సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికేవారిపై సెక్షన్ 27, ఆబ్కారీ చట్టం 1968 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశిం చారు. రియల్ ఎస్టేట్ సంస్థలు లేఅవుట్ల పేరు తో తాటి, ఈత చెట్లను నరికి వేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వచ్చిన వినతులపై ఆయన ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment