‘ఐఐఎస్సీ’లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులేవి? | courses in Indian Institute Of Science | Sakshi
Sakshi News home page

‘ఐఐఎస్సీ’లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులేవి?

Published Thu, Dec 19 2013 2:15 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

courses in Indian Institute Of Science

‘ఐఐఎస్సీ’లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులేవి?
 నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తిచేశాను. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. సంస్థ, కోర్సు వివరాలు తెలియజేయగలరు?
 - అశోక్, నల్గొండ.
 
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుణె.. బేసిక్ సెన్సైస్‌లో పరిశోధనలకు కేంద్రంగా నిలుస్తోంది. ఈ సంస్థ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తోంది.
 సంస్థలో బయలాజికల్/ లైఫ్ సెన్సైస్; కెమికల్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. కెమికల్ సెన్సైస్‌లో పీహెచ్‌డీ చేయాలనుకుంటే ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్ విభాగాల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
 అర్హత: కెమిస్ట్రీ/ఫిజిక్స్/బయోకెమిస్ట్రీ/మెటీరియల్ సైన్స్/బయోఇన్ఫర్మాటిక్స్/ఫార్మసీలో ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సును పూర్తిచేసి ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు వచ్చుండాలి. ఈ కింది అర్హతల్లో తప్పనిసరిగా ఏదో ఒకటి ఉండాలి.
 సీఎస్‌ఐఆర్ నెట్-జేఆర్‌ఎఫ్ లేదా డీబీటీ-జేఆర్‌ఎఫ్-ఏ లేదా ఐసీఎంఆర్-జేఆర్‌ఎఫ్.
 సీఎస్‌ఐఆర్-ఎల్‌ఎస్ లేదా డీఏఈ-జెస్ట్ లేదా గేట్‌లో తగిన స్కోర్.
 ఐఐఎస్‌ఈఆర్ బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ విద్యార్థులు.
 ఎంట్రెన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక.
 వెబ్‌సైట్: www.iiserpune.ac.in
 
 ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి?
 - శ్రీధర్, నిర్మల్.
 ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ.. ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి ప్రక్రియలను వివరిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఔషధాల తయారీ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్, బయో టెక్నాలజీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి.
 కోర్సులు:
 జి.పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎం.ఫార్మసీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: బి.ఫార్మసీ. ఎంట్రెన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.gprcp.ac.in
 కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎం.ఫార్మసీని అందిస్తోంది. అర్హత: బి.ఫార్మసీ. ఎంట్రెన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 విట్ యూనివర్సిటీ, వెల్లూరు.. ఎంఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సును ఆఫర్ చేస్తోంది.
 వెబ్‌సైట్: www.vit.ac.in
 బిట్స్ పిలానీ, హైదరాబాద్.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎం.ఫార్మసీని ఆఫర్ చేస్తోంది. అర్హత: బి.ఫార్మసీ. ఎంట్రెన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.bits-pilani.ac.in/hyderabad
 
 ఆర్మీలో డాక్టర్‌గా చేరాలంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి?
 - అనిత, రాయదుర్గం.
 రక్షణ దళాల్లో డాక్టర్‌గా చేరడానికి ఒక మార్గం.. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్, పుణె. ఇది యూజీ, పీజీ కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. ఎంబీబీఎస్ కాల వ్యవధి నాలుగున్నరేళ్లు. తర్వాత ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
 అర్హత: ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత. సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు రావాలి. ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులుండాలి.
 వయోపరిమితి:
 వయసు 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
 అవివాహితులై ఉండాలి.
 కోర్సు చేస్తున్న సమయంలో వివాహానికి అనుమతించరు.
 ఎంపిక:
 ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
 ఏఎఫ్‌ఎంసీలో ఎంబీబీఎస్ కోర్సులో చేరేముందు సాయుధ దళాల మెడికల్ సర్వీసెస్‌లో కమిషన్డ్ ఆఫీసర్స్‌గా ఏడేళ్లపాటు విధులు నిర్వహిస్తామని అంగీకార పత్రం అందజేయాల్సి ఉంటుంది. సంబంధిత బాండ్ అగ్రిమెంట్‌పై అభ్యర్థి తల్లిదండ్రులు/ గార్డియన్ సంతకం చేయాలి.
 వెబ్‌సైట్: www.afmc.nic.in
 ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా హోల్డర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్స్ కూడా సైన్యంలోని మెడికల్ సర్వీసెస్‌లో చేరొచ్చు. ఈ కోర్సులకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) గుర్తింపు ఉండాలి. వీరు శాశ్వత కమిషన్ లేదా షార్ట్ సర్వీస్ కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
 వెబ్‌సైట్: afmc.nic.in; indianarmy.nic.in
 
 
 ఐఐఎస్సీ ఆఫర్ చేస్తున్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల వివరాలు తెలపగలరు?
 - మాధవి, విజయవాడ.
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు.. నాలుగేళ్ల వ్యవధితో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, మెటీరియల్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వంటి కీలక విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా 10+2ను కనీసం 60 శాతం మార్కులతో లేదా తత్సమాన గ్రేడ్‌తో పూర్తిచేసుండాలి.
 
 కేవైపీవై-ఎస్‌ఏ/ కేవైపీవై-ఎస్‌బీ/ కేవైపీవై-ఎస్‌ఎక్స్/ ఎస్‌బీ/ ఐఐటీ-జేఈఈ/ఏఐపీఎంటీలో ప్రతిభ ఆధారంగా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.iisc.ernet.in

టి.మురళీధరన్

టి.ఎం.ఐ. నెట్ వర్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement