ఇంటర్ ఎంపీసీ.. 100 రోజుల ప్రణాళిక | 100 days planning in inter mpc group | Sakshi
Sakshi News home page

ఇంటర్ ఎంపీసీ.. 100 రోజుల ప్రణాళిక

Published Thu, Nov 28 2013 2:03 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

విద్యార్థి జీవితంలో కీలకమైన ఇంటర్ పరీక్షలు మార్చి 12న ప్రారంభం కానున్నాయి.

విద్యార్థి జీవితంలో కీలకమైన ఇంటర్ పరీక్షలు మార్చి 12న ప్రారంభం కానున్నాయి. ఉన్నత కెరీర్‌కు అత్యున్నత సోపానాలుగా నిలిచే ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు ప్రాధాన్యం ఉంది. దీంతో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు కీలకమయ్యాయి. వీటికి దాదాపు వంద రోజులు మాత్రమే గడువున్న నేపథ్యంలో ఎంపీసీలో గరిష్ట మార్కుల సాధనకు ప్రిపరేషన్ ప్లాన్..

 

  ఇంటర్ సెకండియర్

 వివిధ పోటీ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండటం, ఇంటర్ పరీక్షలకు పోటీ పరీక్షలకు మధ్య తక్కువ వ్యవధి ఉండటం వల్ల ప్రిపరేషన్‌కు కచ్చితమైన ప్రణాళికను అనుసరించాలి. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకును ఆశించే వారు ఫస్టియర్, సెకండియర్ మ్యాథ్‌‌స, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. ఇదే సమయంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షల కోసం లఘు సమాధాన ప్రశ్నలను చదవాలి. ఇప్పుడు 80 శాతం సమయాన్ని ఎంట్రెన్స్‌ల కోసం, 20 శాతం సమయాన్ని ఇంటర్ పరీక్షలకు కేటాయించాలి.

 

 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్, లాంగ్వేజ్‌లు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు 80 శాతం సమయాన్ని కేటాయించాలి. మిగిలిన సమయాన్ని ఆబ్జెక్టివ్ ప్రశ్నల ప్రిపరేషన్‌కు వెచ్చించాలి. ఫిబ్రవరి 15 నుంచి పూర్తి సమయాన్ని ఇంటర్ పరీక్షలకు ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో అకాడమీ పుస్తకాల్లోని ముఖ్యమైన అంశాలను చదవాలి. మ్యాథమెటిక్స్‌లో అన్ని సమస్యల (దీర్ఘ, లఘు సమాధాన)ను సాధించాలి. అన్ని ఉదాహరణ సమస్యల్ని ప్రాక్టీస్ చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోని ప్రతి పాఠాన్నీ క్షుణ్నంగా చదివి, తర్వాత పాఠం చివర ఉన్న ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ప్రాక్టీస్ చేయాలి.

 

 

 స్లో లెర్నర్స్- ప్రిపరేషన్:

 స్లో లెర్నర్స్ అయితే డిసెంబర్ 15 వరకు మాత్రమే ఇంటర్, పోటీ పరీక్షలకు చదవాలి. డిసెంబర్ 16 నుంచి మార్చి 25 వరకు పూర్తి సమయాన్ని ఇంటర్‌లో ఎక్కువ మార్కులు సాధించేందుకే వెచ్చించాలి. గత మూడేళ్ల ఐపీఈ ప్రశ్నపత్రాల్లోని అన్ని దీర్ఘ సమాధాన ప్రశ్నలు, సిలబస్‌లోని ముఖ్యమైన దీర్ఘ సమాధాన ప్రశ్నల సమాధానాలను చదవాలి. తర్వాత లఘు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలపై దృష్టిసారించాలి. కాలేజీలో ప్రతి వారాంతపు, ప్రి ఫైనల్ పరీక్షలను రాయాలి. ఒక పరీక్షలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని, తర్వాతి పరీక్షల్లో ఎక్కువ స్కోర్ సాధించేందుకు కృషి చేయాలి.

