ఐటీ క్లస్టర్ భూముల వివరాలను మ్యాపులో పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బుద్వేల్, రాజేంద్రనగర్ ప్రాంతాల పరిధిలో మరో ఐటీ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ఈ ప్రాంతాల్లో ఐటీ క్లస్టర్ కోసం సేకరించనున్న భూములను బుధవారం మంత్రి అధికారులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్వేల్ ఐటీ క్లస్టర్‌ను త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని అన్నారు.
ఈ క్లస్టర్‌లో కంపెనీలను స్థాపించేందుకు 30కిపైగా బహుళజాతి ఐటీ సంస్థలు, ప్రముఖ దేశీయ కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయన్నారు. త్వరలోనే ఆయా కంపెనీలతో పరిశ్రమల స్థాపనకు లాంఛనంగా ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఈ క్లస్టర్‌లో అన్ని మౌలిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని టీఎస్‌ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఐటీ కంపెనీల స్థాపన జరిగితే లక్షా పాతిక వేల కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment