బాబుపై కేసు నమోదుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ !
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న ఓటుకు నోటు వ్యవహారంలో దూకుడు పెంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులోభాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో అవినీతి నిరోధక శాఖ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్రెడ్డి మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు నమోదుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో చంద్రబాబుకు ఏ క్షణమైనా నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసుకుంటోది. అదీకాక చంద్రబాబు ఢిల్లీ పయనంపై కూడా వారు ఈ సందర్భంగా వారు చర్చించినట్లు తెలుస్తోంది.