budvel
-
బుద్వేల్ భూమి కోసం భారీ లాబీయింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న 26 ఎకరాల భూమిని కాజేయడానికి వెస్సెల్లా గ్రూప్ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి లాబీయింగ్ చేసినట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీ ఎన్.శ్వేత బుధవారం తెలిపారు. దాని ఫలితంగానే అప్పట్లో ఎమ్మార్వోకు సాధారణ మెమో జారీ అయిందని, దీని ద్వారానే ఆ భూముల కన్వర్షన్ జరిగిందని వివరించారు. తన అనుచరులతో కలిసి శివానందరెడ్డి చేసిన కుట్ర, అసైన్డ్ భూములు ఖరీదు చేయడం వంటి ఆరోపణలపై సీసీఎస్‌లో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీటిపై విచారించేందుకు సోమవారం అల్లూరు వెళ్లగా... శివానందరెడ్డి పారిపోయారని డీసీపీ వివరించారు. ఈ కేసులు, వాటి పూర్వాపరాలపై బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రియల్టర్ల కన్ను..అసైనీలకు దగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1994లో బుద్వేల్లోని సర్వే నం.282 నుంచి 299 వరకు ఉన్న 281 ఎకరాల భూములను 66 మందికి అసైన్ చేసింది. వీరికి రాజేంద్రనగర్ మండల అధికారులు అసైనీ పాస్ పుస్తకాలను సైతం జారీ చేశారు. ఆ తర్వాత మరో 82 మంది అక్కడ మిగిలి ఉన్న భూమిని ఆక్రమించారు. 2000లో అసైనీలు తమ భూములను ఎస్కే డెవలపర్స్ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో రెవెన్యూ అధికారులు అసైన్మెంట్ పట్టాలు రద్దు చేశారు. చేవెళ్ల ఆర్డీఓ ఆ భూమిని నిబంధనల ప్రకారం హెచ్ఎండీఏ, పర్యాటక శాఖలకు అప్పగించారు. దీన్ని సవాల్ చేస్తూ అసైనీలు గుంటి నర్సింçహులు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి కేసు పరిష్కరించాలంటూ చేవెళ్ల ఆర్డీఓను కోర్టు ఆదేశించింది. దీంతో అసైనీలు ఆర్డీఓకు వివరణ ఇచ్చినా.. దాన్ని ఆయన తిరస్కరించారు. ఆర్డీఓ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2002లో అసైనీలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. అదే భూమిని అభివృద్ధి చేసి, తమకు ప్లాట్లు ఇవ్వాలంటూ అసైనీలు ప్రభుత్వానికి విన్నవించారు. దీనిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే దీన్ని క్యాష్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు టీజే ప్రకాష్, కోనేరు గాం«దీ, దశరథ రామారావు రంగంలోకి దిగారు. అసైనీలతో పాటు ఇతరులను సంప్రదించారు. అసైనీలకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేలా తాము ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకులను మ్యానేజ్ చేస్తా మని నమ్మబలికారు. ఇది నమ్మిన అసైనీలు వీరితో అగ్రిమెంట్లు, ఎంఓయూలు చేసుకున్నారు. వాటిని చూపించిన ఈ ముగ్గురూ ఆ స్థలం అమ్ముతామంటూ కొందరి నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రకా‹Ù, గాం«దీ, రామారావు 2021లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్‌ను సంప్రదించి అసైనీలు ప్లాట్లు పొందేలా సహకరించాలని కోరారు. ఇతడి ద్వారానే టీజే ప్రకాష్ మాజీ పోలీసు అధికారి, వెస్సెల్లా గ్రూపు సీఈఓ మాండ్ర శివానందరెడ్డిని సంప్రదించారు. రియల్టర్లకు శివానందరెడ్డి ఎర బుద్వేల్ భూమి పూర్వాపరాలు తెలిసిన ఆయన తన çపలుకుబడి వినియోగించి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. ఆ 26 ఎకరాల భూమి తానే తీసుకుంటానని, చదరపు గజానికి రూ.12 వేల చొప్పున ఇస్తానని ఎర వేశాడు. 2021–22 మధ్య కాలంలో అసైనీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెక్కుల రూపంలో చెల్లించారు. కన్వర్షన్ కోసం ముమ్మర యత్నం అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం శివానందరెడ్డి తదితరులు 2022–23 మధ్య కాలంలో లాబీయింగ్ చేశారు. దీని ఫలితంగా అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మార్వోకు ఓ సాధారణ మెమో జారీ అయింది. దీంతో గతేడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కన్వేయన్స్ డీడ్స్ జరిగాయి. వీటి ఆధారంగా అసైనీలు, ఆక్రమణదారులు ఆ భూమిని ఏ అండ్ యూ ఇన్ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్ కంపెనీలకు చెందిన శివానందరెడ్డి, ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కినిష్కలతో పాటు ప్రశాంత్‌రెడ్డిలకు రిజి్రస్టేషన్ చేశారు. ఇలా శివానందరెడ్డి తదితరులు అసైనీలను భయపెట్టి, ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్ భూములు లాక్కోవడానికి కుట్ర పన్నారు. -
హెచ్ఎండీఏ ఆదాయం రూ.6945 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కోకాపేట, బుద్వేల్లోని భూముల విక్రయాల ద్వారా హెచ్ఎండీఏకు రూ.6,945.33 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రెండు చోట్ల హెచ్ఎండీఏకు ఉన్న భూములను ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించగా, కొనుగోలుదారులు పూర్తిగా డబ్బులు చెల్లించారు. ► కోకాపేటలో మొత్తం 7 ప్లాట్లలో ఉన్న 45.33 ఎకరాల భూమిని విక్రయించారు. ఇందులో ఒక్కో ప్లాట్‌లో 3.60 ఎక రాల నుంచి 9.71 ఎకరాల వరకు ఉంది. ఎకరం అత్యధికంగా రూ.100.75 కోట్లకు అమ్ముడుపోగా, సగటున ఎకరానికి రూ.73.23 కోట్ల చొప్పున ధర పలికింది. మొత్తం 7 ప్లాట్లపై రూ.3319.60 కోట్ల ఆదాయం లభించింది. ► బుద్వేల్లోని 14 ప్లాట్లలో ఉన్న 100.01 ఎకరాలు కూడా పూర్తిగా అమ్ముడుపోయింది. ఎకరానికి గరిష్టంగా రూ.41.75 కోట్లు ధర లభించింది. సగటున ఎకరం రూ.36.25 కోట్ల చొప్పున విక్రయించారు. బుద్వేల్లోని మొత్తం భూములపై రూ.3625.73 కోట్ల ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. ► మోకిలాలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో కొందరు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకపోవడానికి పలు కారణాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సకాలంలో బ్యాంకు రుణాలు లభించకపోవడం వల్ల కొందరు చెల్లించలేదన్నారు. బిడ్డర్ల విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. -
బుద్వేల్ లో భూముల వేలం ఆపాలని హైకోర్ట్ న్యాయవాదుల సంఘం పిల్
-
బుద్వేల్ భూముల వేలంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: బుద్వేల్ భూముల అంశంలో హెచ్ఎండీఏ వేలాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. భూముల వేలంపై స్టే ఇవ్వాలని కోర్టుని కోరింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. దీనిపై స్పందిస్తూ.. బార్ అసోసియేషనల్లో విభేదాలు ఉన్నాయని, అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా బుద్వేల్ లోని ప్రభుత్వ భూములను గతంలో హైకోర్టు కోసం కేటాయిస్తామన్న వాదనతో బార్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లింది. దీంతో బుద్వేల్ భూముల వేలంపై న్యాయవాదుల సంఘం కోర్టుని ఆశ్రయించింది. రంగారెడ్డి బుద్వేల్లోని 100 ఎకరాలకు హెచ్ఎండీఏ ఈ వేలం వేసేందుకు సిద్ధమైంది. 100 ఎకరాల్లో 14 ప్లాట్‌కు ఆన్లైన్ వేలం జరపాలని నిర్ణయించింది. ఈ భూమూలను దక్కించుకోవాలని రియల్ ఎస్టేట్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. దీని ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. చదవండి: హవ్వ.. చెట్లను కొట్టేసి మొక్కలు నాటుతారట? -
బద్వేల్ ఉప ఎన్నికపై సీఎం జగన్ ప్రత్యేక సమావేశం
-
మరో 5 ఎకరాలు ఇస్తాం: సీఎం
రెడ్డి హాస్టల్ శంకుస్థాపన సభలో కేసీఆర్ ప్రకటన సాక్షి, బుద్వేల్: దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా రెడ్డి హాస్టల్‌ను తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో రెడ్డి హాస్టల్ నిర్మాణ సముదాయానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రెడ్డి హాస్టల్‌కు ఇప్పటికే కేటాయించిన 10 ఎకరాలకు తోడుగా మరో 5 ఎకరాలు కేటాయిస్తామని హామీయిచ్చారు. నారాయణగూడలో బాలికల హాస్టల్‌కు అదనంగా 1500 గజాలు ఇస్తామన్నారు. బుద్వేల్‌లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భారీ ఎడ్యుకేషన్ టవర్ నిర్మించి క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిగేలా చూడాలని కోరారు. సమైక్య రాష్ట్రంలో మహనీయుల పేర్లు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాయమైన పేర్లన్నింటినీ పునరుద్ధరించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ఏర్పడ్డ రెండో వారంలోనే పోలీస్ అకాడమీకి రాజ బహద్దుర్ వెంకట రామారెడ్డి పేరు పెట్టామని తెలిపారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి జయశంకర్ పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేంద్రరెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అమ్మని లేపితే లేస్తల్లేదు....
