టూరిస్ట్ పార్క్ కోసం స్థల పరిశీలన | land searching of tourist park | Sakshi
Sakshi News home page

టూరిస్ట్ పార్క్ కోసం స్థల పరిశీలన

Published Mon, May 25 2015 10:08 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

land searching of tourist park

హైదరాబాద్: బుద్వేల్‌కు కిలోమీటర్ దూరంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో టూరిస్టు పార్క్‌ను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి పర్యాటక, రెవెన్యూ, ప్రాజెక్టు నిర్వహణ విభాగం అధికారులు స్థల పరిశీలనసోమవారంచేశారు. ఈ జల క్రీడల వినోదాత్మక పార్క్‌లో రిసార్ట్స్, డ్రైవ్ ఇన్ థియేటర్, సీల్ స్టేడియం, రోలీ కోస్టర్, సెవెన్ డీ థియేటర్, అండర్ వాటర్ టన్నెల్ ఆక్వేరియం, ఇండోర్ స్కై డైవింగ్, మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్, స్పా, డైనోసార్ పార్కు, నీటి అడుగు భాగంలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్మించనున్నారు.

ఈ కొత్త ప్రాజెక్టును 30 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నగర పరిసరాల్లో టూరిజం శాఖ ఏర్పాటు చేసే పెద్ద ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. దీని బడ్జెట్ వివరాలను అధికారులు ఇంకా నిర్ణయించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement