టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్‌వర్క్
VLSI డిజైన్ అంటే ఏమిటి? దీనికి సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి?
- రమ, విజయనగరం.
లక్షలాది ట్రాన్సిస్టర్లను చిప్‌తో అనుసంధానం చేసి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను రూపొందించే మొత్తం ప్రక్రియ.. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (VLSI) టెక్నాలజీ. దీనికి సంబంధించి సర్టిఫికెట్, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కోర్సుల వివరాలు:
జేఎన్‌టీయూ, హైదరాబాద్.. ఎంఎస్-వీఎల్‌ఎస్‌ఐ ప్రోగ్రాంను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కమ్యూనికేషన్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఐటీలో బీటెక్ (ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత).
వెబ్‌సైట్: www.jntuh.ac.in
మణిపాల్ యూనివర్సిటీ, మణిపాల్.. ఎంఎస్సీ-టెక్ (వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, వెరిఫికేషన్) కోర్సును అందిస్తోంది. అర్హత: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్‌లో బీఎస్సీ లేదా బీసీఏను కనీసం 50 శాతం మార్కులతో పూర్తిచేయాలి. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.manipal.edu
ఐఐఐటీ, హైదరాబాద్.. ఎంటెక్ (వీఎల్‌ఎస్‌ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్) కోర్సును అందిస్తోంది. అర్హత: బీటెక్/ బీఈ (ఈసీఈ). ఎంట్రన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.iiit.ac.in
విట్ యూనివర్సిటీ, వెల్లూరు.. ఎంటెక్ (వీఎల్‌ఎస్‌ఐ డిజైన్)ను ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. గేట్ స్కోర్‌కు ప్రాధాన్యం ఉంటుంది.
వెబ్‌సైట్: www.vit.ac.in
కెరీర్: వీఎల్‌ఎస్‌ఐ కోర్సు పూర్తిచేసిన వారు చిప్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్; ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్ డెవలప్‌మెంట్; కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్; స్మార్ట్ ఎనర్జీ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, మెడికల్ టెలీమెట్రీ అప్లికేషన్ వంటి విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. టెస్ట్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి.
ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్- ఎంబీఏ కోర్సు వివరాలు తెలపగలరు?
- అనిత, కోదాడ.
దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ఒకటి. దీనికి సంబంధించిన క్లినికల్ రీసెర్చ్, ఆర్ అండ్ డీ, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్ తదితర విభాగాల నిర్వహణకు మేనేజర్ స్థాయి మానవ వనరుల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ కోర్సును విద్యా సంస్థలు అందుబాటులో ఉంచుతున్నాయి.
కోర్సుల వివరాలు:
నర్సీమోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ముంబై.. ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏను అందిస్తోంది.
వెబ్‌సైట్: www.nmims.edu
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ రీసెర్చ్, పంజాబ్.. ఎంబీఏ (ఫార్మా) కోర్సును ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.niper.nic.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్, లక్నో.. ఫార్మా మార్కెటింగ్‌లో మాస్టర్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
వెబ్‌సైట్: www.iipmindia.com
కెరీర్: కోర్సు పూర్తిచేసిన వారికి డ్రగ్ డెవలప్‌మెంట్, బయోటెక్నాలజీ, క్లినికల్ రీసెర్చ్, డ్రగ్ డిస్ట్రిబ్యూషన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో అవకాశాలుంటాయి.
కమర్షియల్ అగ్రికల్చర్, బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు వివరాలు తెలియజేయండి?
- శివ, కర్నూలు.
బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సును కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, రాజేంద్రనగర్ ఆఫర్ చేస్తోంది. ఫిజికల్ సెన్సైస్; బయలాజికల్/నేచురల్ సెన్సైస్/మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సును పూర్తిచేసుండాలి. ఎంసెట్ ర్యాంకు ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు.
కెరీర్: కోర్సు పూర్తిచేసిన వారికి వ్యవసాయ పరిశ్రమలు, బ్యాంకులు, ఆహార శుద్ధి పరిశ్రమలు, నీటిపారుదల సంస్థలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, అక్వాకల్చర్ పరిశ్రమల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి.
వెబ్‌సైట్: www.angrau.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్, పుణె.. వివరాలు తెలియజేయండి?
- శరత్, కరీంనగర్.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐబీఎం)ను భారతీయ రిజర్వ్ బ్యాంకు నెలకొల్పింది. ఇది బ్యాంకింగ్, పైనాన్షియల్‌కు సంబంధించి వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇందులో ముఖ్యమైంది పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్). కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసిన వారు అర్హులు. క్యాట్/ఏటీఎంఏ/ సీమ్యాట్; జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
కెరీర్: బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ స్పెషలైజేషన్‌తో పీజీ డిప్లొమా పూర్తిచేసిన వారికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో మేనేజర్ స్థాయి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి.
వెబ్‌సైట్: nibmindia.org
ఎన్‌ఐబీఎం అందించే కోర్సుల వివరాలు..
Published Thu, Feb 20 2014 3:24 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement