Kerala High Court Restrains Police From Arresting Actor Dileep: ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌కు కాస్త ఊరట లభించింది. స్టార్ హీరోయిన్‌పై లైంగిక దాడి కేసును విచారిస్తున్న దర్యాప్తు అధికారులను బెదిరించిన కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దిలీప్‌ను జనవరి 18 వరకు అరెస్ట్ చేయకుండా కేరళ హైకోర్టు ఆ రాష్ట్ర పోలీసులపై నిషేధం విధించింది. అలాగే దిలీప్‌పై ఇచ్చిన సినీ దర్శకుడు బాలాచంద్ర కుమార్ వాంగ్మూలాన్ని పరిశీలిస్తామని జస్టిస్ గోపీనాథ్‌తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం పేర్కొంది. ఇటీవల దర్యాప్తు అధికారులను బెదిరించారనే ఆరోపణలతో దిలీప్‌తో పాటు మరో ఐదుగురిపై కొత్తగా కేసు నమోదు చేశారు కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు.
ఈ ఆరోపణలకు సంబంధించి ఆడియో క్లిప్‌లు బయటకు రావడంతో వీరిపై ఐపీసీ సెక్షన్లు 116, 118, 120B, 506, 34 కింద కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో దిలీప్‌ను మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. అలాగే విచారణ అధికారులు బైజు పౌలోస్, సుదర్శన్, సంధ్య, సోజన్‌లు ఇబ్బంది పడతారని దిలీప్ బెదిరించినట్లు కోర్టుకు సమర్పించిన ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నట్లు సమాచారం. సుదర్శన్‌తో పాటు మరో దర్యాప్తు అధికారి చేతిని నరికేందుకు దిలీప్ కుట్ర పన్నాడని అందులో ఆరోపించారు. ఫిబ్రవరి 17, 2017 రాత్రి మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో గుర్తింపు పొందిన ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి, వేధింపులకు గురి చేసిన కేసులో దిలీప్ ఎనిమిదో నిందితుడిగా ఉన్నాడు.
ఇదీ చదవండి: స్టార్ హీరోపై నాన్ బెయిలబుల్ కేసు.. మరో ఐదుగురిపై
Comments
Please login to add a commentAdd a comment