
బెయిల్ కూడా దొరక్కపోవచ్చు!
ఓటుకు నోటు స్కాంలో ఆధారాలు చాలా గట్టిగా ఉన్నాయని, దర్యాప్తు అధికారులు కేసును సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే రేవంత్ రెడ్డికి కనీసం బెయిల్ కూడా దొరికే అవకాశం ఉండబోదని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. దర్యాప్తు అధికారులు ఆధారాలను చాల పకడ్బందీగా సేకరించారని.. ఆడియో, వీడియో ఆధారాలు రెండూ ఉన్నాయని అంటున్నారు.
దొరికిన డబ్బు, వీడియో ఫుటేజి, ఆయన చర్చ, వీడియోలో ఆయన చెప్పిన మొత్తం విషయాలు అన్నీ చూస్తే ఒక కుట్ర చేసి, ప్రజాప్రతినిధికి లంచం ఇచ్చి ఓటు వేయించే ప్రయత్నం చేసినట్లు ఎస్టాబ్లిష్ అయిందని, కేసు నిలబడుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మాజీ పోలీసు అధికారి అన్నారు. ఇక ఏసీబీ అధికారులు కూడా ఈ కేసు విషయంలో గట్టి విశ్వాసంతో ఉన్నారు. తమ వద్ద ఆధారాలు గట్టిగా ఉన్నాయని, రిమాండ్ రిపోర్టు పక్కాగా రాశామని , ఎటువైపు నుంచి చూసినా రేవంత్ రెడ్డికి బెయిల్ కూడా రాదని చెబుతున్నారు.