సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎమ్‌డీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏపీసీ కస్టడీలోకి తీసుకుంది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌గా ఉన్న ఆయన్ను.. నేటి నుంచి 8 రోజుల వరకు కస్టడీలోకి తీసుకొని విచారించనుంది. కాగా ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఎనిమిది రోజుల కస్టడీకి నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో బాలకృష్ణను మరింత లోతుగా ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీయనున్నారు. అక్రమ అనుమతులు, బినామీ ఆస్తులపై ఆరా తీయనున్నారు.
మరోవైపు హెచ్‌ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీవేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్‌ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పుప్పాలగూడ 447సర్వే నంబర్‌లో అనుమతులపై సూర్య ప్రకాష్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో బాలకృష్ణ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన బాలకృష్ణ అక్రమ ఆస్తులను గుర్తించారు.
చదవండి: ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం
Comments
Please login to add a commentAdd a comment