సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర అవినీతినిరోధకశాఖ(ఏసీబీ)లో విభజన కసరత్తును ఆ శాఖాధిపతి ఏకే ఖాన్ దాదాపుగా పూర్తి చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ విభాగానికి బంజారాహిల్స్‌లో కొత్త భవానాన్ని గత సంవత్సరం నిర్మించారు. మొదట మోజంజాహి మార్కెట్ వద్ద ఉన్న ఏసీబీ భవనాన్ని సమాచార హక్కు కమిషనర్‌లకు కేటాయించడంతో కొత్త భవనంలోకి ఏసీబీ హెడ్‌క్వార్టర్స్‌ను మార్చారు. సువిశాలమైన ఈ భవనంలో ఏసీబీ డెరైక్టర్ జనరల్‌తో పాటు డెరైక్టర్, అదనపుడెరైక్టర్లు, జాయింట్ డెరైక్టర్లు, డీఎస్‌పీ,ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారులు మొత్తం 900 మంది ఉన్నారు. వీరితోపాటు ఒక వంద మంది వరకు మినిస్టీరియల్ స్టాఫ్ ఉన్నారు. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులను ఈ ప్రాంతానికి, సీమాంధ్రకు చెందిన వారిని ఆ ప్రాంతానికి దాదాపుగా కేటాయించినట్లు సమాచారం.