్త, బ్రిటన్‌లోని న్యూక్యాసిల్ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుగతా మిత్రా 2013 ఏడాదికిగాను ఫిబ్రవరి 26న అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రతిష్టాత్మక ‘టెడ్’ ప్రైజ్ అందుకున్నారు.
 
 దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక పోరాటయోధుడు డెస్మండ్ టూటుకు (81) 2013 సంవత్సరానికిగానూ టెంపుల్టన్ ప్రైజ్ లభించింది.
 
 భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బంగ్లాదేశ్‌లో పర్యటనలో భాగంగా బంగ్లా ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. 1971 నాటి దేశ స్వాతంత్య్రానికి చేసిన కృషికిగాను ‘బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాట గౌరవ పురస్కారా’న్ని ఆయనకు బహూకరించింది.
 
 ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అరుణ్ జైట్లీ (బీజేపీ), 2011కు కరణ్ సింగ్ (కేంద్ర మాజీ మంత్రి), 2012కుగాను  శరద్ యాదవ్ (జనతాదళ్-యు)కు బెస్ట్ పార్లమెంటేరియన్  అవార్డులు వరించాయి.
 
 ఢిల్లీ ధీర వనిత ‘నిర్భయ’ను మార్చి 8న (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) కేంద్ర ప్రభుత్వం ‘రాణి లక్ష్మీ బాయి-స్త్రీ శక్తి’ అవార్డుతో గౌరవించింది.
 
 తొలిసారిగా ప్రదానం చేస్తున్న ఠాగూర్ అంతర్జాతీయ సాంస్కృతిక, సామరస్య పురస్కారం-2012 సితార్ విద్వాంసుడు స్వర్గీయ పండిట్ రవిశంకర్‌కు లభించింది.
 
 2012 సంవత్సరానికి 60వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ఉత్తమ చిత్రం: పాన్ సింగ్ తోమర్ (హిందీ-దర్శకుడు: తిగ్మాంషూ ధూలియా) ఉత్తమ నటుడు: ఇర్ఫాన్ ఖాన్ (హిందీ చిత్రం ‘పాన్ సింగ్ తోమర్) విక్రమ్ గోఖలే (మరాఠీ చిత్రం ‘అనుమతి’)లకు సంయుక్తంగా. ఉత్తమ నటి: ఉషా జాదవ్  (మరాఠీ చిత్రం ‘ధాగ్) ఉత్తమ దర్శకుడు: శివాజీ లోతన్ పాటిల్ (మరాఠీ చిత్రం-ధాగ్), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం: ఈగ, తెలుగులో ఉత్తమ చిత్రం: ఈగ.
 
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011కి గాను ప్రకటించిన చలన చిత్ర అవార్డులు: ఎన్‌టీఆర్ జాతీయ అవార్డు - అమితాబ్ బచ్చన్ (బాలీవుడ్ నటుడు), బీఎన్‌రెడ్డి ఆత్మీయ అవార్డు - శ్యాంబెనగల్ (దర్శకుడు), నాగిరెడ్డి - చక్రపాణి జాతీయ అవార్డు-జి.ఆదిశేషగిరిరావు (నిర్మాత), రఘపతి వెంకయ్య అవార్డు- కైకాల సత్యనారాయణ (నటుడు).
 
 న్యూయార్క్ టైమ్స్ పత్రికకు నాలుగు పులిట్జర్ అవార్డులు లభించాయి.
 
 బాలీవుడ్ నటుడు ప్రాణ్ కిషన్ సికంద్(93)కు 2012 సంవత్సరానికి గానూ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది.
 
 ప్రముఖ రచయిత రావూరి భరద్వాజకు 2012 సంవత్సరానికి 48వ జ్ఞాన్‌పీఠ్ అవార్డు వరించింది. ఆయన రాసిన ‘పాకుడురాళ్లు’ నవలకు ఈ పురస్కారం లభించింది. తొలిసారి తెలుగు వచన రచనకు ఈ అవార్డు దక్కింది. తెలుగులో జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని దక్కించుకున్న మూడో వ్యక్తి భరద్వాజ. ఇంతకు ముందు 1970లో విశ్వనాథ సత్యనారాయణ, 1988లో సి.నారాయణ రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
 
 ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి అవార్డు 2011-12 సంవత్సరానికి సిక్కిం గ్రామీణాభివృద్ధి నిర్వహణ, అభివృద్ధి శాఖకు లభించింది.
 
 కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ఐక్యరాజ్యసమితి ప్రజా సేవ అవార్డును ప్రకటించింది.
 
 పాకిస్థాన్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్.. 2013కుగాను గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డుకు ఎంపికయ్యారు.
 
 ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ అమెరికా రచయిత్రి లిడియా డేవిస్‌ను వరించింది.
 
 ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారుడు జుబిన్ మెహతా 2013 ఠాగూర్ సాంస్కృతిక సామరస్య పురస్కారానికి ఎంపికయ్యారు.
 
వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే రామన్ మెగసెసే అవార్డులను అఫ్ఘానిస్థాన్‌కు చెందిన హబిబా సరాబీ తోపాటు లాహ్‌పేయ్ సెంగ్ రా (మయన్మార్), ఎర్నెస్టో డొమింగో (ఫిలిప్పీన్స్), నేపాల్‌కు చెందిన మనుషుల అక్రమ రవాణా నిరోధక సంస్థ, ఇండోనేషియాకు చెందిన అవినీతి వ్యతిరేక సంస్థలకు ఈ అవార్డులు దక్కాయి.
 
ప్రముఖ సరోద్ విద్వాంసుడు అమ్జాద్ అలీఖాన్ 21వ రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డుకు ఎంపికయ్యారు. మత సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
 
ప్రతిష్టాత్మక క్రీడా అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర ట్రాప్ షూటర్ రంజన్ సోధికి దక్కింది. విరాట్ కోహ్లీ(క్రికెట్), పి.వి. సింధు (బ్యాడ్మింటన్), కవితా చాహల్ (బాక్సింగ్), జోత్స్న చినప్ప (స్క్వాష్)తోపాటు పలువురికి అర్జున అవార్డులు వరించాయి.
 
కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్- 2013 అవార్డు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఎ)కి లభించింది.
 
అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (నాసా) కాంట్రాక్టర్‌గా పనిచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు జర్మనీకి చెందిన విజిల్ బ్లోయర్ ప్రైజ్ లభించింది.
 
అమెరికా విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ 2013 సంవత్సరానికి యూరోపియన్ పార్లమెంట్ అవార్డు ‘సఖరోవ్ మానవ హక్కుల బహుమతి’కి ఎంపికయ్యారు.
 
2012 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్‌కు ప్రదానం చేశారు.
 
నోబెల్ బహుమతులు-2013: వైద్యవిభాగంలో జేమ్స్ రోత్‌మాన్, రాండీ షెక్‌మాన్ (అమెరికా), జర్మనీ సంతతి శాస్త్రవేత్త థామస్ స్యూదోఫ్‌లు ఎంపికయ్యారు. శాంతి: ప్రపంచవ్యాప్తంగా రసాయన ఆయుధాల నిర్మూలనకు కృషి చేస్తున్న ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ (ఓపీసీడబ్ల్యూ)కు లభించింది. ఫిజిక్స్: దైవకణం (హిగ్స్‌బోసాన్)పై కీలక పరిశోధనలు చేసినందుకు పీటర్ హిగ్స్ (బ్రిటన్), ఫ్రాంకోయిస్ ఎంగ్లెర్ట్ (బెల్జియం)లకు లభించింది. రసాయన శాస్త్రం: మార్టిన్ కార్‌ప్లస్,మైకేల్ లెవిట్, ఆరీ వార్షెల్ (అమెరికా). సాహిత్యం: కెనడాకు చెందిన ఆలిస్ మన్రోకు వరించింది. అర్థ శాస్త్రం: ఈజెన్ ఫామా, లార్స్ పీటర్స్ హాన్సన్, రాబర్ట్ షిల్లర్ (అమెరికా).
 
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు 2012 ‘ఇందిరాగాంధీ జాతీయ సమగ్రత అవార్డు’ లభించింది.
 
న్యూజిలాండ్‌కు చెందిన ఎలీనర్ కాటన్ (28)కు 2013 సంవత్సరానికి ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ లభించింది. ఈ బహుమతి పొందిన అత్యంత పిన్న వయస్కురాలు కాటన్. ఆమె రాసిన ‘ద లూమినరీస్’ అనే నవలకు ఈ బహుమతి లభించింది.
 
దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నకు క్రికెట్ కీడాకారుడు సచిన్ టెండ్కూలర్ (40), ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు (79)లను భారత ప్రభుత్వం ప్రకటించింది. 2009 తర్వాత భారతరత్నను ప్రకటించడం ఇదే తొలిసారి. సర్ సి.వి.రామన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత భారతరత్నకు ఎంపికైన మూడో శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావు. కాగా తొలి క్రీడాకారుడు, అతి పిన్న వయస్కుడు సచిన్.
 
పనాజీలో 44వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు జరిగాయి. ఉత్తమ చిత్రంగా తూర్పు తైమూర్ నిర్మించిన తొలి చిత్రం ‘బీట్రిజ్ వార్’ కు బంగారు నెమలిదక్కింది. వెండి నెమలి అవార్డు: మెగే దాకా తారా (బెంగాలీ, దర్శకత్వం: కమలేశ్వర్ ముఖర్జీ) ఉత్తమ దర్శకుడు: కౌశిక్ గంగూలీ (చిత్రం: అపూర్ పాంచాలి), ఉత్తమ నటుడు: అలోన్ మోని అబేత్‌బేల్ (చిత్రం: ఎ ప్రెస్ ఇన్ హెలెన్), ఉత్తమ నటి: మగ్దలెనా బోక్‌జరాస్కా (చిత్రం: ఇన్‌హైడింగ్) ఎంపికయ్యారు.
 
 ఢిల్లీ ధీర వనిత ‘నిర్భయ’ను ప్రతిష్టాత్మక ‘అంతర్జాతీయ సాహస వనిత’ (ఉమెన్ ఆఫ్ కరేజ్) పురస్కారంతో అమెరికా ప్రభుత్వం గౌరవించింది.
 
2013 సంవత్సరానికి 58వ ఫిల్మ్ ఫేర్ అవార్డులు: ఉత్తమ చిత్రం-బర్ఫీ, ఉత్తమ నటుడు-రణ్‌బీర్ కపూర్ (చిత్రం: బర్ఫీ) ఉత్తమ నటి-విద్యాబాలన్ (చిత్రం: కహానీ), ఉత్తమ దర్శకుడు- సుజోయ్ ఘోష్ (చిత్రం: కహానీ).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement