హైదరాబాద్కు తిరిగొచ్చిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మెదక్ జిల్లాలోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
నాలుగు రోజుల క్రితం కేసీఆర్ తన ఫాం హౌస్కు వెళ్లిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులూ కేసీఆర్ అక్కడే గడిపారు. వ్యవసాయ క్షేత్రంలో పొలం పనులను పరిశీలించారు. కేసీఆర్ ఫాం హౌస్లోనే నాయకులు, అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.