‘అనేక సంవత్సరాలుగా చూస్తున్నా. బాగా గమనిస్తున్నా. రాబోయే ఆరు నెలలు అత్యంత కీలకమైనవి. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా అప్రమత్తత అవసరం’ అంటూ ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాక్షి, హైదరాబాద్: ‘అనేక సంవత్సరాలుగా చూస్తున్నా. బాగా గమనిస్తున్నా. రాబోయే ఆరు నెలలు అత్యంత కీలకమైనవి. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా అప్రమత్తత అవసరం’ అంటూ ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌హాల్‌లో సాదత్ హసన్ మంటో కథలు అనువాద పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ.. మత కలహాలు భయంకరమైన వని, తాను 40 సంవత్సరాలుగా చాలా సంఘటనలు చూశానని అన్నారు. వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నాయని, ఓటరును పోలింగ్ బూత్‌కు మతం తీసుకెళుతుందని రాజకీయ నాయకులు ఆలోచిస్తారన్నారు. అందువల్ల రాబోయే ఆరు నెలల్లో ఏమైనా జరగొచ్చని, ఓటర్‌ను తమ వైపు తిప్పుకునేందుకు ఏమైనా చేస్తారన్నారు. చారిత్రక తప్పిదాలు మరిస్తే అవి పునరావృతం అవుతాయన్నారు.