Hyderabad: డ్రైవ్ ఇన్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ నగర వాసులకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఈ ఆలోచన ఆచరణ రూపం దాల్చితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇక్కడ ఉండనుంది.
డ్రైవ్ ఇన్ థియేటర్
సాధారణ సినిమా థియేటర్/మల్టీప్లెక్స్‌కి వెళితే ముందుగా వాహనం పార్కింగ్ చేయాలి. ఆ తర్వాత టిక్కెట్ తీసుకుని క్లోజ్డ్ హాల్‌లో అక్కడున్న సీట్లో కూర్చుని సినిమా చూడాలి. కానీ డ్రైవ్ ఇన్ థియేటర్‌లో మనం కారులో కూర్చుని.. ఎదురుగా కనిపించే అతి భారీ స్క్రీన్‌పై సినిమా చూడొచ్చు. ఈ ఓపెన్ థియేటర్‌కి తగ్గట్టుగా సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది.
అక్కడ కామన్
యూరప్, అమెరికా దేశాల్లో డ్రైవ్ ఇన్ థియేటర్ కాన్సెప్టు ఎప్పటి నుంచో ఉంది. కార్లలో థియేటర్‌కి వచ్చే వినియోగదారుడు అందులో ఉంటూనే తన కంఫర్ట్‌కి అనుగుణంగా సినిమాను అక్కడ చూస్తుంటారు. మనదగ్గర ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నైలలో కూడా ఈ డ్రెవ్ ఇన్ థియేటర్లు ఉన్నాయి. రజనీకాంత్ శివాజీ మూవీలో ఓ ఫైట్ సీన్‌లో ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ కనిపిస్తుంది.
లోకేషన్ ఎక్కడ
కనీసం 150 కార్ల సామార్థ్యంతో డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటు చేయాలంటే రూ. 5 నుంచి 8 కోట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనా వేస్తున్నారు. 150 కార్లు సుళువుగా వచ్చి పోయేలా, నిలిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీనికి సువిశాలమైన స్థలం కావాలి. నగరం మధ్యలో లోకేషన్ కోసం అన్వేషిస్తున్నారు.
ఓఆర్‌ఆర్
మరోవైపు నగరం నలువైపులా విస్తరిస్తూ ఓఆర్‌ఆర్‌ని తనలో కలిపేసుకుంటోంది. దీంతో నగర పరిధిలో ఉన్న 19 ఓఆర్‌ఆర్ ఇంటర్ చేంజ్ పాయింట్ల సమీపంలో ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను అందుబాటులోకి తెస్తే ఎలా ఉంటుందనే అంశంపై హెచ్‌ఎండీఏ పరిశీలిస్తోంది. అనువైన స్థలాలను గుర్తిస్తోంది.
వెనువెంటనే పర్మిషన్లు
హెచ్‌ఎండీఏ డ్రైవ్ ఇన్ థియేటర్‌కి సంబంధించిన స్థలాలను గుర్తించిన తర్వాత నిర్మాణ కంపెనీల నుంచి దరఖాస్తులు అహ్వానించనుంది. ఎవరైనా డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటుకు ముందుకు వస్తే త్వరితగిన అనుమతులు జారీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
కోవిడ్‌తో
కోవిడ్ ఎఫెక్ట్‌తో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసేందుకు వెనుకాడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అదే డ్రైవ్ ఇన్ థియేటర్ అందుబాటులోకి వస్తే ఎవరి కారులో వారు ఉంటూనే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే బిగ్‌స్క్రీన్‌పై థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు డ్రైవ్ ఇన్ థియేటర్ ఫెసిలిటీ ఉన్న అతి కొద్ది నగరాల జాబితాలో హైదరాబాద్‌కి చోటు దక్కుతుంది.]
Comments
Please login to add a commentAdd a comment