ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్ కు, టీడీపీ మధ్య జరుగుతున్న వివాదాల్లోకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని లాగొద్దని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు.
విజయనగరం: ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్ కు, టీడీపీ మధ్య జరుగుతున్న వివాదాల్లోకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని లాగొద్దని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఓటుకు నోటు విషయం ఇద్దరు సీఎంలు, పార్టీల మధ్య వ్యవహారమే తప్ప రెండు రాష్ర్టాల వివాదం కాదన్నారు. వాస్తవాలను ప్రజలకు చెబితే తమను చెడ్డవారని ప్రచారం చేయడం తగదన్నారు. ఓటుకు కోట్ల వ్యవహారంపై నమోదైన కేసులో చంద్రబాబు ను మొదటి ముద్దాయి గా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.