ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ.50 లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ డీజీ ఎ.కె.ఖాన్ తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీఫెన్‌సన్ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి ట్రాప్ చేసినట్లు తెలిపారు.