ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే కొనుగోలు కుంభకోణంలో ఏసీబీకి చిక్కిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు పేరును...
ఏకే ఖాన్‌కు తెలంగాణ అడ్వొకేట్ల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే కొనుగోలు కుంభకోణంలో ఏసీబీకి చిక్కిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు పేరును వెంటనే ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని తెలంగాణ అడ్వొకేట్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అడ్వొకేట్లు టి. శ్రీరంగారావు, కె. గోవర్దన్‌రెడ్డి, వి. ఇంద్రసేనారెడ్డి, తిరుపతివర్మ తదితరులు మంగళవారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లి డీజీని కలిసేం దుకు ప్రయత్నించారు.
ఆయన లేకపోవడంతో కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. స్టీఫెన్‌సన్‌తో సంభాషణల్లో బాబు పేరును ‘బాస్’, ‘నాయుడు’ పేరుతో రేవంత్‌పలుమార్లు సంబోధించినట్లు వీడియో ఫుటేజీల్లో ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రే కాక టీడీపీ జాతీయ అధ్యక్షుడని, ఆయన బయట ఉంటే కేసులోని సాక్షాధారాలను తారుమారు చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.