
ఆ డబ్బంతా ఒకరిద్దరి నుంచే!
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌లో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో కనిపించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ డబ్బు అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరు బడావ్యక్తుల నుంచే పెద్ద మొత్తంలో డ్రా అయినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే ఓ సినీ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రికి సంబంధించిన వ్యక్తుల ఖాతాలతో పాటు హవాలా పద్ధతిలో వచ్చిన మొత్తం కూడా ఈ నోట్ల కట్టల్లో ఉందని సమాచారం. అటు ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్వయంగా అందజేసిన 50 లక్షల రూపాయల మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు. నోట్ల కట్టలపై బ్యాంకు స్లిప్పులు, డినామినేషన్ల ప్రకారం ఏ బ్యాంకు నుంచి అంత మొత్తాన్ని డ్రా చేశారనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ హారీ, ఉదయ్‌సింహల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల కాల్ రికార్డులను బట్టి కూడా డబ్బు కట్టల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.