హైదరాబాద్ : రాజేంద్ర నగర్లో బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై దుండగులు అత్యాచారం చేసి అనంతరం హతమార్చారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకు వెళ్లారు. లారీ పార్కింగ్ సమీపంలో తన కుమార్తెతో కలిసి రమ అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. అయితే ఈరోజు ఉదయం ఆమె కుమార్తె ...తల్లిని ఎంత లేపినా లేవటం లేదని ఏడుస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు కర్ణాటక వాసి. పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. తల్లి చనిపోయిన విషయం తెలియని చిన్నారి మాత్రం...అమ్మను లేపుతున్నా లేవటం లేదంటూ అమాయకంగా చెబుతోంది. -
ఎన్నికల వేళ.. గోలగోల
బద్వేలు, న్యూస్‌లైన్ : ఎన్నికల వేళ.. ఇంటి స్థలాలకు సంబంధించి నకిలీ అనుబంధ పత్రాల పంపిణీ వ్యవహారం గోలగోలగా మారింది. ఈ వ్యవహారం ఇక్కడ అనేక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదం సద్దుమణగకపోగా, మరింతగా రాజుకుంటోంది. పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాక.. యంత్రాంగం రంగంలోకి దిగింది. నకిలీ అనుబంధ పత్రాలను తమకు స్వాధీనం చేయాలని ఆదేశించింది. లేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో కొందరు భయపడి నకిలీ పత్రాలను వెనక్కి ఇచ్చేయగా, మరికొందరు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ.. ఏమిటో ఈ గోల మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలనుకన్న ఓ పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టే క్రమంలో ఇంటి స్థలాలకు సంబంధించి అనుబంధ పత్రాలను ఎరగా వేయాలని భావించారు. ఆలోచన వచ్చిందే తడువుగా నకిలీ పత్రాలు సృష్టించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 300 నకిలీ పత్రాలు సృష్టించి, ఓటర్లకు పంచిపెట్టారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా టీడీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, నాయకులు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలనూ వారు తహశీల్దార్ వెంకటరమణకు సమర్పించారు. అన్నీ నిబంధనలకు విరుద్ధమే.. సాధారణంగా అనుబంధ పత్రాలు రెవెన్యూ కార్యాలయం నుంచే లబ్ధిదారుడు పొందాల్సి ఉంది. లేదా రెవెన్యూ అధికారులు గృహ నిర్మాణ శాఖ వారికి అందజేయాలి. కానీ ఇక్కడ ఒకే వ్యక్తి వందల సంఖ్యల అనుబంధ పత్రాలు తెచ్చి ఓటర్లకు పంచిపెట్టడం కలకలం రేపుతోంది. అనుబంధ పత్రంలో లబ్ధిదారురాలి ఫొటో అతికించి, దానిపై తహశీల్దార్ సంతకం కూడా ఉండాలి. అయితే ఇక్కడ పేదలకు పంపిణీ చేసిన అనుబంధ పత్రాల్లో లబ్ధిదారుల ఫొటో లేకపోగా, ఫొటో అతికించాల్సిన ప్రదేశంలో తహశీల్దార్ సంతకం, సీలు ఉండడం గమనార్హం. ఇలా ఇవ్వడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. దీన్ని బట్టి ఇవి నకిలీ పత్రాలే అనేందుకు తిరుగులేని ఆధారంగా పేర్కొంటున్నారు. దీనికి తోడు అనుబంధ పత్రాలు జనవరి 21న మంజూరు చేసినట్లు పేర్కొనడం కూడా అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. మడకలవారిపల్లె గ్రామ పొలం సర్వే నంబర్-555/1బిలో వీటిని కేటాయించినట్లు రాసి ఉంది. అయితే పైన పేర్కొన్న సర్వే నంబర్లో కొంత రిజిస్టర్ భూమి కూడా ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం ఓ పార్టీ అభ్యర్థిని సరోజమ్మ మద్దతుదారులే నకిలీ అనుబంధ పత్రాలను పంపిణీ చేశారంటూ వైఎస్ఆర్ సీపీ, టీడీపీ అభ్యర్థులు చందన, సంధ్య ఆరోపించారు. ఇదే విషయంపై ఎన్నికల అధికారులకు తాము మంగళవారం ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. కాగా నకిలీ అనుబంధ పత్రాల పంపిణీ వ్యవహారంపై బద్వేలు, గోపవరం తహశీల్దార్లు సోమవారం బద్వేలులో పర్యటించారు. అనుబంధ పత్రాలు పొందిన వారంతా తమకు స్వాధీనం చేయాలని మైకుల ద్వారా కోరారు. లేకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో 50 మంది అనుబంధ పత్రాలను వెనక్కి తెచ్చిచ్చారు. -
