వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలకు ఏర్పాటు పూర్తి హాజరుకానున్న
60 వేల మంది అభ్యర్థులు 161 పరీక్షా కేంద్రాలు..
భారీ భద్రతసెంటర్ల వద్ద 144 సెక్షన్.. జిరాక్స్ కేంద్రాల మూసివేత
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్:
గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుడు (వీఆర్‌ఏ) పోస్టులకు ఆదివారం రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 6 ముఖ్య పట్టణాల్లో 154 పరీక్ష కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు అక్షరాల 60 వేల 4 వందల 63 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 98 వీఆర్‌ఓ పోస్టులకు రికార్డు స్థాయిలో 57,820 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 172 వీఆర్‌ఏ పోస్టులకు 2,643 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. నాలుగు వేలకు పైగా అధికారులు, ఉద్యోగులు ఇప్పటికే వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
అభ్యర్థులూ.. బీ అలర్ట్
ఏపీపీఎస్సీ సవరించిన నియమ నిబంధనల మేరకు నిర్ణయిం చిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల ప రిసర ప్రాంతాలను గమనించేందుకు వీడియో చిత్రీకరణ చే యనున్నారు. పరీక్ష జరిగే ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను, లై బ్రరీలను మూసివేయాల్సిందిగా ఇప్పటికే అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులు తమతో పాటు ఏదై నా గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని సూచి ంచారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 652 మంది అభ్యర్థు లు వాని ఫొటోలను సరిగ్గా అప్‌లోడ్ చేయలేదని అధికారులు గుర్తించారు. ఈ అభ్యర్థులు గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ గల మూడు ఫొటోలను పరీక్ష కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
హెల్ప్ డెస్క్‌లు
అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలు, పరీక్ష కేంద్రాల సమాచారం తెలియజేసేందుకు రెవెన్యూ అధికారులు పరీక్ష జరిగే కేంద్రాల వద్ద, పట్టణాల్లోని బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేశారు.
రవాణా అసలు సమస్య
వీఆర్‌ఓ పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో సమీప ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయలేకపోయారు. చాలా మంది అభ్యర్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లా ల్సి వస్తోంది. దీంతో రవాణా అతి పెద్ద సమస్యగా మారింది. జిల్లాలోని సుదూర ప్రాంతాలైన నారాయణ్‌ఖేడ్, సంగారెడ్డి, సిద్ధిపేట ప్రాంతాల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు తీసుకుంది. ఆయా ప్రాం తాల నుంచి ఉదయం 4 గంటల నుంచే అభ్యర్థుల డి మాండ్ మేరకు బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తె లిపారు.
కేంద్రాల వద్ద బందోబస్తు
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్, మహిళ కానిస్టేబుళ్లు పరీక్ష కేంద్రాల స్క్రీనింగ్ వద్ద విధులు నిర్వహించనున్నారు.
43 రూట్లలో ఎ స్పీ ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షించేందుకు ఏఎస్పీ మొద లు కొని కిందిస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాల వద్ద అత్యవసర వైద్య సేవలు అందించేందు కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తగిన ఏర్పాట్లు చేశారు.