T lawyers
-
ఎమ్మెల్సీ రామచంద్రరావుపై న్యాయవాదుల ఫిర్యాదు
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కె.కవితను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ న్యాయవాదులు శుక్రవారం సెంట్రల్ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రామచంద్రరావు... హైదరాబాద్‌కు విదేశీ మల్టీనేషనల్ కంపెనీలు, సాఫ్ట్వేర్ సంస్థలు ప్రధాని మోదీని చూసి వస్తున్నాయన్న ఆయన ఎంపీ కవితను చూసి కాదంటూ అభ్యంతరకరమైన పదజాలం వాడారని పేర్కొన్నారు. న్యాయవాదులు కె.గోవర్థన్‌రెడ్డి, సీహెచ్ ఉమేందర్, సి.కళ్యాణ్‌రావు, టి.శ్రీధర్‌రెడ్డిలు డీసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ రామ్మోహన్‌రావును కలసి ఫిర్యాదు అందించారు. -
రోడ్డుపై టీ లాయర్ల భోజనాలు
హైదరాబాద్: హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు వినూత్న నిరసన చేపట్టారు. హైకోర్టు ఎదుట రోడ్డుపై బైఠాయించి సామూహిక భోజనాల చేశారు. ఈ సందర్భంగా హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. తమ డిమాండ్ పరిగణనలోకి తీసుకోకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. హైకోర్టు విభజన పూర్తి చేయకుంటే పార్లమెంటును ముట్టడిస్తామని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్ చేశారు. -
బాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలి
ఏకే ఖాన్‌కు తెలంగాణ అడ్వొకేట్ల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే కొనుగోలు కుంభకోణంలో ఏసీబీకి చిక్కిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు పేరును వెంటనే ఎఫ్ఐఆర్లో చేర్చాలని తెలంగాణ అడ్వొకేట్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అడ్వొకేట్లు టి. శ్రీరంగారావు, కె. గోవర్దన్‌రెడ్డి, వి. ఇంద్రసేనారెడ్డి, తిరుపతివర్మ తదితరులు మంగళవారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లి డీజీని కలిసేం దుకు ప్రయత్నించారు. ఆయన లేకపోవడంతో కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. స్టీఫెన్‌సన్‌తో సంభాషణల్లో బాబు పేరును ‘బాస్’, ‘నాయుడు’ పేరుతో రేవంత్పలుమార్లు సంబోధించినట్లు వీడియో ఫుటేజీల్లో ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రే కాక టీడీపీ జాతీయ అధ్యక్షుడని, ఆయన బయట ఉంటే కేసులోని సాక్షాధారాలను తారుమారు చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. -
ఏకే ఖాన్‌ను కలిసిన టీ లాయర్లు
హైదరాబాద్ : ఓటుకు నోటు స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా చేర్చాలని కోరుతూ టీ లాయర్లు ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ను కలిశారు. మంగళవారం తెలంగాణ అడ్వకేట్ జేఏసీ లాయర్లు గుంపుగా వెళ్లి ఖాన్‌ను కలిసి బాబు పేరును నిందితుల్లో చేర్చాలని కోరారు.