
భూముల వేలానికి మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల వేలానికి మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ). ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ వెలువరించింది.
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ జనవరి 16, 2023 గా పేర్కొంది. ప్రీ బిడ్ సమావేశాలు జనవరి 4,5,6 ఉంటాయని, ఈఎండీ చెల్లింపునకు జనవరి 17వ తేదీ వరకు గడువు విధించింది. భూముల వేలం జనవరి 18న ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపింది.
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలోని భూముల వేలానికి ముందుకు వచ్చింది. 300 గజాల నుండి 10 వేల గజాల వరకు ప్లాట్లను వేలంలో పెట్టింది హెచ్ఎండీఏ. ఈ వేలం ద్వారా భారీ ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది.