కేటీఆర్తో ఏకే ఖాన్ భేటీ
హైదరాబాద్ : ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సోమవారం ఉదయం మంత్రి కేటీఆర్తో సచివాలయంలో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకంలో భాగంగా ఆయన ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో దత్తత గ్రామం విషయంపై ఏకే ఖాన్ ఈ సందర్భంగా కేటీఆర్తో చర్చించినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు, ఊరిలోని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.