దుష్ట సంహారం
సాక్షి ప్రతినిధి, కడప: వచ్చే ఎన్నికల్లో దుష్టసంహారం చేయాలని వైఎస్ విజయమ్మ కోరారు. వైఎస్ ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారు.. మరెందరికో ఆర్థికంగా చేయూతనందించారు., వారంతా అండగా లేరు.. మాకు తోడూ నీడ గా మీరున్నారు.. మీప్రేమకు, ఆప్యాయతకు కృతజ్ఞతలు. మీరిచ్చిన స్ఫూర్తితోనే ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డి నిలిచాం.. 30 ఏళ్లుగా రాజశేఖరరెడ్డిని భుజాలకెత్తుకొని మోశారు.. ఆదే ఆదరణ, ఆప్యాయతలు మాపై చూపుతున్నారు... మీరుణం తీర్చుకోలేనిదన్నారు.. ఎన్నికల ప్రచారం జనభేరిలో భాగంగా రెండవ రోజు కడప కార్పొరేషన్, మైదుకూరు, బద్వేలు, సిద్దవటంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి తాము బయటికి వచ్చాక జరిగిన అనేక ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చారన్నారు. కడప పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల మెజార్టీతో జగన్‌బాబును గెలిపించారన్నారు. ఈ విషయంలో దేశచరిత్రలోనే జగన్ మూడో స్థానంలో నిలిచారన్నారు. దీనికి మీ ఆప్యాయతలే కారణమన్నారు. వైఎస్‌లాగే తమను కూడా మీ కడుపులో దాచుకున్నారని, మీ రుణం మరువలేనిదని విజయమ్మ పేర్కొన్నారు.మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుయుక్తులకు చరమగీతం పాడాలన్నారు. వైఎస్సార్‌జిల్లాలో మీ ప్రేమ, ఆప్యాయతల కారణంగా వైఎస్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉందని, ఈ ఎన్నికల్లో మరోమారు ఆదరించాలని కోరారు. విజయమ్మ జనభేరి సక్సెస్ కడప కార్పొరేషన్, మైదుకూరు, బద్వేలు మున్సిపాలిటీలలో గురువారం వైఎస్ విజయమ్మ నిర్వహించిన జనభేరి కార్యక్రమం సక్సెస్ అయింది. దివంగత నేత సతీమణి వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారాన్ని వస్తుందని తెలుసుకున్న ప్రజానీకం రోడ్లపై నిరీక్షించారు. మండుటెండలో సూర్యుడు చిన్నబుచ్చుకునేలా కడప పురవీధుల్లో భారీ ఎత్తున ఘనస్వాగతం పలికారు. బిల్డప్ నుంచి కృష్ణాసర్కిల్ వరకు పెద్దాయన సతీమణి కోసం బారులు తీరారు. ఓపికగా గంటల తరబడి నిరీక్షించారు. విజయమ్మ అనర్గళంగా ప్రసంగం చేయడం చేసి ప్రజానీకం ఆశ్చర్యానికి లోనయ్యారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను వివరిస్తున్న ఒక దశలో ‘తల్లీ మీరు ఎండలో తిరగొద్దు. మీ కుటుంబానికి తోడునీడగా మేం ఉన్నాం.. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకుంటాం’ అని కృష్ణాసర్కిల్‌లో ఉబికివస్తున్న దుఃఖంతో కొందరు విజయమ్మకు వివరించారు. విజయమ్మ రాకతో మైదుకూరు నాలుగురోడ్ల కూడలి జనసంద్రంగా మారింది. మూడు గంటలపాటు నిరీక్షించి మైదుకూరు ప్రజలు విజయమ్మను చూడగానే ఒక్కమారుగా జయజయధ్వానాలు పలుకుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బద్వేలు నాలుగు రోడ్ల కూడలిలో రాత్రి అయినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆమె కోసం వేచి చూశారు. భారీగా మహిళలు కూడా తరలివచ్చి వేచి ఉండటం విశేషం. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన పథకాలు, చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక పాలన, రాజశేఖర్‌రెడ్డి మృతి చెందిన అనంతరం కొనసాగిన కాంగ్రెస్ పాలనపై సవివరంగా విజయమ్మ ప్రసంగం చేయడం ప్రజానీకాన్ని ఆకట్టుకుంది. ఆమె మాట్లాడుతున్న సేపు హర్షం వ్యక్తం చేస్తూ ఈలలు, కేకలు వేశారు. పర్యటనలో కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, జిలా కన్వీనర్, మేయర్ అభ్యర్థి కె.సురేష్‌బాబు, కమలాపురం, కడప, మైదుకూరు, బద్వేలు అభ్యర్థులు వరుసగా పి.రవీంద్రనాథరెడ్డి, ఎస్బీ అంజాద్బాష, ఎస్ రఘురామిరెడ్డి, టీ జయరాములు, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆమెకు అందలం
బద్వేలు, న్యూస్‌లైన్: భూమి, ఆకాశం తమకేదీ అడ్డుకాదని అన్నింటా సత్తా చాటుతున్న మహిళలకు రాజకీయాల్లోనూ ప్రాతినిథ్యం దక్కుతోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన వీరికి రిజర్వేషన్ల పుణ్యమా అని అవకాశాలు అందివస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సగానికి పైగా సీట్లను దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 791 పంచాయతీలు, 7700 వార్డు స్థానాలు ఉన్నాయి. 50 శాతం రిజర్వేషన్‌తో మహిళలకు 395 పంచాయతీలు, 3350 వార్డులను కేటాయించారు. అంతకంటే ఎక్కువ మంది మహిళలు పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం జిల్లాలో 430 పంచాయతీ స్థానాల పాలనా బాధ్యతలను మహిళలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పలు మేజర్ పంచాయతీల పాలనా బాధ్యతలను కూడా మహిళలు చేపట్టారు. బీటెక్ చదివిన హబీబున్నీసా పోరుమామిళ్ల మేజరు పంచాయతీ సర్పంచ్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 559 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2006లో 552 ఉండగా కొన్ని పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో వాటి సంఖ్య 525కు తగ్గింది. 2011 జనాభా ప్రకారం తీసుకోవడంతో వాటి స్థానాల సంఖ్య పెరిగి 559కి చేరింది. ఇందులో మహిళలకు 293 స్థానాలు కేటాయించారు. ఇవి 50 శాతం కంటే ఎక్కువ స్థానాలు కావడం గమనార్హం. ఇందులో ఎస్టీలకు 09, ఎస్సీలకు 61, బీసీలకు 75, అన్ రిజర్వుడులో 148 స్థానాలలో మహిళలు పోటీ చేయనున్నారు. దీంతో పాటు మరికొన్ని ఎంపీటీసీ స్థానాల్లో కూడా మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. దాదాపు 65 శాతం ఎంపీటీసీ స్థానాలను మహిళలు చేజిక్కించుకునే అవకాశం ఉంది. జిల్లాలో 23 మండలాధ్యక్ష పదవులను కూడా అతివలు చేపట్టనున్నారు. వీరు మండలాల్లో మొదటి పౌరులుగా గౌరవం పొందనున్నారు. 50 జెడ్పీటీసీ స్థానాల్లో 25కు పైగా మహిళలకు కేటాయించారు. మున్సిపాలిటీల్లోనూ... ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మహిళలు పదవులను అలంకరించనున్నారు. జిల్లాలోని కడప కార్పొరేషన్‌తో పాటు ఏడు మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పులివెందుల, జమ్మలమడుగు , రాయచోటి చైర్మన్ స్థానాలను మహిళలకు కేటాయించారు. కడప కార్పొరేషన్లో 50 వార్డులకు గాను 25 స్థానాలను మహిళలకే కేటాయించారు. బద్వేలు మున్సిపాలిటీలో 26 స్థానాలకు 14 స్థానాలు అతివలకే దక్కనున్నాయి. ప్రొద్దుటూరులో 40కి 20కి పైగా, జమ్మలమడుగులో 20కి 10 స్థానాలు, రాయచోటిలో 31కి 16 స్థానాలు, పులివెందులలో 26కు 13 స్థానాలు, మైదుకూరులో 23కు 12స్థానాలు, ఎర్రగుంట్లలో 20కి 10 స్థానాలను మహిళలకు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 110కి పైగా కౌిన్సిల్ స్థానాలలో జయకేతనం ఎగుర వేసేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు.