Non bailable case
-
అల్లు అర్జున్ పై నాన్-బెయిలబుల్ కేసు
-
పృథ్వీరాజ్ కు బిగ్ షాక్
-
నటుడు దిలీప్‌కు ఊరట.. అప్పటివరకు అరెస్ట్ చేయొద్దని
Kerala High Court Restrains Police From Arresting Actor Dileep: ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌కు కాస్త ఊరట లభించింది. స్టార్ హీరోయిన్‌పై లైంగిక దాడి కేసును విచారిస్తున్న దర్యాప్తు అధికారులను బెదిరించిన కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దిలీప్‌ను జనవరి 18 వరకు అరెస్ట్ చేయకుండా కేరళ హైకోర్టు ఆ రాష్ట్ర పోలీసులపై నిషేధం విధించింది. అలాగే దిలీప్‌పై ఇచ్చిన సినీ దర్శకుడు బాలాచంద్ర కుమార్ వాంగ్మూలాన్ని పరిశీలిస్తామని జస్టిస్ గోపీనాథ్‌తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం పేర్కొంది. ఇటీవల దర్యాప్తు అధికారులను బెదిరించారనే ఆరోపణలతో దిలీప్‌తో పాటు మరో ఐదుగురిపై కొత్తగా కేసు నమోదు చేశారు కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆడియో క్లిప్‌లు బయటకు రావడంతో వీరిపై ఐపీసీ సెక్షన్లు 116, 118, 120B, 506, 34 కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో దిలీప్‌ను మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. అలాగే విచారణ అధికారులు బైజు పౌలోస్, సుదర్శన్, సంధ్య, సోజన్లు ఇబ్బంది పడతారని దిలీప్ బెదిరించినట్లు కోర్టుకు సమర్పించిన ఎఫ్ఐఆర్లో ఉన్నట్లు సమాచారం. సుదర్శన్‌తో పాటు మరో దర్యాప్తు అధికారి చేతిని నరికేందుకు దిలీప్ కుట్ర పన్నాడని అందులో ఆరోపించారు. ఫిబ్రవరి 17, 2017 రాత్రి మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో గుర్తింపు పొందిన ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి, వేధింపులకు గురి చేసిన కేసులో దిలీప్ ఎనిమిదో నిందితుడిగా ఉన్నాడు. ఇదీ చదవండి: స్టార్ హీరోపై నాన్ బెయిలబుల్ కేసు.. మరో ఐదుగురిపై -
స్టార్ హీరోపై నాన్ బెయిలబుల్ కేసు.. మరో ఐదుగురిపై
Non Bailable Case Registered Against Actor Dileep By Kerala Police: మలయాళ సూపర్ స్టార్ దిలీప్ లైంగిక వేధింపుల కేసులో కొత్త మలుపు తిరిగింది. సౌత్ ఇండియన్ పాపులర్ హీరోయిన్‌పై ఓ ముఠా లైంగిక వేధింపులు పాల్పడి, ఆ సన్నివేశాలను చిత్రీకరించిన కేసులో దిలీప్ అరెస్టయిన సంగతి తెలిసిందే. 2017 జూలైలో అరెస్టయిన దిలీప్ రెండు నెలల జైలు శిక్ష తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇంకా కొనసాగుతోన్న ఈ కేసు విషయంలో దిలీప్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా దిలీప్, అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు. కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సమచారం ప్రకారం దిలీప్‌తో పాటు మరో ఐదుగురిపై (దిలీప్ బంధువులు, కుటుంబ సభ్యులు) కొత్త కేసు నమోదైంది. దిలీప్, మిగిలిన ఐదుగురు విచారణ అధికారులను బెదిరించారట. ఈ విషయాలను దర్శకుడు బాలచంద్ర కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌లు బయటపడ్డాయి. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను దిలీప్, ఆతని బృందం బెదిరించినట్లు ఆడియో క్లిప్‌ల ద్వారా తెలుస్తోందట. ఈ లైంగిక దాడి చేసేందుకు ముఠా కోసం రూ. 1.5 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. బాలచంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్శకుడి ఫిర్యాదు ప్రకారం దిలీప్‌తోపాటు ఆ వ్యక్తులు దర్యాప్తు అధికారుల ప్రాణాలకు హాని కలిగించేందుకు ప్రయత్నించారట. ఇదీ చదవండి: మరో నెగెటివ్ రోల్లో సమంత !.. ప్రేమకు అడ్డుగా -
పేర్లు మార్చుకొని. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. చివరికి!
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌తోపాటు మరో రెండు జి ల్లాల్లో వివిధ నేరాలు చేశాడు.. జైలుకు వెళ్లి విడుదలయ్యాడు.. తర్వాత పేరు మార్చుకొని అజ్ఞాతంలోకి వెళ్లిన నేరస్థుడిని కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ టౌన్ అడిషనల్ డీసీపీ పి.అశోక్ బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించాడు. కేశవపట్నం మండలం తాడి కల్ గ్రామానికి చెందిన మొలుగూరి విద్యాసాగర్(32) డిగ్రీ వరకు చదువుకున్నాడు. భూపాలపట్నంకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 2015–16 మధ్య నేరాలు చేయడం ప్రారంభించాడు. అతనిపై కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో 12 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యాడు. తర్వాత శిక్ష తప్పించుకునేందుకు స్వగ్రామంతో సంబంధాలు తెంచుకున్నాడు. హైదరాబాద్‌లోని సఫీల్ గూడకు మకాం మార్చాడు. 2017లో విజయ్‌గా పేరు మార్చుకొని, అంజలి అనే యువతిని రెండో వివాహం చేసుకొని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ వివాహ ధ్రువపత్రం పొందాడు. ఈ క్రమంలో విద్యాసాగర్‌పై పలు కోర్టులు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడంతో అతడిని పట్టుకునేందుకు కరీంనగర్ టౌన్ ఏసీపీ ఆధ్వర్యంలో ఆపరేషన్ తలాష్‌లో భాగంగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, అతని బంధువుల నుంచి వివరాలు సేకరించారు. తుదకు నకిలీ ఆధార్‌కార్డుతో తీసుకున్న ఫోన్ నంబర్ కనిపెట్టి, హైదరాబాద్ వెళ్లి విద్యాసాగర్‌ను అరెస్టు చేశారు. బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు ఎన్.సుజాత, జి.కృష్ణకుమార్ తదితరులను సీపీ కమలాసన్‌రెడ్డి అభినందించారు. -
మద్యం అక్రమంగా తరలిస్తే నాన్ బెయిలబుల్ కేసులు
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను మరింత కఠినతరం చేసింది. ఎవరైనా మద్యం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చట్టాలు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాన్ బెయిలబుల్ కేసులతో పాటు పదే పదే మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరించారు. వివరాలిలా ఉన్నాయి.. ► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరోకు చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ► పోలీస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమలు చేస్తూనే ఎక్సైజ్ చట్టంలో పలు సవరణలు చేశారు. ► తాజాగా సవరించిన ఎక్సైజ్ చట్టం 34 (ఏ) ప్రకారం ఒకే వ్యక్తి పలుమార్లు ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే ఐదు నుంచి ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ► సాధారణ కేసుల విషయంలోనూ రెండేళ్లకు తగ్గకుండా శిక్షలు పడే విధంగా చట్టాన్ని పటిష్టం చేశారు. ► ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ స్థానంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ► ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రవాణా కాకుండా, ఏపీలో సారా రూపంలో కల్తీ మద్యం తయారు కాకుండా నిరోధించేందుకు ఎస్ఈబీ స్వతంత్ర వ్యవస్థగా పనిచేస్తుంది. మద్య నియంత్రణకు వేగంగా అడుగులు దశల వారీ మద్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేశారు. ఇప్పుడు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కలిసి అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్ఈబీకి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం హర్షణీయం. – వి.లక్ష్మణరెడ్డి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ -
రేవంత్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు
బంజారాహిల్స్: పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధి నిర్వహణలో ఉన్న అధికారిని తోసేసి దురుసుగా ప్రవర్తించిన ఘటనలో మల్కాజ్గిరి ఎంపీ, టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సోమవారం ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం.48లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్ పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయనను హౌజ్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు, జూబ్లీహిల్స్ ఇన్ స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి, సెక్టార్ ఎస్ఐ నవీన్ రెడ్డి తదితరులు ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన బయటకు రాకుండా కట్టడి చేశారు. అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనుచరులతో కలిసి అతివేగంగా ఇంట్లో నుంచి బయటకు దూసుకొ చ్చారు. ఆ సమయంలో అడ్డుకున్న ఎస్ఐ నవీన్ రెడ్డితో పాటు పలువురు పోలీసులను నెట్టుకుంటూ, పక్కకు తోసేస్తూ అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్‌పై దూసుకుపోయారు. పోలీసులు అప్రమత్తమై చాలాదూరం చేజ్ చేసుకుంటూ వెళ్లినా అప్పటికే రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఈ ఘటనలో నవీన్ రెడ్డికి గాయాలయ్యాయి. మిగతా పోలీసులను కూడా నెట్టుకుంటూ వెళ్లడంతో వారు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఐ నవీన్ రెడ్డి పోలీసు విధులకు ఆటంకం కలిగించిన రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేయగా ఆయనపై ఐపీసీ సెక్షన్ 341, 332తో పాటు 353 కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాటి, ఈత చెట్లను నరికితే నాన్ బెయిలబుల్ కేసులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికేవారిపై సెక్షన్ 27, ఆబ్కారీ చట్టం 1968 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశిం చారు. రియల్ ఎస్టేట్ సంస్థలు లేఅవుట్ల పేరు తో తాటి, ఈత చెట్లను నరికి వేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వచ్చిన వినతులపై ఆయన ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. -
రాజధానికి చేరిన ‘ఆర్టీఓ’ పంచాయితీ
సాక్షి, మెదక్: జిల్లా రవాణా శాఖకు సంబంధించిన బాగోతం రాష్ట్ర రాజధానికి చేరింది. నెలరోజు లుగా ఓ సంఘం నేత, ఏజెంట్ల మధ్య కొనసాగుతున్న వార్ హోంమంత్రితోపాటు డీజీపీ కార్యాలయం దృష్టికి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీఓ కార్యాలయంలో ఇటీవల వరకు ఏజెంట్ల విధానం కొనసాగిన విషయం తెలిసిందే. లైసె న్స్‌లు, రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్, పత్రాల మార్పిడి వంటి వివిధ పనుల నిమిత్తం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే వాహనదారుల నుంచి ఏజెంట్లు అనధికార వసూళ్లకు తెగబడ్డారు. అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు, సిబ్బందితో కుమ్మక్కై వాహనదారులను నిలువు దోపిడీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించి అవినీతి బాగోతంపై ఓ సంఘం నేత పలు ఆధారాలతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఏజెంట్లు, ఆ సంఘం నేత మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. సదరు సంఘం నేతను అంతమొందించేందుకు ఏజెంట్లు ప్లాన్ వేసినట్లు బయటకు పొక్కడం వేడిపుట్టించింది. ఇదే సమయంలో తమను డబ్బులు డిమాండ్ చేసినట్లు సదరు సంఘం నేతపై ఏజెంట్లు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తనను, తనకుటుంబాన్ని అంతమొందించేందుకు ఏజెంట్లు ప్రయత్నించారని సంఘం నేత సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏజెంట్లపై సెక్షన్ 341, 506 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదయ్యాయి. సంఘం నేతపై సెక్షన్ 384 కింద కేసు నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు సంఘం నేత మంగళవారం హైదరాబాద్‌లో హోంమంత్రి మహమూద్ అలీని కలిసి ఫిర్యాదు చేశాడు. డీజీపీ కార్యాలయంలో సైతం ఫిర్యాదు చేశాడు. ఏజెంట్లు తప్పుడు ఆరోపణలు చేశారని.. ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించిన అవినీతిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. అయినా పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. తనపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారని.. ఏజెంట్లపై పిటీ కేసు మాత్రమే నమోదు చేశారని అందులో వివరిం చారు. వెంటనే సమగ్ర విచారణ చేపట్టి నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. మెదక్ ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించిన లొల్లి హోంమంత్రి పేషీ, డీజీపీ కార్యాలయానికి చేరడంతో ఏం జరుగుతుందనే అంశం జిల్లాలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. -
క్వారీ పేలుడు.. టీడీపీ నేతపై నాన్ బెయిలబుల్ కేసు
సాక్షి, కర్నూలు : హత్తిబెళగల్ క్వారీ యజమాని, టీడీపీ నేత శ్రీనివాస చౌదరీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 304/11 ప్రకారం యజమానిపై కేసు నమోదు చేసినట్లు కర్నూల్ పోలీసులు శనివారం తెలిపారు. కర్నూలులోని ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీలో శుక్రవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించడంతో పదిమంది మృతి విషయం తెలిసిందే. దీనిపై ఎట్టకేలకు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ స్పందించారు. మైనింగ్ బ్లాస్టింగ్ వలన పేలుడు జరగలేదని, కేవలం జిల్టన్ స్టిక్ డంపింగ్ వల్లనే ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. గ్రామదర్శిని ప్రజలు అడ్డుకున్నప్పుడే క్వారీపై చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదికాదని ఆయన అన్నారు. ఘటనపై విచారణ జిరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోస్ట్‌మార్టం ఘటనలో మరణించిన మృతదేహాలకు వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఘటనలో చనిపోయిన పది మందిని అధికారులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కో మృత దేహానికి ఒక్కో వీఆర్వోను నియమించి పంచనామా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు. -
అసత్య ప్రచారాలు చేస్తే కేసులు
కరీంనగర్ క్రైం : వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియా అసత్య ప్రచారాలను పోస్టు చేసేవారిని గుర్తించేందుకు కరీంనగర్ సోషల్ మీడియా ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వివిధ రకాల గ్రూపుల నుంచి పోస్టు చేసిన వ్యక్తులతోపాటు గ్రూప్ అడ్మిన్లపై క్రిమినల్ కేసులు తప్పవని, ప్రజలను భయబ్రాంతులను గురి చేసే పోస్టులు పంపినవారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు కొందరిని గుర్తించామని, మరి కొందరిని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని, వివిధ రాష్ట్రాల దొంగ ముఠా సభ్యులు గొంతు కోస్తున్నారని, మెదడు తింటున్నారని వస్తున్న పుకార్లలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. దొంగలొస్తున్నారని ప్రజలు రాత్రి కర్రలు పట్టుకొని ఆపరిచితులను చితకబాదుతున్నారని అన్నారు. వారిపై క్రిమనిల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇటుకబట్టీలు, గ్రానైట్ క్వారీలు, కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఇతర రాష్ట్రాలవారు ఎక్కువగా పని చేస్తున్నారని, వారికి స్థానిక భాష రాకపోవడంతో అనుమానిస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులు, డయల్ 100కు సమాచారం అందించాలని, కేవలం 10 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుంటారని వివరించారు. నాన్ బెయిలెబుల్ వారెంట్లకు ప్రత్యేక బృందాలు కరీంనగర్ కమిషనరేట్ పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిల్‌బుల్ వారెంట్ల అమలు వేగవంతం చేసేందుకు 30 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. ఈనెల 31 వరకు ఈ బృందాలు పని చేస్తాయని, మరో 4బృందాలను కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. మొదట కరీంనగర్ కమిషనరేట్ తర్వాత పక్కా జిల్లాలు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు పూర్తి చేసిన తర్వాత ఇతర జిల్లాలకు బృందాలను పంపిస్తామని తెలిపారు. గడిచిన మూడు రోజుల్లో 55 వారెంట్లు అమలు చేశామని, కమిషనరేట్‌వ్యాప్తంగా 800కి పైగా నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అమలు చేసే ప్రతి వారెంట్‌కు రూ.750 రివార్డు, ఎక్కువ వారెంట్లు అమలు చేసినవారికి ప్రశంసాపత్రాలు అందిస్తామని తెలిపారు. -
కోర్టు బయట పరిష్కరించుకుంటాం: షమీ
న్యూఢిల్లీ: తన భార్యతో తలెత్తిన వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ తెలిపాడు. తన భర్త మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్ జహాన్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గృహహింస, హత్యాయత్నం కింద షమీపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ‘ఈ సమస్యపై చర్చించి పరిష్కరించుకోవడం మినహా చేసేదేమీ లేదు. కోర్టు వెలుపల పరిష్కారం కనుగొనడమే నాకు, నా పాపకు, నా కెరీర్‌కు ప్రయోజనకరం. కోల్‌కతాకు వెళ్లి నా భార్యతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా’ అని మీడియాతో షమీ అన్నాడు. మరోవైపు అతని భార్య కూడా వివాద పరిష్కారానికే మొగ్గుచూపుతోంది. ‘నేను అతని అనుచిత స్క్రీన్ షాట్స్, వాట్సాప్ మెసేజ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాకే షమీ నిజ స్వరూపమేంటో బయటపడింది. అయితే ఇప్పటికీ అతను నిజాయతీగా తన తప్పులను సరిదిద్దుకుంటానంటే మా అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. సయోధ్యపై ఆలోచిస్తాను’ అని హసీన్ తెలిపింది. ‘అతని ఫోన్ నాకు దొరకడం, అందులో అభ్యంతరకర ఫొటోలు, చాటింగ్‌లు ఉండటం వల్లే షమీ మిన్నకుండిపోయాడు. లేదంటే ఇప్పటికే విడాకులిస్తానని కోర్టుకెక్కేవాడు’ అని ఆమె చెప్పింది. మరోవైపు ఇప్పటికే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయిన షమీకి ఐపీఎల్–11 సీజన్ కూడా చేజారే ప్రమాదముంది. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు షమీని ఆడించాలా వద్దా? అనే అంశంపై బోర్డు అనుమతి కోరింది. బీసీసీఐ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ సీఈఓ హేమంత్ దువా వెల్లడించారు. -
రేవంత్‌పై నాన్‌బెయిలబుల్ కేసు
-
రేవంత్‌పై నాన్‌బెయిలబుల్ కేసు
మీడియాతో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ.50 లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ డీజీ ఎ.కె.ఖాన్ తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీఫెన్సన్ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి ట్రాప్ చేసినట్లు తెలిపారు. ‘‘రేవంత్‌రెడ్డి ప్రలోభపెడుతున్నారంటూ మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీతో విచారణకు ఆదేశించాం. ఆదివారం రేవంత్ రూ.50 లక్షలు స్టీఫెన్సన్కు ఇస్తూ పట్టుబడ్డారు. రేవంత్‌తో పాటు, డబ్బు లు తెచ్చిన బిషప్ సెబాస్టియన్ హరి, ఉదయ్‌సింహలను అదుపులోకి తీసుకున్నాం. అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 12, ఐపీసీ సెక్షన్ 120డి, 34 (లంచం ఇవ్వజూపడం, మూకుమ్మడిగా ప్రలోభానికి గురిచేయడం) కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశాం. వీరితోపాటు, ఇంతకు ముందు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఈ డీల్ గురించి మాట్లాడిన మాథ్యూస్ జెరూసలం అనే వ్యక్తిపైనా కేసు నమోదు చేశాం. అతను మా అదుపులో లేడు. రూ.50 లక్షలు కూడా రికవరీ చే శాం’’ అని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పంపిస్తేనే వచ్చానన్న రేవంత్ వ్యాఖ్యలపై విచారణలో అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. ‘‘సాక్షాలన్నీ దొరికాయి. వాటిని, ప్రాథమిక ఆధారాలను పరిశీలించాకే కేసు నమోదు చేశాం. విచారణ అనంతరం రేవంత్‌ను జడ్జి ముందు ప్రవేశపెడతాం’’ అని వివరించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఎక్కడినుంచి వచ్చిందనేది కూడా విచారణలో తెలుస్తుందన్నారు. డీజీపీని కలిసిన టీడీపీ నేతలు: రేవంత్ అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు ఎర్రబెల్లి తదితరులు డీజీపీ అనురాగ్‌శర్మను కలిశారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్‌ను చంపే కుట్ర జరుగుతోందని, కావాలనే కేసులో ఇరికించారని ఫిర్యాదు చేశారు. కాగా చంద్రబాబు అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.