budwel
-
వందేళ్లకుపైగా చరిత్ర.. లక్షల తీర్పులు
సాక్షి, హైదరాబాద్: మూసీనది ఒడ్డున ఠీవిగా నిల్చున్న అద్భుత కట్టడం.. భారీ గుమ్మటాలతో చూడగానే ఆకట్టుకునేలా నిర్మాణం.. వందేళ్లకు పైగా చరిత్ర. ఎందరో గొప్ప మేధావులు న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా పని చేసిన భవనం. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన వారూ అనేకమే. కోట్లాది మందికి న్యాయాన్ని అందించిన సజీవ సాక్ష్యం. గులాబీ, తెలుపు గ్రానైట్లతో రూపుదాల్చిన విశాల భవంతి. నాటి నిజాం ప్రభుత్వానికి, ఉమ్మడి ఏపీ సర్కార్‌కు, ప్రత్యేక తెలంగాణ సర్కార్‌కు ఉన్నత న్యాయస్థానంగా నగరం నడిబొడ్డున సేవలందించిన భారీ కట్టడం. ఈ హైకోర్టును బుద్వేల్‌కు తరలించాలని కొందరు.. వద్దు ఇక్కడే కొనసాగించాలని మరికొందరు.. ఈ వాదనల నేపథ్యంలో కొద్దికాలం క్రితం బుద్వేల్‌లో కొత్త హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 105 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్న హైకోర్టు భవనంపై ప్రత్యేక కథనం.హైకోర్టు ఏర్పాటు ఇలా...’ఆంగ్లేయుల పాలనలో రూపొందించిన అనేక నిబంధనలు నిజాం ప్రభుత్వం అధీనంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధంగా ఇక్కడ కూడా కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలుత పత్తర్ఘాట్లో హైకోర్టును నెలకొల్పారు. 1908లో వచ్చిన వరదల తర్వాత లాల్‌బాగ్‌లో ఉండే ఆస్మాన్ ఝా నవాబ్ నివాస గృహంలోకి మార్చారు. 1912లో నగరంలో కలరా వ్యాధి రావడంతో పబ్లిక్ గార్డెన్స్ హాల్‌కు, అక్కడి నుంచి సాలార్జంగ్ బహదూర్ నివాసానికి తరలించారు. అక్కడ స్థలం సరిపోక ఇబ్బందిపడాల్సి వచ్చింది. దీంతో సైఫాబాద్ని సర్తాజ్‌జంగ్ నవాబ్ ఇంటికి మార్చారు.హైకోర్టు భవనానికి రూపకల్పన...1915, ఏప్రిల్ 15న ప్రస్తుత హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. జైపూర్‌కు చెందిన శంకర్‌లాల్ ఆర్కిటెక్ట్‌గా, మెహర్ అలీఫజల్ ఇంజనీర్‌గా వ్యవహరించారు. శంషాబాద్ వద్ద గగ న్పహాడ్లోని కొండలను తొలిచి, ఇండో ఇస్లామిక్ శైలిలో పాతబస్తీలోని మూసీనది ఒడ్డున నిర్మించారు. 1919, మార్చి 31న భవన నిర్మాణం పూర్తయింది. మూసీపై నయాపూల్ వంతెన పక్కన హైకోర్టు భవనం ఠీవిగా కొలువుదీరింది. నిజాం కాలం నాటి 18,22,750 సిక్కాల వ్యయంతో 9 ఎకరాల్లో నిర్మించిన ఈ భవనాన్ని 1920, ఏప్రిల్ 20న ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1956, నవంబర్ 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చారు. ఆ తర్వాత పలు అవసరాల నిమిత్తం కొత్త భవనాలు నిర్మిస్తూ వచ్చారు. హైన్ మహల్, నది మహల్, కుతుబ్ షాహీ నిర్మాణాల శిథిలాలపై ఈ చారిత్రక, వారసత్వ హైకోర్టు భవనాన్ని నిర్మించారు.ప్రత్యేక రాష్ట్రం తర్వాత...2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా.. ఒకే భవనంలో ఏపీ, తెలంగాణ హైకోర్టులు కొనసాగుతూ వచ్చాయి. 2018, డిసెంబర్ 26న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడంతో 2019, జనవరి 1న ఏపీ హైకోర్టు అమరావతికి తరలివెళ్లిపోయింది. తర్వాత ఈ భవనం పూర్తిగా తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు.ముఖ్యాంశాలు...⇒ నిజాం కాలంలో మొదటి ప్రధాన న్యాయమూర్తి: నిజామత్ జంగ్ ⇒ స్వాతంత్య్రానికి పూర్వం జడ్జీల నియామకం చేసింది: నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్⇒ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైకోర్టుకు తొలి సీజే: జస్టిస్ కోకా సుబ్బారావు⇒ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర హైకోర్టు తొలి సీజే: జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా ⇒ పూర్తిస్థాయిలో తెలంగాణ హైకోర్టు రూపకల్పన (ఏపీ హైకోర్టు తరలిన) తర్వాత తొలి సీజే: జస్టిస్ టీబీ రాధాకృష్ణన్⇒ 2019లో నిర్మాణం వందేళ్లు పూర్తి చేసుకుంది⇒ 1948 నుంచి 1950 వరకు ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ కూడా పనిచేసింది. ఉర్దూ అధికారిక భాష కావడంతో ఇక్కడ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. ⇒ ప్రధాన భవనంలో 32 కోర్టు హాళ్లు, 38 చాంబర్లు ఉంటాయి. జడ్జీల సంఖ్య పెరిగిందిలా... ప్రస్తుత హైకోర్టు భవనం ప్రారంభించే నాటికి ఉన్న న్యాయమూర్తులు 6 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తులు 12 1970లో న్యాయమూర్తుల సంఖ్య 321987లో న్యాయమూర్తుల సంఖ్య 362014లో న్యాయమూర్తుల సంఖ్య 61విభజన సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 242021లో న్యాయమూర్తుల సంఖ్య 42 -
బుద్వేల్ భూం భూం.. ముగిసిన వేలం
Updates.. ►బుద్వేల్‌లో భూముల ఈ-వేలం ముగిసింది. మొత్తం 14 ప్లాట్లు 100.1 ఎకరాలను హెచ్ఎండీఏ విక్రయించింది. ఈ-వేలంలో రూ.3625.73 కోట్లు హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరింది. ►ఈరోజు జరిగిన వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ.41.75కోట్లు పలికింది. ► అత్యల్పంగా ఎకరం ధర రూ.33.25 కోట్లు పలికింది. ► కాసేపట్లో బుద్వేలు భూముల ఈ-వేలం ముగియనుంది. ► భూముల వేలంంలో సరాసరి రూ.33 నుంచి 35 కోట్లతో బుద్వేల్ భూములు అమ్ముడవుతున్నాయి. ► ఈ క్రమంలో ప్రభుత్వానికి దాదాపు రూ.5వేల కోట్ల భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ► రెండో సెషన్లో రెండు ప్లాట్లకు వేలం కొనసాగుతోంది. ► రెండో సెషన్లో ప్లాట్ నెంబర్-13 కోసం హోరాహోరి బిడ్డింగ్ జరుగుతోంది. ప్లాన్ నెంబర్-13లో అత్యధికంగా ఎకరం ధర రూ.40.25కోట్లు పలుకుతోంది. ► ప్లాట్ నెంబర్-13లో మొత్తంగా 6.96 ఎకరాల ల్యాండ్ ఉంది. ► బుద్వేల్ భూముల ఈ-వేలం తొలి సెషన్ ముగిసింది. తొలిసెషన్లో 1,2,4,5,8,9,10 ప్లాట్లకు వేలం జరిగింది. ► తొలి సెషన్ బుద్వేల్ భూముల వేలంలో 58.19 ఎకరాలకు మెత్తం ఆదాయం రూ.2061 కోట్లు వచ్చింది. ► అత్యధికంగా ప్లాట్ నంబర్-4లో ఎకరం ధర రూ.39.25 కోట్లు. (14.33 ఎకరాలు) ► అత్యల్పంగా ఎకరం ధర ప్లాట్ నంబర్-2,5లో ఎకరం ధర. రూ.33.25 కోట్లు (plot no 2&5 total 18.74 ఎకరాలు) ► ప్లాట్ నెంబర్-1లో ఎకరం రూ.34.50 కోట్లు. ► ప్లాట్ నెంబర్-8లో ఎకరం రూ. 35.50 కోట్లు. ► ప్లాట్ నెంబర్-9లో ఎకరం రూ. 33.75 కోట్లు. ►ప్లాట్ నెంబర్-10లో ఎకరం రూ. 35.50 కోట్లు. ► కొనసాగుతున్న బుద్వేల్ భూముల వేలం ► రెండో సెషన్ వేలం ప్రారంభం ► రెండో సెషన్లో 11, 12,13,14,15, 16,17 ప్లాట్ల వేలం జరుగనుంది. ► మొదటి సెషన్లో ఇంకా కొన్ని ప్లాట్లకు కొనసాగుతున్న వేలం. ► మొదటి సెషన్లో సరాసరి ఎకరం 25 కోట్లు దాటి నడుస్తున్న వేలం ► అత్యధికంగా 5వ నెంబరు ప్లాట్లోలో ఎకరం 32 కోట్లు దాటిన ధర. ► ప్లాట్ నంబర్-1.. ఎకరం రూ. 33.25 కోట్లు ► ప్లాట్ నంబర్-4.. ఎకరం రూ. 33.25 కోట్లు. తొలి సెషన్లో ఇలా.. ప్లాట్ నెంబర్-9లో ఎకరం 22.75కోట్లు ప్లాట్ నెంబర్ -10లో ఎకరం 23 కోట్లు. ప్లాట్ నెంబర్-7లో ఎకరం 27కోట్లు. ప్లాట్ నెంబర్-8లో ఎకరాకు 28 కోట్లు పలికింది. ► కోకాపేట తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా అత్యంత విలువైన బుద్వేల్ భూముల వేలానికి ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. ఈ క్రమంలో వేలం కొనసాగుతోంది. కాగా, అత్యధికంగా 4వ నెంబర్‌కు 31 కోట్లు, 5వ నెంబరు ప్లాట్‌లో ఎకరం రూ.30 కోట్లు దాటి ధర పలికింది. ఇక పదో నెంబర్ ప్లాట్‌కి 23 కోట్లతో వేలం కంటిన్యూ అవుతోంది. ► ఇక, వేలం ప్రారంభం నుంచి ఈ-వేలం మందకోడిగా సాగుతోంది. వేలం ప్రారంభమై రెండు గంటలు దాటినా ధరలు మాత్రం పెద్దగా పలకడం లేదు. కాగా, సెషల్ ముగిసే సమయానికి ధరలు జోరందుకున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి వేలం జోరందుకుంది. ఈ-వేలంలో ప్లాట్ నెంబర్ 9, 10లకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. సరాసరి ఎకరం రూ. 25 కోట్లు దాటి వేలం నడుస్తోంది. కాగా, కనీస నిర్దేశిత ధర ఎకరం రూ.20 కోట్ల రూపాయలతో వేలం ప్రారంభమైన విషయం తెలిసిందే. ► ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) రాజేంద్రనగర్ సమీపంలో బుద్వేల్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దాదాపు 182 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న బుద్వేల్ లే అవుట్ ప్లాట్ల అమ్మకంలో భాగంగా గురువారం ఈ వేలం ప్రక్రియను ప్రారంభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన ఫస్ట్ సెషన్ వేలంలో ప్లాట్ నెం.1,2,4,5,8,9,10 లకు బిడ్డర్, రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటాపోటీగా బిడ్లను సమర్పిస్తున్నారు. ► మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు రెండో సెషన్‌గా నిర్వహించే వేలంలో మరో ఏడు ప్లాట్లకు వేలం జరగనుంది. ఇక్కడి లే అవుట్ లో ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు, గరిష్టంగా 14.3 ఎకరాలుగా ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు వివరించారు. ఒక్కో ఎకరానికి మినిమమ్ అప్ సేట్ రేటుగా రూ. 20 కోట్లుగా నిర్ణయించి, ఈ ఆక్షన్ నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత.. స్లోగన్స్‌తో దద్దరిల్లుతున్న పరిసరాలు -
అమ్మో.. ఎలుగుబంటి
సాక్షి, బద్వేలు(కడప) : బద్వేలు సమీపంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. జనావాసాల్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి ఎటువెళ్లాలో తెలియక పొలాల వెంట పరుగులు తీస్తూ జనాన్ని భయబ్రాంతులకు గురి చేసింది. విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది ఎలుగుబంటిని అడవిలోకి పంపించేందుకు 7 గంటల పాటు శ్రమించారు. ఒకానొక దశలో జనం పై దాడికి యత్నించడంతో ఓ విలేకరికి గాయాలయ్యాయి. చివరకు అటవీ సిబ్బంది వల్లెరవారిపల్లెబీట్లోని అటవీ ప్రాంతంలోకి ఎలుగుబంటిని తరిమి వేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం బద్వేలు సమీపంలోని బయనపల్లెలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే ... మండల పరిధిలోని చింతలచెరువు పంచాయతీలో గల శ్రీనివాసపురం గ్రామ సమీపంలోకి సోమవారం తెల్లవారుజామున ఎలుగుబంటి ప్రవేశించినట్లు గుర్తించిన గ్రామస్తులు అక్కడి నుంచి తరిమివేశారు. అనంతరం అక్కడి నుంచి బయనపల్లె ఎస్సీకాలనీ సమీపంలోని ముళ్లపొదల్లో దాగి ఉండగా గ్రామస్తులు గుర్తించి అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఎఫ్ఆర్ఓ సుభాష్, సిబ్బంది ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి పంపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. పొలాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి ఈ సమయంలో ముళ్లపొదల్లో దాక్కుని ఉన్న ఎలుగుబంటి జనం పై దాడికి యత్నించింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరికి గాయాలయ్యాయి. ప్రజలు, అటవీ సిబ్బంది ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయగా అక్కడి నుంచి చింతలచెరువు, గొడుగునూరు గ్రామాల మీదుగా కమలకూరు సమీపంలోని వల్లెరవారిపల్లెబీట్ అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో అటవీ అధికారులు, సంబంధిత గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితి పై ప్రొద్దుటూరు డీఎఫ్ఓ గురుప్రభాకర్ ఆరా తీసీ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు. -
బుద్వేల్‌లో మరో ఐటీ క్లస్టర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బుద్వేల్, రాజేంద్రనగర్ ప్రాంతాల పరిధిలో మరో ఐటీ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ఈ ప్రాంతాల్లో ఐటీ క్లస్టర్ కోసం సేకరించనున్న భూములను బుధవారం మంత్రి అధికారులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్వేల్ ఐటీ క్లస్టర్‌ను త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. ఈ క్లస్టర్లో కంపెనీలను స్థాపించేందుకు 30కిపైగా బహుళజాతి ఐటీ సంస్థలు, ప్రముఖ దేశీయ కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయన్నారు. త్వరలోనే ఆయా కంపెనీలతో పరిశ్రమల స్థాపనకు లాంఛనంగా ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఈ క్లస్టర్లో అన్ని మౌలిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఐటీ కంపెనీల స్థాపన జరిగితే లక్షా పాతిక వేల కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. -
టూరిస్ట్ పార్క్ కోసం స్థల పరిశీలన
హైదరాబాద్: బుద్వేల్‌కు కిలోమీటర్ దూరంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో టూరిస్టు పార్క్‌ను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి పర్యాటక, రెవెన్యూ, ప్రాజెక్టు నిర్వహణ విభాగం అధికారులు స్థల పరిశీలనసోమవారంచేశారు. ఈ జల క్రీడల వినోదాత్మక పార్క్‌లో రిసార్ట్స్, డ్రైవ్ ఇన్ థియేటర్, సీల్ స్టేడియం, రోలీ కోస్టర్, సెవెన్ డీ థియేటర్, అండర్ వాటర్ టన్నెల్ ఆక్వేరియం, ఇండోర్ స్కై డైవింగ్, మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్, స్పా, డైనోసార్ పార్కు, నీటి అడుగు భాగంలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్మించనున్నారు. ఈ కొత్త ప్రాజెక్టును 30 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నగర పరిసరాల్లో టూరిజం శాఖ ఏర్పాటు చేసే పెద్ద ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. దీని బడ్జెట్ వివరాలను అధికారులు ఇంకా నిర్ణయించలేదు.