సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈకేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ.. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అంశాన్ని బయటకు తీసింది. దీంతో, విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది.
వివరాల ప్రకారం.. హెచ్‌ఎండీఏ అధికారి శివబాలకృష్ణ అవినీతి కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. శివ బాలకృష్ణ కేసులో తాజాగా ఏసీబీ నివేదిక రెడీ చేసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇక, ఈ కేసులో మరో కొత్త అంశాన్ని బయటకు తీసుకువచ్చింది. ఏసీబీ నివేదికలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వ్యవహారాన్ని ప్రస్తావించింది. బాలకృష్ణ దగ్గర నుంచి అరవింద్ కుమార్ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు నివేదికలో పేర్కొంది.
ఇక, ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్‌ను విచారించేందుకు ఏసీబీ.. ప్రభుత్వ అనుమతిని కోరింది. మరోవైపు.. బాలకృష్ణ నుంచి రికవరీ చేసిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, గత పదేళ్ల కాలంలో దాదాపు 15 సెల్‌ఫోన్స్ మార్చినట్టు ఏసీబీ నివేదికలో వెల్లడించారు. ఈ ఫోన్లు, కాంటాక్ట్‌లకు సంబంధించి మరిన్ని కీలక విషయాలను ఏసీబీ వెల్లడించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment