సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమం నేపథ్యంలో చేపట్టిన సమ్మె వల్ల ఆర్టీసీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని, వెంటనే సమ్మె విరమించాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నేతలకు ఆ సంస్థ ఎండీ ఎ.కె.ఖాన్ విజ్ఞప్తి చేశారు. అయితే, దీనిపై ఈయూ నేతలు సానుకూలంగా స్పందించలేదు. సమ్మె విరమించడం తమ చేతుల్లో లేదని, జేఏసీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని ఈయూ నేతలు పద్మాకర్, దామోదరరావు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం మినహా మరో మార్గం లేదని, దీనిపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలని కోరారు. విలీనంపై హామీ వస్తే, సమ్మె విరమణపై చర్చిస్తామని తెలిపారు. కాగా, ఈయూ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని ఖాన్ తెలిపారు.
హరీష్‌రావు వ్యాఖ్యలకు ఖండన
తెలంగాణలో వస్తున్న ఆదాయంతో సీమాంధ్రలో ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్తిస్తున్నారంటూ టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ఈయూ సమైక్యాంధ్ర పోరాట కమిటీ ఖండించింది. తెలంగాణలోని 90 డిపోల్లో 2, సీమాంధ్రలోని 123 డిపోల్లో 3 మాత్రమే లాభాల్లో ఉన్నాయని, అన్ని ప్రాంతాల్లోనూ ఆర్టీసీ నష్టాల్లోనే ఉందని కమిటీ చైర్మన్ సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి, కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు.
సమ్మె విరమణ మా చేతుల్లో లేదు
Published Thu, Oct 3 2013 1:18 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement
Advertisement