
హైదరాబాద్: హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ కమిషనర్ దానకిషోర్ ఉత్తర్వులు విడుదల చేశారు. హెచ్‌జీసీఎల్ ఇన్‌చార్జి ఎండీగా విధులు నిర్వహించిన అప్పటి చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి తన పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆమ్రపాలికి హెచ్‌జీసీఎల్ నిర్వహణ, పర్యవేక్షణపై ఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆమె ఔటర్‌రింగ్‌రోడ్డు ఇన్‌చార్జి ప్రాజెక్టు డైరెక్టర్‌గా, స్పెషల్ కలెక్టర్‌గా కూడా విధులు నిర్వహించనున్నారు. హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీకి ఎండీగా కూడా ఆమె కొనసాగుతున్న సంగతి తెలిసిందే.