హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కె.కవితను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ న్యాయవాదులు శుక్రవారం సెంట్రల్ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రామచంద్రరావు... హైదరాబాద్‌కు విదేశీ మల్టీనేషనల్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ సంస్థలు ప్రధాని మోదీని చూసి వస్తున్నాయన్న ఆయన ఎంపీ కవితను చూసి కాదంటూ అభ్యంతరకరమైన పదజాలం వాడారని పేర్కొన్నారు. న్యాయవాదులు కె.గోవర్థన్‌రెడ్డి, సీహెచ్ ఉమేందర్, సి.కళ్యాణ్‌రావు, టి.శ్రీధర్‌రెడ్డిలు డీసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ రామ్మోహన్‌రావును కలసి ఫిర్యాదు అందించారు.