హైదరాబాద్: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ కోర్టులో అధికారులు హాజరు పర్చారు. కాగా.. ఆయనకు కోర్టు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 8వరకు రిమాండ్ ఉండనుంది. పోలీసులు ఆయన్ను చంచల్ గూడా జైలుకు తరలించారు.
బాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రదేశాల్లో సోదాలు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడు బాలకృష్ణపై 13 (1) (b), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాలకృష్ణ ఇంటితో పాటు, బందువులు, సహచరుల ఇళ్లల్లో సోదాలు చేశామని పేర్కొన్నారు. బాలకృష్ణ ఇంట్లో రూ.99.60 లక్షలు నగదు సీజ్ చేశామని స్పష్టం చేశారు. 1988 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశామని తెలిపారు. 6 కేజీల సిల్వర్ స‍్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. రూ.8.26 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వ్యాల్యూ లో ఇంకా ఎక్కువ ఉంటుందని అన్నారు. మిగిలిన బీనామీలపై విచారణ చేయాల్సి ఉందని తెలిపారు.
బాధితుల ఆవేదన..
ఏసీబీ అరెస్టుతో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పుప్పాలగూడ సర్వేనెంబర్ 447లో కోర్టు పరిధిలోని వివాదస్పద భూములకు అనుమతులు ఇచ్చారని సూర్యప్రకాష్ అనే బాధితుడు తెలిపాడు. తమకు కోర్టు డిక్రీ ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి పరిమీషన్ ఇచ్చాడని వెల్లడించాడు. రఘురామ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్ కు హైరేస్ అపార్ట్ మెంట్స్ కు అనుమతులు ఇచ్చాడని పేర్కొన్నాడు. అక్రమ అనుమతులపై హైకోర్టకు వెళ్తే కోర్టును తప్పుదోవ పట్టించి ఫేక్ అఫిడవిట్ వేశారని తెలిపాడు. ఆర్టీఏ ద్వారా సమాచారం అడిగితే ఇప్పటివరకు ఎలాంటి సమాదానం ఇళ్వకుండా దాటవేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
సుమారు రూ.400కోట్ల విలువైన 6.36 ఎకరాల భూమిలో అక్రమ పర్మిషన్ ఇచ్చాడని బాధితులు తెలిపాడు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఉన్నారని గతంలో తమను బెదిరించారని తెలిపారు. సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శివ బాలకృష్ణ హయాంలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: నేడో రేపో కోర్టులో ప్రవేశపెట్టనున్న ఏసీబీ
Comments
Please login to add a commentAdd a comment