 

 మ్యాథమెటిక్స్

 2-ఎ, 2-బి మ్యాథమెటిక్స్‌లో అధిక మార్కులు సాధించేందుకు తెలుగు అకాడమీ పుస్తకాలను బాగా చదవాలి. వాటిలో అతి స్వల్ప సమాధాన ప్రశ్నలపై ఎక్కువ దృష్టిసారించాలి. ఈ తరహా ప్రశ్నలు ఫార్ములాలు, కాన్సెప్టుల సమ్మేళనంగా ఉంటాయి. ప్రతి చాప్టర్ చివర వీటికి సంబంధించిన ఉదాహరణ సమస్యలు ఉంటాయి. వాటిని తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.

 గత మూడేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలించి ఏ అంశాలకు ప్రాధాన్యం ఉంది? సమస్యలను ఎలా అడుగుతున్నారో తెలుసుకోవాలి. ముఖ్యమైన ఫార్ములాలు, డెరివేషన్స్‌పై అవగాహన పెంపొందించుకోవాలి.

 అతి స్వల్ప సమాధాన ప్రశ్నల తర్వాత విద్యార్థులు దృష్టిసారించాల్సినవి వ్యాస రూప సమాధాన ప్రశ్నలు. వీటిని పేపర్ల వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రాక్టీస్ చేయాలి.

 ముఖ్యమైన చాప్టర్లు: 2-ఎలో ర్యాండమ్ వేరియబుల్స్; ద్విపద సిద్ధాంతం; మాత్రికలు, నిర్ధారకాలు; సంకీర్ణ సంఖ్యలు; సాంఖ్యక శాస్త్రం. 2-బిలో వృత్తాలు, పరావలయం, కలన గణితం.

 

 ప్రాక్టీస్.. ప్రాక్టీస్:

 మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ మార్కులు సాధించేందుకు ఉత్తమ మార్గం.. ప్రాక్టీస్. సెకండియర్ సిలబస్‌లోని ఇంటెగ్రల్ కాలిక్యులేషన్స్, వర్గ సమీకరణాలు, ద్విపద సిద్ధాంతం, సంభావ్యత, పరావలయం అంశాలు కష్టమైనవిగా భావిస్తారు. ఆయా అంశాల సిలబస్ పరిధి వల్ల భయపడుతుంటారు. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించి, ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తే ఎలాంటి కష్టమైన సమస్యను అయినా తేలిగ్గా సాధించవచ్చు.

 

 2-ఎ (వెయిటేజీ)/అంచనా:

 సంకీర్ణ సంఖ్యలు- 8 మార్కులు; డిమూవర్స్ సిద్ధాంతం- 9 మార్కులు; వర్గ సమీకరణాలు- 6 మార్కులు; థియరీ ఆఫ్ ఈక్వేషన్స్- 9 మార్కులు; ప్రస్తారాలు, సంయోగాలు- 12 మార్కులు; ద్విపద సిద్ధాంతం- 16 మార్కులు; పాక్షిక భిన్నాలు- 4 మార్కులు; సాంఖ్యక శాస్త్రం- 9 మార్కులు; సంభావ్యత- 15 మార్కులు; ర్యాండమ్ వేరియబుల్స్- 9 మార్కులు.

 

 2-బి (వెయిటేజీ):

 వృత్తాలు- 22 మార్కులు; వృత్తాల వ్యవస్థ- 6 మార్కులు; పరావలయం- 8 మార్కులు; దీర్ఘవృత్తం- 8 మార్కులు; అతి పరావలయం- 6 మార్కులు; సమాకలనులు- 18 మార్కులు; నిశ్చిత సమాకలనులు- 15 మార్కులు; అవకలన సమీకరణాలు- 10 మార్కులు.

 

 గత మూడేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలించి ఏ అంశాలకు ప్రాధాన్యం ఉంది? సమస్యలను ఎలా అడుగుతున్నారో తెలుసుకోవాలి. ముఖ్యమైన ఫార్ములాలు, డెరివేషన్స్‌పై అవగాహన పెంపొందించుకోవాలి.

 

 

 ఫిజిక్స్

 ఫస్టియర్‌తో పోల్చితే సెకండియర్ ఫిజిక్స్ కొంత కష్టమని విద్యార్థులు భావిస్తారు. అయితే ప్రణాళిక ప్రకారం చదివితే సెకండియర్ ఫిజిక్స్‌లోనూ అధిక మార్కులు తెచ్చుకోవచ్చు.

 

 పాఠ్యాంశాలు- వెయిటేజీ/అంచనా:

 వేవ్స్- 6 మార్కులు; రే ఆప్టిక్స్, ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్- 8 మార్కులు; వేవ్ ఆప్టిక్స్- 4 మార్కులు, విద్యుత్ క్షేత్రం- 4 మార్కులు; పొటన్షియల్, కెపాసిటర్ 4 మార్కులు; కరెంట్ ఎలక్ట్రిసిటీ- 10 మార్కులు; మూవింగ్ ఛార్జెస్ అండ్ మాగ్నటిజం- 14 మార్కులు; అయస్కాంతత్వం- 2 మార్కులు; విద్యుదయస్కాంత ప్రేరణ- 2 మార్కులు; ఏసీ విద్యుత్- 2 మార్కులు; పరమాణువు- 8 మార్కులు; కేంద్రకం- 6 మార్కులు; సెమీ కండక్టర్ పరికరాలు- 6 మార్కులు; కమ్యూనికేషన్ సిస్టమ్స్- 2 మార్కులు.

 దీర్ఘ సమాధాన ప్రశ్నలకు ముఖ్యమైన అంశాలు: వేవ్ మోషన్; కేంద్రకం; సెమీ కండక్టర్ పరికరాలు; మూవింగ్ ఛార్జెస్- మాగ్నటిజం; విద్యుదయస్కాంత ప్రేరణ.

 స్వల్ప సమాధాన ప్రశ్నలకు ముఖ్యమైనవి: సెమీ కండక్టర్ పరికరాలు; కరెంట్ ఎలక్ట్రిసిటీ; అయస్కాంతత్వం; ఎలక్ట్రిక్ పొటన్షియల్, రే ఆప్టిక్స్; డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్.

 స్లో లెర్నర్స్ ఇప్పటి నుంచి డిసెంబర్ చివరి వరకు అన్ని వ్యాసరూప ప్రశ్నలతో పాటు కొన్ని స్వల్ప సమాధాన, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలపై దృష్టిసారించాలి. జనవరి మొత్తం సమయాన్ని 4 మార్కులు, రెండు మార్కుల ప్రశ్నల ప్రిపరేషన్‌కు కేటాయించాలి.వేవ్ మోషన్, కేంద్రకం, సెమీ కండక్టర్ పరికరాలు, అయస్కాంతత్వం, విద్యు దయస్కాంత ప్రేరణ చాప్టర్లపై మాత్రమే ఎక్కువగా దృష్టి సారించాలి. ఫిబ్రవరి మొత్తాన్ని డిసెంబర్, జనవరిలో చదివిన అంశాల రివిజన్‌కు ఉపయోగించుకోవాలి.

 

 వేవ్ మోషన్; కేంద్రకం;

 సెమీ కండక్టర్ పరికరాలు; మూవింగ్ ఛార్జెస్- మాగ్నటిజం; విద్యుదయస్కాంత ప్రేరణ అంశాలు దీర్ఘ సమాధాన

 ప్రశ్నలకు ముఖ్యమైనవి.

 

 

 కెమిస్ట్రీ

 మారిన సిలబస్‌లో పాఠ్యాంశాలు పరిమాణంలో పెద్దవిగా, కొంత క్లిష్టంగా ఉన్నాయి. కెమిస్ట్రీలో 60కి 60 మార్కులు తెచ్చుకోవాలంటే మొదట తెలుగు అకాడమీ పుస్తకాన్ని క్షుణ్నంగా చదవాలి. ముఖ్యమైన పాయింట్లను అండర్‌లైన్ చేసుకోవాలి. చాప్లర్ల చివర ఇచ్చిన ఉదాహరణలు, ప్రశ్నలను బాగా చదవాలి. ఇప్పటి నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నలపై ఎక్కువగా దృష్టిసారించాలి. ముఖ్యంగా విద్యుత్ రసాయనిక శాస్త్రం; కెమికల్ కెనైటిక్స్; పి-బ్లాక్ ఎలిమెంట్స్; ఇ, ఏ, ై కలిగిన ఆర్గానిక్ పదార్థాల చాప్టర్లలోని దీర్ఘ సమాధాన ప్రశ్నలు చదవాలి. ఆర్గానిక్ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను తప్పనిసరిగా పేపర్‌పై రాస్తూ ప్రాక్టీస్ చేయాలి. జనవరిలో ముఖ్యమైన లఘు సమాధాన, నాలుగు మార్కుల ప్రశ్నలపై శ్రద్ధచూపాలి. ఫిబ్రవరి, మార్చిలో అప్పటి వరకు చదివిన అంశాలను రివిజన్ చేయాలి.

 

 పాఠ్యాంశాలు- వెయిటేజీ/అంచనా:

 సాలిడ్ స్టేట్- 4 మార్కులు; ద్రావణాలు-6 మార్కులు; విద్యుత్ రసాయన శాస్త్రం- 10 మార్కులు; సర్ఫేస్ కెమిస్ట్రీ- 4 మార్కులు; లోహ శాస్త్రం- 6 మార్కులు; పి బ్లాక్ మూలకాలు-12 మార్కులు; డి,ఎఫ్ బ్లాక్ మూలకాలు- 6 మార్కులు; పాలిమర్స్- 4 మార్కులు; బయో మాలిక్యూల్స్-4 మార్కులు; నిత్య జీవితంలో కెమిస్ట్రీ-4 మా ర్కులు; ఏౌ్చ్చజ్చ్ఛుట, ఏౌ్చ్చట్ఛ్ఛట 4 మార్కులు; ఇ, ఏ, ై కలిగిన ఆర్గానిక్ పదార్థాలు- 8 మార్కులు; నైట్రోజన్ కలిగిన ఆర్గానిక్ పదార్థాలు- 4 మార్కులు.

 

 విద్యుత్ రసాయనిక శాస్త్రం;

 కెమికల్ కెనైటిక్స్; పి-బ్లాక్  ఎలిమెంట్స్; C, H, Oకలిగిన ఆర్గానిక్ పదార్థాల చాప్టర్లలోని  దీర్ఘ సమాధాన ప్రశ్నలు చదవాలి.

 ఆర్గానిక్ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను తప్పనిసరిగా  పేపర్‌పై రాస్తూ ప్రాక్టీస్ చేయాలి.

 

 

 జూనియర్ ఇంటర్

 

 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఉందన్న విషయాన్ని గుర్తించి, ఫస్టియర్‌లో కూడా ఎక్కువ మార్కులు సాధించేందుకు కృషి చేయాలి. ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్, రికార్డుల పని ఉండదు కాబట్టి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి నుంచే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోని ముఖ్యమైన దీర్ఘ, లఘు సమాధాన ప్రశ్నలన్నింటినీ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి వారం ఐపీఈ నమూనా పరీక్షలు రాసి, తప్పులను సరిదిద్దుకోవాలి.

 

 మ్యాథమెటిక్స్

 మూడు సబ్జెక్టుల్లో మ్యాథమెటిక్స్ ముఖ్యమైంది. మార్కుల పరంగా కూడా కీలకమైంది.  1-ఎ (వెయిటేజ్): మాత్రికలు - 22 మార్కులు, మ్యాథమెటికల్ ఇండక్షన్ - 7 మార్కులు, వెక్టార్ ఆల్జీబ్రా - 20 మార్కులు, ఫంక్షన్‌‌స - 9 మార్కులు.

 1-బి (వెయిటేజ్): బిందుపథం- 4 మార్కులు; అక్షీయ పరివర్తనం- 4 మార్కులు; సరళరేఖలు- 15 మార్కులు; సరళరేఖా యుగ్మాలు-14 మార్కులు; 3డి జ్యామితి-11 మార్కు లు; అవధులు, అవిచ్ఛిన్నత- 8 మార్కులు; అవకలనాలు- 15 మార్కులు; అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ - 26 మార్కులు.

 

 కెమిస్ట్రీ

 కెమిస్ట్రీలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు ప్రధానంగా రసాయన బంధం, పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, కర్బన రసాయన శాస్త్రం నుంచి వస్తాయి.కాబట్టి వీటికి అధిక సమయం కేటాయించాలి. కెమిస్ట్రీలో ఎక్కువగా అతిస్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకంలో రోజుకో చాప్టర్ చదువుతూ ముఖ్యమైన పాయింట్లను అండర్‌లైన్ చేస్తూ నోట్స్ తయారు చేసుకోవాలి. పాఠం చివర ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసుకోవాలి.

 కర్బన రసాయన శాస్త్రం, బోర్న్ హేబర్ వలయం, హైడ్రోజన్ స్పెక్ట్రం, అయనైజేషన్ పొటెన్షియల్, పీరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. కర్బన రసాయన శాస్త్రంలో నేమ్డ్ రియాక్షన్స్, ప్రాపర్టీస్ అంశాలను బాగా చదవాలి.

 జనరల్ కెమిస్ట్రీలోని Stoichiometry, ఫిజికల్ కెమిస్ట్రీలోని Stoichiometry, కెమికల్ కైనటిక్స్, ఎనర్జిటిక్స్‌లోని కాన్సెప్టులను నేర్చుకొని, సమస్యలన్నింటినీ సాధన చేయాలి.

 Stoichiometry, అటామిక్ స్ట్రక్చర్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వీటిల్లో ఉండే సమస్యలను సాధన చేయడంతోపాటు సినాప్సిస్‌ను రూపొందించుకుని చదవాలి.

 

 ఫిజిక్స్

 జూనియర్ ఇంటర్ విద్యార్థులు ఎక్కువగా భయపడే సబ్జెక్టు ఫిజిక్స్. అందువల్ల దీనిపై తొలుత ఇష్టం పెంచుకొని, శ్రద్ధ తో చదవడం అలవరచుకోవాలి. అన్ని చాప్టర్లలోని కాన్సెప్టులను ఒంటబట్టించుకొని, సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.

 

 ముఖ్యమైన చాప్టర్లు:

 సింపుల్ హార్మోనిక్ మోషన్; రొటేటరీ మోషన్; కైనమాటిక్స్; వెక్టార్స్; కైనటిక్ గ్యాస్ థియరీ; గ్యాస్, లిక్విడ్, సాలిడ్ వ్యాపనాలు. వెక్టార్స్‌లోని భౌతిక సిద్ధాంతాలను ఔపోసన పట్టడం ద్వారా ఆ చాప్టర్‌పై పట్టు సాధించవచ్చు. రొటేటరీ మోషన్, యాంగులర్ మూవ్‌మెంట్, పొజిషన్ వెక్టార్, యూనివర్సల్ గ్రావిటేషనల్ లా, ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ అతి ముఖ్యమైనవి.

 సింపుల్ హార్మోనిక్ మోషన్‌లో టైం ఫేజ్, సమస్యల సాధనలో దాని ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించుకోవాలి.

 సర్ఫేస్ టెన్షన్‌లో నిత్య జీవితంలో దాని ఉపయోగాలు, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, కేపిలారిటీ- దాని ఉపయోగాలను చదవాలి.

 థర్మో డైనమిక్స్‌లో జౌల్స్ లా, హీట్ కాలిక్యులేషన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరిమీటర్, అడియాబాటిక్, ఐసోథర్మల్ ఛేంజెస్ మొదలైన వాటిని బాగా చదవాలి.

 

ఎం.ఎన్.రావు,

 శ్రీ చైతన్య విద్యా సంస్థలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement