
సాక్షి, రంగారెడ్డి: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై బుధవారం ఏసీబీ సోదాలు జరిగాయి. ఆదాయం మించి ఆస్తుల కేసు నమోదు చేసి 8 ఏసీబీ బృందాలు సోదాలు చేపట్టాయి. 20 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.
బాలకృష్ణ ఇల్లు, బంధువులు ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టంది. గతంలో పదవిని అడ్డం పెట్టుకొని రూ. కోట్లు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో బాలకృష్ణ కీలక స్థానంలో పనిచేశారు.
చదవండి: సీఎం రేవంత్ సెక్యూరిటీలో లీక్ రాయుళ్లు.. ఐబీ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment