గ్రూప్-2 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచనలు | TSPSC Instructions To The Group II Candidates | Sakshi
Sakshi News home page

గ్రూప్-2 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచనలు

Published Tue, Nov 1 2016 12:49 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

గ్రూప్-2 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచనలు

గ్రూప్-2 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచనలు

- 11, 13లలో తెలంగాణ గ్రూప్-2 పరీక్షలు
- పరీక్షకు భారీ ఏర్పాట్లు
- హాల్‌టికెట్‌తోపాటు గుర్తింపు కార్డు తప్పనిసరి
 
హైదరాబాద్‌: తెలంగాణలో నవంబర్ 11,13 తేదీల్లో జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు టీఎస్‌పీఎస్సీ పగడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది. 1,032  పోస్టుల భర్తీకి గాను ఈ నెల 11, 13 తేదీలలో రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ పోస్టులకు రికార్డు స్థాయిలో 7,89,985 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,911 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబర్ 11న పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. పేపర్-2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. నవంబర్ 13న పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. పేపర్-4 తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పరీక్ష నిర్వహణను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరింది. అభ్యర్థులు ఎలాంటి అపోహలు నమ్మొద్దని సూచించింది. పూర్తిస్థాయి సూచనల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సంప్రదించాలని కోరింది.
 
 
అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచనలు:
 
- అభ్యర్థులు బూట్లు, నగలు, చెవిపోగులు, చేతి గడియారాలు కూడా ధరించకూడదు.
- ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు, లాగ్‌ టేబుల్స్, చేతి బ్యాగులు, పర్సులు, నోట్‌బుక్స్, చార్టులు, రికార్డింగ్‌ పరికరాలకు అనుమతి లేదు. 
- చేతి వేళ్లపై గోరింటాకు(మెహందీ), ఇంక్‌ వంటివి లేకుండా చూసుకోవాలి.
- అభ్యర్థులు హాల్‌ టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలని పేర్కొంది. హాల్‌ టికెట్‌పై ఫొటో కానీ, సంతకం      కానీ సరిగా లేని అభ్యర్థులు తమ వెంట రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను తెచ్చుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. 
- ఉదయం 9.45 గంటల తర్వాత, మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని తెలిపింది.
- తనిఖీ ప్రక్రియతో పాటు బయోమెట్రిక్‌ విధానం ద్వారా అభ్యర్థుల వేలి ముద్ర, ఫొటో తీసుకుంటామని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. 
- ఓఎంఆర్‌ పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్నుతోనే రాయాల్సి ఉంటుంది.  పూర్తిస్థాయి సూచనలు, వివరాల కోసం టీఎస్‌పీఎస్సీ   వెబ్‌సైట్‌ను అభ్యర్థులు పరిశీలించాలని కోరింది.
- పెన్సిల్‌, ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌తో రాసిన ఓఎంఆర్‌ జవాబు పత్రాలను అనర్హతగా ప్రకటిస్తామని పేర్కొంది. ఒరిజినల్‌ ఓఎంఆర్‌ పత్రంతో పరీక్షా  కేంద్రం బయటికెళ్తే ఆ అభ్యర్థిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని హెచ్చరించింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని, క్రమశిక్షణా చర్యలు  తీసుకుంటామని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement