బినామీ రేషన్ షాపులు రద్దు చేయాలి
Published Tue, Aug 30 2016 9:43 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
బోట్‌క్లబ్ (కాకినాడ) :
బినామీ రేషన్ షాపులు అధికంగా ఉన్నాయని వాటిని వెంటనే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రామ్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ సత్యనారాయణను కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో కలిసి బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పలుచోట్ల ఒకే డీలరు పేరు మీద రెండు మూడు షాపులు ఉన్నాయన్నారు. అలాంటిచోట్ల ప్రజలకు సక్రమంగా రేషన్ సరుకులు ఇవ్వడం లేదన్నారు. జిల్లాలోని పలు మీసేవా కేంద్రాల్లో సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల వినియోగదారులు అవస్థలు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దాలని కోరారు. జేసీని కలిసిన వారిలో బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి బండారు భాస్కర్, జిల్లా యువమోర్చా నాయకులు ముసలగంటి సురేష్, ఎన్‌వీసాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement