కన్నడ సీమలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటకలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. 13 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతును కూడగడుతూ కుమారస్వామి సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. కాగా, ముగ్గురు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముంబైలో ఓ హోటల్‌లో ఉన్నారని, తమ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలకు దిగుతోందని స్వయంగా కర్ణాటక మంత్రి శివకుమార్ ఆరోపించారు.