కేసీఆర్తో డీజీపీ, ఏసీబీ డీజీ సమావేశం
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు వ్యవహారం గంట గంటకు ఉత్కంఠ పెరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి, ఏసీబీ డీజీ ఏకే ఖాన్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంతో పాటు తాజా పరిణామాలపై వీరు...కేసీఆర్తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసులో మరికొందరికి నోటీసులు ఇచ్చే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. అలాగే ఈ కేసులో పురోగతితో పాటు, జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి అధికారులు వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు కేంద్ర హోంశాఖ ప్రతినిధులు ఇవాళ హైదరాబాద్ రానున్నారు. సెక్షన్-8, ఇతర సమస్యల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.