Updates..
►బుద్వేల్‌లో భూముల ఈ-వేలం ముగిసింది. మొత్తం 14 ప్లాట్లు 100.1 ఎకరాలను హెచ్‌ఎండీఏ విక్రయించింది. ఈ-వేలంలో రూ.3625.73 కోట్లు హెచ్‌ఎండీఏకు ఆదాయం సమకూరింది.
►ఈరోజు జరిగిన వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ.41.75కోట్లు పలికింది.
► అత్యల్పంగా ఎకరం ధర రూ.33.25 కోట్లు పలికింది.
► కాసేపట్లో బుద్వేలు భూముల ఈ-వేలం ముగియనుంది.
► భూముల వేలంంలో సరాసరి రూ.33 నుంచి 35 కోట్లతో బుద్వేల్ భూములు అమ్ముడవుతున్నాయి.
► ఈ క్రమంలో ప్రభుత్వానికి దాదాపు రూ.5వేల కోట్ల భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
► రెండో సెషన్‌లో రెండు ప్లాట్లకు వేలం కొనసాగుతోంది.
► రెండో సెషన్‌లో ప్లాట్ నెంబర్-13 కోసం హోరాహోరి బిడ్డింగ్ జరుగుతోంది. ప్లాన్ నెంబర్-13లో అత్యధికంగా ఎకరం ధర రూ.40.25కోట్లు పలుకుతోంది.
► ప్లాట్ నెంబర్-13లో మొత్తంగా 6.96 ఎకరాల ల్యాండ్ ఉంది.
► బుద్వేల్ భూముల ఈ-వేలం తొలి సెషన్ ముగిసింది. తొలిసెషన్‌లో 1,2,4,5,8,9,10 ప్లాట్లకు వేలం జరిగింది.
► తొలి సెషన్ బుద్వేల్ భూముల వేలంలో 58.19 ఎకరాలకు మెత్తం ఆదాయం రూ.2061 కోట్లు వచ్చింది.
► అత్యధికంగా ప్లాట్ నంబర్-4లో ఎకరం ధర రూ.39.25 కోట్లు.
(14.33 ఎకరాలు)
► అత్యల్పంగా ఎకరం ధర ప్లాట్ నంబర్-2,5లో ఎకరం ధర. రూ.33.25 కోట్లు
(plot no 2&5 total 18.74 ఎకరాలు)
► ప్లాట్ నెంబర్-1లో ఎకరం రూ.34.50 కోట్లు.
► ప్లాట్ నెంబర్-8లో ఎకరం రూ. 35.50 కోట్లు.
► ప్లాట్ నెంబర్-9లో ఎకరం రూ. 33.75 కోట్లు.
►ప్లాట్ నెంబర్-10లో ఎకరం రూ. 35.50 కోట్లు.
► కొనసాగుతున్న బుద్వేల్ భూముల వేలం
► రెండో సెషన్ వేలం ప్రారంభం
► రెండో సెషన్‌లో 11, 12,13,14,15, 16,17 ప్లాట్ల వేలం జరుగనుంది.
► మొదటి సెషన్‌లో ఇంకా కొన్ని ప్లాట్లకు కొనసాగుతున్న వేలం.
► మొదటి సెషన్‌లో సరాసరి ఎకరం 25 కోట్లు దాటి నడుస్తున్న వేలం
► అత్యధికంగా 5వ నెంబరు ప్లాట్‌లోలో ఎకరం 32 కోట్లు దాటిన ధర.
► ప్లాట్ నంబర్-1.. ఎకరం రూ. 33.25 కోట్లు
► ప్లాట్ నంబర్-4.. ఎకరం రూ. 33.25 కోట్లు.
తొలి సెషన్‌లో ఇలా..
ప్లాట్ నెంబర్-9లో ఎకరం 22.75కోట్లు
ప్లాట్ నెంబర్ -10లో ఎకరం 23 కోట్లు.
ప్లాట్ నెంబర్-7లో ఎకరం 27కోట్లు.
ప్లాట్ నెంబర్-8లో ఎకరాకు 28 కోట్లు పలికింది.
► కోకాపేట తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా అత్యంత విలువైన బుద్వేల్ భూముల వేలానికి ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. ఈ క్రమంలో వేలం కొనసాగుతోంది. కాగా, అత్యధికంగా 4వ నెంబర్‌కు 31 కోట్లు, 5వ నెంబరు ప్లాట్‌లో ఎకరం రూ.30 కోట్లు దాటి ధర పలికింది. ఇక పదో నెంబర్ ప్లాట్‌కి 23 కోట్లతో వేలం కంటిన్యూ అవుతోంది.
► ఇక, వేలం ప్రారంభం నుంచి ఈ-వేలం మందకోడిగా సాగుతోంది. వేలం ప్రారంభమై రెండు గంటలు దాటినా ధరలు మాత్రం పెద్దగా పలకడం లేదు. కాగా, సెషల్ ముగిసే సమయానికి ధరలు జోరందుకున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి వేలం జోరందుకుంది. ఈ-వేలంలో ప్లాట్ నెంబర్ 9, 10లకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. సరాసరి ఎకరం రూ. 25 కోట్లు దాటి వేలం నడుస్తోంది. కాగా, కనీస నిర్దేశిత ధర ఎకరం రూ.20 కోట్ల రూపాయలతో వేలం ప్రారంభమైన విషయం తెలిసిందే.
► ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు..
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) రాజేంద్రనగర్ సమీపంలో బుద్వేల్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దాదాపు 182 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న బుద్వేల్ లే అవుట్ ప్లాట్ల అమ్మకంలో భాగంగా గురువారం ఈ వేలం ప్రక్రియను ప్రారంభించింది.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన ఫస్ట్ సెషన్ వేలంలో ప్లాట్ నెం.1,2,4,5,8,9,10 లకు బిడ్డర్, రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటాపోటీగా బిడ్‌లను సమర్పిస్తున్నారు.
► మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు రెండో సెషన్‌గా నిర్వహించే వేలంలో మరో ఏడు ప్లాట్లకు వేలం జరగనుంది. ఇక్కడి లే అవుట్ లో ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు, గరిష్టంగా 14.3 ఎకరాలుగా ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు వివరించారు. ఒక్కో ఎకరానికి మినిమమ్ అప్ సేట్ రేటుగా రూ. 20 కోట్లుగా నిర్ణయించి, ఈ ఆక్షన్ నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: టీఎస్‌పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత.. స్లోగన్స్‌తో దద్దరిల్లుతున్న పరిసరాలు
Comments
Please login to add a commentAdd a comment