గ్రూప్‌–2లో కార్బన్‌లెస్‌ కాపీ! | TSPSC Plans for carbon less copy to group-2 exam | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2లో కార్బన్‌లెస్‌ కాపీ!

Published Wed, Nov 2 2016 4:26 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

గ్రూప్‌–2లో కార్బన్‌లెస్‌ కాపీ!

గ్రూప్‌–2లో కార్బన్‌లెస్‌ కాపీ!

సమాధానపత్రం కాపీని అభ్యర్థులు తీసుకెళ్లేందుకు అవకాశం
ఏర్పాట్లు చేసిన టీఎస్‌పీఎస్సీ, వెబ్‌సైట్లో అభ్యర్థులకు సూచనలు
పరీక్షకు బూట్లు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలతో రావద్దు
హాల్‌టికెట్‌తోపాటు ఒక ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి
ఉదయం 9:45 గంటలు దాటితే పరీక్షకు నో!
మూడు నాలుగు రోజుల్లో హాల్‌టికెట్ల జారీ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌:
గ్రూప్‌–2 రాతపరీక్షల్లో అభ్యర్థులు ఓఎంఆర్‌ సమాధాన పత్రం కార్బన్‌లెస్‌ కాపీని వెంట తీసుకెళ్లేందుకు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) అవకాశం కల్పిస్తోంది. అభ్యర్థులు తాము రాసిన సమాధానాలను సరిచూసుకునేందుకు, పరీక్షానంతరం సందేహాలను నివృత్తి చేసుకునేందుకు తోడ్పడుతుందనే యోచనతో ఈ నిర్ణయం తీసుకుంది. 1,032 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న గ్రూప్‌–2 పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 7,89,985 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

వారందరికీ సమాధాన పత్రం కార్బన్‌లెస్‌ కాపీని అందజేసేలా టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. అభ్యర్థులు జవాబులు రాసే ఒరిజినల్‌  ఓఎంఆర్‌ పత్రం కింద ఈ డూప్లికేట్‌ కాపీ ఉంటుంది. ఓఎంఆర్‌ పత్రంలో గుర్తించే (బబుల్‌ చేసే) సమాధానాలు కింద ఉన్న కార్బన్‌లెస్‌ కాపీపైనా అచ్చుగా ఏర్పడతాయి. దీనివల్ల అభ్యర్థులు తాము రాసిన జవాబులను చూసుకునేందుకు, రికార్డు కోసం తమ వద్ద ఉంచుకునేందుకు వీలవుతుంది.

పకడ్బందీగా ఏర్పాట్లు..
గ్రూప్‌–2 పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవాప్తంగా 1,941 వరకు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌–2 పరీక్ష ఉంటాయి. 13వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్‌–3, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌–4 పరీక్ష జరుగుతాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 8:15 గంటల నుంచి 9:45 గంటల మధ్య.. మధ్యాహ్నం 1:15 గంటల నుంచి 2:15 గంటల మధ్య పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లవచ్చని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. నిర్ధారిత సమయం తర్వాత అభ్యర్థులెవరినీ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిబోమని స్పష్టం చేసింది. అభ్యర్థులకు హాల్‌టికెట్ల జారీని మూడు నాలుగు రోజుల్లో ప్రారంభించనుంది. ఇక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను టీఎస్‌పీఎస్సీ తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు (పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు, పాస్‌పో ర్టు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగి అయితే సంస్థ ఐడీ కార్డు వంటివి) తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.
హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేని అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను వెంట తెచ్చుకోవాలి.
పూర్తిస్థాయిలో తనిఖీ చేశాకే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా అభ్యర్థుల చేతివేలి ముద్ర, డిజిటల్‌ ఫొటో తీసుకుంటారు. ఆ వివరాలను టీఎస్‌పీఎస్సీకి దరఖాస్తు చేసిన వివరాలతో పోల్చిచూస్తారు.
ప్రశ్నపత్రం బుక్‌లెట్‌ కవర్‌లోనే ఓఎంఆర్‌ జవాబు పత్రం ఉంటుంది. బెల్‌ కొట్టిన తరువాతే ప్రశ్నపత్రం బుక్‌లెట్‌ను విప్పాలి. ప్రశ్నపత్రం బుక్‌లెట్‌ కోడ్‌ 7 నంబర్లతో ఉంటుంది. బుక్‌లెట్‌ సిరీస్‌ కోడ్‌ రెండు డిజిట్ల (ఏబీ, బీసీ, సీడీ, డీఏ)తో ఉంటుంది. ఓఎంఆర్‌ జవాబు పత్రం ఏడు నంబర్లతో ఉంటుంది.
అభ్యర్థులు బూట్లు ధరించి రావొద్దు. ఆభరణాలు, గొలుసులు, చెవిపోగులు, చేతి గడియారాలు, ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, పె¯ŒSడ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, గడియారాలు, కాలిక్యులేటర్లు, లాగ్‌ టేబుల్స్, చేతిబ్యాగులు, పర్సులు, నోట్‌బుక్‌లు, చార్టులు, రికార్డింగ్‌ పరికరాల వంటివేమీ పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావొద్దు.
అభ్యర్థుల చేతిపై గోరింటాకు (మెహెందీ), ఇంకు వంటివేవీ ఉండకూడదు.
ఓఎంఆర్‌ జవాబు పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్నుతోనే రాయాలి. పెన్సిల్, ఇంకుపెన్ను, జెల్‌పెన్ తో రాసిన ఓఎంఆర్‌ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయరు.
పరీక్ష పూర్తయ్యాక ఒరిజినల్‌ ఓఎంఆర్‌ జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. దాని కింద ఉండే కార్బన్‌లెస్‌ కాపీని వెంట తీసుకెళ్లవచ్చు. ఒరిజినల్‌ ఓఎంఆర్‌ పత్రాన్ని పరీక్షా కేంద్రం నుంచి తీసుకెళ్లడం నేరం. అలా చేస్తే ఆ అభ్యర్థిపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తారు.
పూర్తిస్థాయి అంధులు స్రై్కబ్‌ సహాయంతో పరీక్ష రాయవచ్చు. వారికి గంటకు 20 నిమిషాల చొప్పున అదనంగా సమయం ఇస్తారు. స్రై్కబ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను, ఇతర వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement