Oct 31st 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Chandrababu Naidu Arrest Remand Court Hearings Oct 31 Updates | Sakshi
Sakshi News home page

Oct 31st 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Tue, Oct 31 2023 6:46 AM | Last Updated on Tue, Oct 31 2023 7:21 PM

Chandrababu Naidu Arrest Remand Court Hearings Oct 31 Updates - Sakshi

Chandrababu Arrest, Remand, Cases, Petitions, Court Hearings And Political Updates


07:05 PM, అక్టోబర్‌ 31, 2023
52 రోజుల ప్రస్థానం ఇది - టైంలైన్‌
►రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు
►సెప్టెంబరు 9న స్కిల్‌ స్కాంలో అరెస్టు, అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్
►రిమాండ్ ఖైదీగా సెప్టెంబరు పది అర్ధరాత్రి ఒంటిగంటన్నరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు
►జైల్లో చంద్రబాబుకు ప్రత్యేకంగా స్నేహా బ్లాక్ కేటాయింపు
►కోర్టు ఆదేశాల మేరకు ప్రతి రోజూ భోజనం, మందులు ఇంటినుంచే అందించే వెసులు బాటు
►సెప్టెంబరు 22 వరకు రిమాండ్, రెండురోజులపాటు సీఐడీ కస్టడీ విచారణ
►రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రెండురోజుల పాటు సీఐడీ అధికారులు విచారణ, తెలియదు, గుర్తులేదు అన్న చంద్రబాబు
►జైల్లో దోమలు ఉన్నాయని, చంద్రబాబుకు ముప్పు పొంచిఉందని పచ్చమీడియా విపరీతమైన ప్రచారం
►సెప్టెంబరు 24న మరోసారి చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు, అక్టోబరు ఐదువరకూ రిమాండ్ కొనసాగింపు
►చంద్రబాబుకు చర్మ వ్యాధి ఉందంటూ పచ్చమీడియా విపరీత ప్రచారం, ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు
►కోర్టు ఆదేశాలమేరకు చంద్రబాబుకు టవర్ ఏసీ ఏర్పాటు
►చంద్రబాబుకు రోజుకు మూడు సార్లు వైద్య పరీక్షలు
►ఒక వైద్య పరీక్షలో ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు
►చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు, అక్టోబరు 5నుండి 19వరకూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు
►వారానికి రెండుసార్లు చంద్రబాబుతో ములాఖత్ అయిన భువనేశ్వరి, లోకేష్ ,బ్రాహ్మణి
►చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం, ఐదు కిలోలు బరువు తగ్గారంటూ ఆందోళన
►చంద్రబాబు కిలో బరువు పెరిగారని, జైలుకు వచ్చినపుడు 66 కిలోలు ఉండేవారని, ఇపుడు 67 కిలోలు ఉన్నారని స్పష్టం చేసిన అధికారులు
►విడుదల సమయానికి మరో అరకిలో పెరిగి 67.5 కిలోలకు చేరుకున్నచంద్రబాబు
►అక్టోబరు 19 నుండి నవంబరు ఒకటి వరకూ చంద్రబాబు జ్యుడిషియర్ రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
►తన కుడికంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయాలని జైలు అధికారులకు తెలిపిన  చంద్రబాబు
►జీజీహెచ్ వైద్యులతో పరీక్షలు చేయించిన అధికారులు
►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు

06:45 PM, అక్టోబర్‌ 31, 2023
రాజమండ్రిలో టిడిపి అతితో గందరగోళం
►రెండు గంటలయినా రాజమండ్రి దాటని చంద్రబాబు కాన్వాయ్‌
►దివాన్ చెరువు మీదుగా వేమగిరి వైపు కాన్వాయ్
►భారీగా కార్యకర్తలను తరలించిన టిడిపి నేతలు
►టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా పోటెత్తడంతో రాజమండ్రి అస్తవ్యస్తం
►చంద్రబాబు కాన్వాయ్‌కు పోటీగా వందలాది వాహనాలను తీసుకొచ్చిన టీడీపీ నేతలు
►వందలాది వాహనాలు రావడంతో స్తంభించిపోయిన రాజమండ్రి
►తెలుగుదేశం ప్రైవేట్ వాహనాల రాకతో భారీగా ట్రాఫిక్ జామ్
►దివాన్ చెరువు వద్ద వాహనాలను నిలపడానికి పోలీసుల ప్రయత్నం
►పోలీసుల ఆదేశాలను ధిక్కరించి ట్రాఫిక్‌కు అడ్డు తగులుతోన్న టిడిపి కార్యకర్తలు
►వేమగిరి,రావులపాలెం,పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్,గన్నవరం, విజయవాడ మీదుగా ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు

06:20 PM, అక్టోబర్‌ 31, 2023
బాబు లాయర్ల పిటిషన్‌ కొట్టివేత
►చంద్రబాబు లాయర్ల పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు
►సీఐడీ అధికారుల కాల్‌డేటా స్వాధీనం చేసుకోవాలని పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
►సీఐడీ తరపున వివేకానంద వాదనలు
►చంద్రబాబు తరపున దమ్మాలపాటి వాదనలు
►ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి
►పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

05:49 PM, అక్టోబర్‌ 31, 2023
బెయిల్‌ సరే, నిజం గెలవాలి సంగతేంటీ? : మంత్రి కొట్టు సత్యనారాయణ
►విజయవాడలో మాట్లాడిన డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ పిసి
►చంద్రబాబుకు మధ్యంతర బెయిలు వచ్చింది కాబట్టి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటారా?
►టీడీపీ జాతీయ పార్టీ అని ప్రకటించుకుంది...అలాంటి పార్టీ తెలంగాణాలో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం ఏమిటి?
►తెలంగాణాలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తేలిపోయినట్టేనా?
►సైబర్ సిటినీ తానే నిర్మించానని చెబుతున్న చంద్రబాబు తెలంగాణా ఎన్నికల్లో ఎందుకు చేతులెత్తేసారు?
►ఏపీలోనూ సొంతంగా పోటీ చేసే సత్తా లేక జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జాతీయ పార్టీగా అని ఎలా చెప్పుకుటుంది?
►ఏపీలో జనసేన-టీడీపీ పొత్తు ఎంతవరకూ నిలబడుతుందని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు.!
►మేముంటేనే మీరని జనసేన-టీడీపీ మధ్య క్షేత్రస్థాయిలో కుమ్ములాటలు జరుగుతున్నాయి.!
►చంద్రబాబును జైల్లో పెడితే రోడ్డుపై పడుకుని పవన్ కల్యాణ్ నానా విన్యాసాలు చేశారు

05:42 PM, అక్టోబర్‌ 31, 2023
షరతులు బేఖాతరు
►తూర్పుగోదావరి జిల్లా : మధ్యంతర బైలుకు సంబంధించి హైకోర్టు విధించిన షరతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు
►జైలు బయటికి వచ్చిన వెంటనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు
►నిబంధనలకు విరుద్ధంగా జైలు గేటు వరకు బారికెడ్లను తోసుకొంటూ వచ్చిన టిడిపి కార్యకర్తలు
►ర్యాలీగా రాకూడదని హైకోర్టు అభ్యంతరాలు ఉన్నా పట్టించుకోకుండా జైలు బయట గేటు వద్ద నుండి కార్యకర్తల సమూహంతో రోడ్డుపైకి వచ్చిన చంద్రబాబు
►రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చే రూటును బ్లాక్‌ చేసిన టిడిపి కార్యకర్తలు
 

04:40 PM, అక్టోబర్‌ 31, 2023
బయటకు రాగానే మైక్‌ అందుకున్న బాబు
►హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కేసిన చంద్రబాబు
►రాజకీయ ర్యాలీలు చేయొద్దని స్పష్టంగా చెప్పిన హైకోర్టు
►ర్యాలీల్లో ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు చెప్పినా.. పట్టించుకోని చంద్రబాబు
►తనకు సంఘీభావం తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
►ప్రత్యేకంగా జనసేన పార్టీకి, పవన్‌ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు : చంద్రబాబు

04:30 PM, అక్టోబర్‌ 31, 2023
కాసేపట్లో బెజవాడకు బాబు
►కాసేపట్లో విజయవాడకు బయల్దేరనున్న చంద్రబాబు
►రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వెళ్లనున్న చంద్రబాబు
►రేపు సాయంత్రం తిరుమలకు వెళ్లాలని నిర్ణయం 
►ఎల్లుండి ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్న చంద్రబాబు
►అనంతరం హైదరాబాద్ లో శస్త్ర చికిత్స చేయించుకోవాలని చంద్రబాబు యోచన

04:15 PM, అక్టోబర్‌ 31, 2023
జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు
►రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల
►జైలు గేటు వద్ద తెలుగుదేశం నేతల కేకలు, అరుపులు
►జైలు ముందు చంద్రబాబు కోసం కుటుంబసభ్యులు, టిడిపి నేతలు
►చంద్రబాబును కలిసేందుకు నాయకుల పోటాపోటీ
►టిడిపి జెండాలు, ఫ్లెక్సీలతో జైలు ప్రాంగణాన్ని నింపేసిన టిడిపి నేతలు
►అందరిని పక్కకు జరిపి చంద్రబాబును అలింగనం చేసుకున్న అచ్చెన్నాయుడు

04:13 PM, అక్టోబర్‌ 31, 2023
తెలుగుదేశం నేతల ఓవరాక్షన్‌తో చంద్రబాబుకు మరిన్ని ఆంక్షలు
►రేపటి దాకా చంద్రబాబు ఎలాంటి ర్యాలీలు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు
►ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనద్దని హైకోర్టు ఆదేశాలు
►రేపటి వరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దు : హైకోర్టు ఆదేశాలు

04:03 PM, అక్టోబర్‌ 31, 2023
జైలుకు చంద్రబాబు కాన్వాయ్‌
►రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్న చంద్రబాబు కాన్వాయ్
►జైలు లోపలికి వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్
►కాసేపట్లో విడుదల కానున్న చంద్రబాబు
►సెంట్రల్ జైలు దగ్గర భారీ స్థాయిలో మోహరించిన టీడీపీ శ్రేణులు
►చంద్రబాబును చూసేందుకు భారీగా రావాలని కార్యకర్తలకు టీడీపీ పిలుపు
►పలు చోట్ల వాహనాలను ఏర్పాటు చేసి మరీ జనాలను తెస్తోన్న టీడీపీ

04:00 PM, అక్టోబర్‌ 31, 2023
జైలులో జరుగుతున్న బెయిల్‌ ప్రక్రియ
►రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్
►చంద్రబాబును కలిసిన లోకేష్, బ్రాహ్మణి
►విజయవాడ వరకు ఎలా వెళ్దాం? ఏం చేద్దాం?
►బయటకు తీసుకొచ్చే విషయంపై చర్చలు
►బాబు బెయిల్ కాపీలను తీసుకుని లోనికి వెళ్లిన లాయర్లు
►జైల్లో బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయనున్న లాయర్లు

03:55 PM, అక్టోబర్‌ 31, 2023
జైలు వద్ద భారీగా మోహరించిన తెలుగుదేశం కార్యకర్తలు
► రాజమండ్రి జైలు వద్ద నెలకొన్న పరిస్థితిపై పోలీసులు సీరియస్‌
► రాజకీయాలకు జైలును అడ్డా ఎలా చేస్తారని ఆగ్రహం
► రాజమండ్రి జైలు చుట్టూ భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు
► జాతీయ రహదారి లాలాచెరువు నుంచి సెంట్రల్ జైలు వరకు రహదారిని మూసివేత
► జైలు వద్ద ఏ ఒక్కరు అతి చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం
► శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఊరుకోబోమంటున్న అధికారులు

03:45 PM, అక్టోబర్‌ 31, 2023
టిడిపి తీరే అంత.! తొలి రోజే నిబంధనలు ఉల్లంఘిస్తారా?
► రాజమండ్రి జైలు వద్దకు భారీగా చేరుకుంటున్న తెలుగుదేశం శ్రేణులు
► చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలు
► చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దృష్ట్యా తెలుగుదేశం కొత్త వ్యూహం
► రాజమండ్రికి భారీగా కార్యకర్తలను తరలిస్తోన్న తెలుగుదేశం నేతలు
► ప్రతీ నియోజకవర్గం నుంచి ఇంత మంది అంటూ లెక్కలేసుకొని మరీ తరలింపు
► రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ర్యాలీ చేయాలని ప్రణాళిక
► ఇప్పటికే సోషల్‌ మీడియాలో మొదలైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు
► బెయిల్‌ ఊరేగింపు అడ్డు పెట్టుకుని ఏం చేయబోతున్నారు?

03:15 PM, అక్టోబర్‌ 31, 2023
నిబంధనలను పెంచండి : CID పిటిషన్‌
► ఏపీ హైకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు
మధ్యంతర బెయిల్‌లో మరో 5 నిబంధనలు చేర్చాలని పిటిషన్
1. రాజకీయ యాత్రలు, ప్రసంగాలు, సభలు పెట్టొద్దు,
2. మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు
3. కేవలం వైద్యం కోసమే బెయిల్‌ను ఉపయోగించాలి
4. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రెస్, పబ్లిక్ ముందు మాట్లాడొద్దు
5. ఇద్దరు DSP స్థాయి అధికారులు చంద్రబాబుతో ఉంటూ కదలికలను కోర్టుకు సమర్పించాలి
ఈ ఐదు షరతులు చేర్చాలని కోరుతూ సీఐడీ పిటిషన్

03:10 PM, అక్టోబర్‌ 31, 2023
బాబు జెడ్‌ ప్లస్‌కు ఏర్పాట్లు
► రాజమండ్రి జైలు నుంచి కరకట్ట నివాసం దాకా భద్రత
►రోడ్డు మార్గంలో రాజమండ్రి నుంచి విజయవాడ కరకట్ట నివాసానికి వచ్చేందుకు ఏర్పాట్లు

03:01 PM, అక్టోబర్‌ 31, 2023
మద్యం కేసులోనూ చంద్రబాబుకు ఊరట
►మద్యం కేసులోనూ చంద్రబాబుకు హైకోర్టులో ఊరట
►చంద్రబాబును అరెస్ట్ చేయబోమని తెలిపిన ఏజీ
►హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించబోమని కోర్టుకు తెలిపిన ఏజీ
►అడ్వకేట్ జనరల్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన హైకోర్టు
►విచారణ నవంబర్ 21కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

03:00 PM, అక్టోబర్‌ 31, 2023
జైలుకు చేరిన రిలీజ్‌ ఆర్డర్‌
►రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరిన చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఆర్డర్
►కండిషన్స్ ను చంద్రబాబుకు చదివి వినిపించనున్న జైలు సూపరింటెండెంట్
►కాసేపట్లో జైలు నుంచి బయటకు రానున్న చంద్రబాబు

03:00 PM, అక్టోబర్‌ 31, 2023
రిలీజ్‌ ఆర్డర్‌ తీసుకున్న TDP నేతలు
►విజయవాడ : ACB కోర్టు దగ్గర బోండా ఉమ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
►చంద్రబాబు మధ్యంతర బెయిల్ విషయంలో ఏసీబీ కోర్టుకు ష్యూర్టీలు సమర్పించాం
►వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చాం
►చంద్రబాబు రిలీజ్ ఆర్డర్లను జైలు అధికారులకు కోర్టు మెయిల్ చేశారు
►పర్సనల్ ఆర్డర్ కూడా మేం తీసుకున్నాం
►రాజమండ్రి జైలు అధికారులకు మెయిల్ ద్వారా హైకోర్టు బెయిల్ ఆర్డర్, ఏసీబీ కోర్టు రిలీజ్ ఆర్డర్ అందాయి
►సుప్రీం కోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం రావాల్సి ఉంది
►మరో గంటన్నరలో చంద్రబాబు జైలు నుంచి బయటకు రావొచ్చు

02:50 PM, అక్టోబర్‌ 31, 2023

రిలీజ్‌ ఆర్డర్‌ ఇది
►చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ACB కోర్టు రిలీజ్‌ ఆర్డర్‌
►CrPL No.7951/2023 ప్రకారం చంద్రబాబును విడుదల చేయాలని ఉత్తర్వులు
►ప్రస్తుతం రిమాండ్‌ ముద్దాయి నెంబర్‌ 7691గా ఉన్న చంద్రబాబు

02:30 PM, అక్టోబర్‌ 31, 2023
మద్యం కేసులోనూ బెయిలివ్వండి : చంద్రబాబు లాయర్లు
►హైకోర్టులో చంద్రబాబు లాయర్ల లంచ్ మోషన్ పిటిషన్
►మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్
►చంద్రబాబు పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ
►మద్యం కేసులో చంద్రబాబు ఏ3

02:30 PM, అక్టోబర్‌ 31, 2023
చంద్రబాబుకు వచ్చింది కండీషనల్‌ బెయిలే : సజ్జల
►కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు చంద్రబాబుకు కోర్ట్ బెయిల్ ఇచ్చింది
►టీడీపీ ఎందుకు సంబరాలు చేసుకుంటుందో అర్థం కావడం లేదు
►స్కిల్ కేసులో షెల్ కంపెనీలకు దారి మళ్లాయా? లేదా?
►వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తే చంద్రబాబు బయటకు వస్తారా?
►చంద్రబాబు నిర్దోషి అయితే ఆధారాలు బయటపెట్టాలి
►స్కిల్ కేసులో రూ.240 కోట్లు దారి మళ్లాయి
►రాజమండ్రి నుంచి రోడ్ షో చేస్తామంటున్నారు
►రోడ్ షోతో జనానికి ఏం చెప్పాలనుకుంటున్నారు?
►లయన్ ఈజ్ బ్యాక్ అని టీడీపీ గొప్పగా చెప్పుకుంటోంది
►చంద్రబాబు ఏమైనా వీర యోధుడా?
►చంద్రబాబు ఇంతకాలం వ్యవస్థల్ని మ్యానేజ్ చేశారు
►చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా పెద్ద తేడా ఉండదు
►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదంటే విజయయాత్ర ఎందుకు?
►చంద్రబాబు విషయంలో ప్రభుత్వానికి కక్షసాధింపు లేదు
►చంద్రబాబు బయట ఉంటేనే పొలిటికల్ ఫైట్ నడుస్తుంది
►నిజం గెలిచిందని ఉపన్యాసాలు చేస్తుంటే జనం ఏమనుకుంటారు?

01:43 PM, అక్టోబర్‌ 31, 2023
బెయిల్‌ ప్రాసెస్‌ ఎక్కడివరకు వచ్చిందంటే.?
►విజయవాడ : ఎసిబి కోర్టులో హైకోర్టు ఇచ్చిన చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఆర్డర్ కాపీని అందజేసిన చంద్రబాబు న్యాయవాదులు
►ACB కోర్టుకు ష్యూరిటీలు సమర్పించిన టిడిపి నేతలు దేవినేని ఉమ, బోండా ఉమ
►చెరో రూ. లక్ష పూచీకత్తు సమర్పించిన టీడీపీ నేతలు
►మధ్యంతర బెయిల్ ఆర్డరుతో పాటు అఫిడవిట్లని ఏసీబీ కోర్టుకు సమర్పించిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
►తదుపరి ఆదేశాలను రాజమండ్రి జైలు అధికారులకు మెయిల్ ద్వారా పంపుతామన్న ఏసీబీ కోర్టు
►ప్రొసీజర్‌ అంతా పూర్తయితే ఈ సాయంత్రానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం

01:35 PM, అక్టోబర్‌ 31, 2023
బెయిల్‌ వచ్చినా ఆగని ములాఖత్‌లు
►రాజమండ్రి జైల్లో మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబుతో నారా లోకేశ్ ములాఖత్
►లోకేశ్‌తో పాటు చంద్రబాబును కలవనున్న బ్రాహ్మణి
►జైల్లో చంద్రబాబును కలవనున్నతెలుగుదేశం ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి

01:25 PM, అక్టోబర్‌ 31, 2023
బెయిల్‌ షరతులతో మాత్రమే : వెల్లంపల్లి
►కోర్టు చంద్రబాబుకు మద్యంతర బెయిల్ ఇచ్చింది రోగాలు ఉన్నందునే
►ప్రపంచంలో ఉన్న రోగాలన్ని చంద్రబాబుకు ఉన్నట్టు చూపించి బెయిల్ తెచ్చుకున్నారు
►చంద్రబాబుకు ఇచ్చింది కండీషన్డ్ బెయిల్ మాత్రమే..
►తిరిగి చంద్రబాబు మరలా జైలుకు వెళ్లాల్సిందే
►చంద్రబాబు నేరం చేయలేదని వాళ్ల న్యాయవాదులు ఎక్కడా చెప్పలేదు
►అనారోగ్య కారణాలతో చంద్రబాబు కు మద్యంతర బెయిల్ వచ్చింది

చంద్రబాబు రాజకీయాలకు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు 
►కాసాని జ్ఞానేశ్వర్ ను ఎన్ని కల్లో పోటీ చేయిస్తామని చెప్పి మోసం చేసారు
►కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందంతో పోటీ చేయడం లేదని జెండా పీకేశారు
►బిసిలను మరోసారి చంద్రబాబు మోసం చేశాడు
►తెలంగాణాలో పోటీచేసే అవకాశం లేకుండా జెండా పీకేసిన వ్యక్తి చంద్రబాబు
►2024 లో ఏపిలోనూ టిడిపి జెండా పీకేస్తారు
►పవన్ టీడీపీతో కలిసినా ప్రయోజనం లేదు

తండ్రి జైలులో ఉంటే నారా లోకేష్ ఎక్కడ ఉన్నట్టు
►విజయనగరం భువనేశ్వరి కాకుండా లోకేష్ వెళ్లచ్చుకదా.. ఎందుకు వెళ్ళలేదు..?
►లోకేష్ అసమర్ధుడని వాళ్ళ క్యాడర్ భావిస్తుంది
►ఎన్డీఆర్ చావుకు కారణమవ్వడమే కాకుండా నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు

పురందేశ్వరికి చంద్రబాబు అవినీతిలో భాగస్వామ్యం ఉంది
►బిజెపి అధ్యక్షురాలిగా టిడిపి కి స్పోక్ పర్సన్ పురందేశ్వరి కొనసాగుతున్నారు
►అమిత్ షా వద్దకు లోకేష్ ను  పురందేశ్వరి తీసుకెళ్లలేదా
►చంద్రబాబు ను కాపాడడానికి పురందేశ్వరి కంకణం కట్టుకున్నారు
►చంద్రబాబును జైలు నుంచి తేవాలన్నదే పురందేశ్వరి లక్ష్యం

01:15 PM, అక్టోబర్‌ 31, 2023
నిజం గెలవాలి యాత్ర అబద్ధమేనా?
►చంద్రబాబు విడుదలతో మారిన తెలుగుదేశం వ్యూహం
►నిజం గెలవాలి యాత్రను నిలిపివేసే యోచనలో భువనేశ్వరీ
►చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉంది: నారా భువనేశ్వరి
►నిజం గెలవాలి యాత్ర పై ఇంకా ఆలోచించలేదు : నారా భువనేశ్వరి

01:05 PM, అక్టోబర్‌ 31, 2023
చంద్రబాబు బెయిల్‌ అనగానే పవన్‌ కళ్యాణ్‌లో తెగ ఉత్సాహం
►యూరప్‌ నుంచే ప్రెస్‌ నోట్‌ విడుదల చేసిన పవన్‌ కళ్యాణ్‌
►చంద్రబాబు విడుదల కోసం ఎదురుచూస్తున్నామన్న పవన్‌

12:55 PM, అక్టోబర్‌ 31, 2023
విడుదల ఎప్పుడంటే..!
►ACB కోర్టు ద్వారా జైలుకు అందనున్న హైకోర్టు ఉత్తర్వులు
►జైలు అధికారులకు కోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత ప్రారంభం కానున్న ప్రొసీడింగ్స్‌
►చంద్రబాబు NSG సెక్యూరిటీ పరిధిలో ఉండడంతో SPకి సమాచారం ఇవ్వనున్న జైలు అధికారులు

12:45 PM, అక్టోబర్‌ 31, 2023
నవంబర్‌ 28న మళ్లీ జైలుకు
►చంద్రబాబు బెయిల్‌ గడువు నవంబర్‌ 28 వరకు
►నవంబర్‌ 28న రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో సాయంత్రం 5గంటల్లోగా సరెండర్‌ కావాలి


12:40 PM, అక్టోబర్‌ 31, 2023
ష్యూరిటీలు సమర్పించిన బొండా, దేవినేని
►చంద్రబాబు బెయిల్ కోసం బొండా, దేవినేని ష్యూరిటీలు
విజయవాడ కోర్టులో షూరిటీ సమర్పించిన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరావు

12:32 PM, అక్టోబర్‌ 31, 2023
జైలు నుంచి చంద్రబాబు ఎక్కడికంటే.?
► సాయంత్రం రాజమండ్రి నుంచి అమరావతికి చంద్రబాబు
► రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన అమరావతికి చంద్రబాబు
► అమరావతి నుంచి రేపు లేదా ఎల్లుండి తిరుమలకు చంద్రబాబు
► తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత హైదరబాద్ కు చంద్రబాబు
► ఆ తర్వాత హైదరాబాద్‌ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స
► హైదరాబాద్‌లోనే స్కిన్‌ డాక్టర్‌తో ట్రీట్‌మెంట్‌

12:28 PM, అక్టోబర్‌ 31, 2023
బెయిల్‌ ఇచ్చింది ఎందుకంటే.. : మంత్రి అంబటి
►చంద్రబాబు బెయిల్ పై అంబటి రాంబాబు స్పందన
►కేసులో నిర్దోషి అని చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేదు
►స్కిల్ స్కాంలో చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇచ్చారు
►కంటి ఆపరేషన్ చేయించుకొన్న తర్వాత జైలుకు రావాల్సిందే
►కేసు దర్యాప్తు కొనసాగుతోంది
►రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదు
►తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారు
►ఇతర పార్టీ కోసం పార్టీని తాకట్టుపెట్టడం అనైతికం
►కాసాని జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయ్యింది
►చంద్రబాబును నమ్ముకున్న ఎవరికైనా వెన్నుపోటు తప్పదు


12:20 PM, అక్టోబర్‌ 31, 2023
మద్యం కేసులో బెయిల్‌ పిటిషన్‌
►ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్
►మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్
►మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులు ఇచ్చారన్న సీఐడీ అధికారుల కేసు పై హౌస్ మోషన్ పిటిషన్
►పిటిషన్ విచారణకు అనుమతిచ్చిన ఏపీ హైకోర్టు

12:15 PM, అక్టోబర్‌ 31, 2023
తొలిరోజే షరతుల ఉల్లంఘనకు ప్రణాళిక
►రాజమండ్రి చేరుకున్న లోకేశ్‌, బ్రాహ్మణి
►కాసేపట్లో చంద్రబాబుతో ములాఖత్
►బెయిల్ రావడంతో సాయంత్రం 4గంటలకు జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం
►ఎయిర్ పోర్టు వరకు భారీ ర్యాలీకి టీడీపీ ఏర్పాట్లు
►హైకోర్టు సూచించినా.. దానికి విరుద్ధంగా ర్యాలీకి ఏర్పాట్లు చేస్తోన్న టిడిపి

12:10 PM, అక్టోబర్‌ 31, 2023
చంద్రబాబుకు బెయిల్‌ కేవలం అనారోగ్య కారణాల వల్లే
►కేవలం చంద్రబాబు అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు
►నవంబర్ 28, 2023 మంగళవారం రోజున సా.5 గంటలకు సరెండర్ కావాలని ఆదేశం
►నవంబర్ 10న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వింటామన్న కోర్టు
►ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనరాదన్న కోర్టు
►మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదన్న కోర్టు

12:05 PM, అక్టోబర్‌ 31, 2023
చంద్రబాబుకు బెయిల్‌లో షరతులు ఇవే
►చంద్రబాబుకు ఐదు షరతులతో మధ్యంతర బెయిల్
1. రూ.లక్ష పూచీకత్తుతో పాటు ఇద్దరి షూరిటీలు సమర్పించాలి
2. నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో చికిత్స చేయించుకోవచ్చు
3. చికిత్స, ఆస్పత్రి వివరాలు సరెండర్ సమయంలో సీల్డ్ కవర్ లో జైలు సూపరింటెండెంట్ కు సమర్పించాలి
4. ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసును ప్రభావితం చేసే చర్యలు చేపట్టకూడదు
5. నవంబర్ 28, 2023 సాయంత్రం 5 గంటల్లోపు తిరిగి సరెండర్ కావాలి

12:05 PM, అక్టోబర్‌ 31, 2023
చంద్రబాబుకు బెయిల్‌కు ష్యూరిటీలు వీళ్లే
►హైకోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు ఇవ్వనున్న ఇద్దరు
►రూ.లక్ష బాండ్, 2 ష్యూరిటీలను ఇవ్వనున్న బోండా ఉమ, దేవినేని ఉమ
►విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న బోండా ఉమ, దేవినేని ఉమ

12:00 PM, అక్టోబర్‌ 31, 2023
చంద్రబాబుకు బెయిల్‌
►ఐదు షరతులతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
►సాయంత్రం చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం
►హైకోర్టు ఉత్తర్వులు ఏసీబీ కోర్టు ద్వారా రాజమండ్రి జైలుకు
►బెయిల్ కాపీతో రాజమండ్రి జైలుకు రానున్న చంద్రబాబు లాయర్లు
►ప్రొసీడింగ్స్ పూర్తైన తర్వాత ఎస్పీకి సమాచారమివ్వనున్న జైలు అధికారులు
►జైలు దగ్గరికి రానున్న జిల్లా పోలీసులతోపాటు NSG బృందం
►ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు

11:45 AM, అక్టోబర్‌ 31, 2023
చంద్రబాబుకు బెయిల్‌పై పురందేశ్వరీ స్పందన
►చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నాం
►చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం మంచి పరిణామం : పురంధేశ్వరి

11:38 AM, అక్టోబర్‌ 31, 2023
ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్‌
►మద్యం కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చారని.. సీఐడీ అధికారుల కేసుపై లంచ్‌ మోషన్‌ పిటిషన్‌
►సీఐడీ నమోదు చేసిన కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌
►లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ విచారణకు అనుమతిచ్చిన హైకోర్టు
►మధ్యాహ్నాం 2గం.15కి పిటిషన్‌ను విచారించనున్న హైకోర్టు
►టీడీపీ అడ్డగోలు మద్యం వ్యవహారాలపై కేసు 
►తన హయాంలో కావాల్సిన కంపెనీలకు దోచిపెట్టిన చంద్రబాబు 
►కావాల్సిన డిస్టిలరీలకు అడ్డగోలు అనుమతులు 
►క్విడ్‌ప్రోకోలో భాగంగా ఎక్సైజ్‌ పాలసీనే మార్చేసిన నాటి ప్రభుత్వం 
►రెండు బేవరేజ్‌లు, మూడు డిస్టలరీలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు 
►ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం 
►ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌.. అనుమతించిన న్యాయస్థానం 
►ఏ–1గా ఐఎస్‌ నరేష్, ఏ–2గా కొల్లు రవీంద్ర, ఏ–3గా చంద్రబాబు  

11:12 AM, అక్టోబర్‌ 31, 2023
స్కిల్డ్‌ దొంగ చంద్రబాబే!
►టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకో­ణం కేసు 
►డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి 
►2017-2018లో నకిలీ ఇన్‌వాయిస్‌లతో బయటపడ్డ అక్రమం
►అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం 
►ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు­నాయుడే ప్రధా­న సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు 
►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ
►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్‌ కూడా
►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు
►చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ ఘరానా మోసం 
►రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం
►ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం 
►రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం
►ప్ర‌భుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారని సీఐడీ అభియోగం
►ఎలైట్‌ కంప్యూటర్స్‌, స్కిల్లర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, నాలెడ్జ్‌ పోడియం, ఈటీఏ- గ్రీన్స్‌, కేడన్స్‌ పార్టనర్‌ తదితర షెల్‌ కంపెనీలకు నిధుల మళ్లింపు
►ఈ కుంభ‌కోణం 2016- 2018 మధ్య జ‌రిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు
►ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు
►చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు
సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
►రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా 7691 నెంబర్‌తో కొనసాగుతున్న చంద్రబాబు
►తాజాగా.. ఇవాళ నాలుగువారాలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

11:12 AM, అక్టోబర్‌ 31, 2023
బాబు బెయిల్‌పై అంబటి సెటైర్‌
►స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌
►కంటి శస్త్రచికిత్స కోసం బెయిల్‌ ఇచ్చిన ఏపీ హైకోర్టు
►షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు అవుతుందని కోర్టు హెచ్చరిక
►నిజం గెలిచి కాదు.. చంద్రబాబుకి కళ్లు కనిపించట్లేదని కోర్టు బెయిల్‌ ఇచ్చిందన్న అంబటి
►ఎక్స్‌లో బాబు బెయిల్‌పై అంబటి సెటైర్‌  

11:01 AM, అక్టోబర్‌ 31, 2023
నవంబర్‌ 10న చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌
►నవంబర్‌ 10వ తేదీన వాదనలు వింటామన్న ఏపీ హైకోర్టు
►మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై కాసేపటి కిందట తీర్పు
►నాలుగు వారాల బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
►ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ ఇస్తున్నట్లు తీర్పు
►కంటి సర్జరీ కోసమే బెయిల్‌ ఇచ్చినట్లు వెల్లడి
►చంద్రబాబుకు కోర్టు పలు షరతులు
►రాజకీయ, మీడియా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు
►కేవలం ఆస్పత్రికి మాత్రమే వెళ్లాలి
►నవంబర్‌ 24వ తేదీ సాయంత్రం సరెండర్‌ కావాలి
►కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు
►షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు అవుతుందని హెచ్చరిక

10:39 AM, అక్టోబర్‌ 31, 2023
చంద్రబాబుకి మధ్యంతర బెయిల్‌ మంజూరు

►స్కిల్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు
►నాలుగు వారాల పాటు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
►రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీల్ని సమర్పించాలని ఆదేశం
►నవంబర్‌ 24 వరకు షరతులతో కూడిన బెయిల్‌
►కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తీర్పు
►షరతులు ఉల్లంఘిస్తే మరుక్షణమే బెయిల్‌ రద్దవుతుందని హెచ్చరిక

10:15 AM, అక్టోబర్‌ 31, 2023
కాసేపట్లో మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు

►స్కిల్‌ స్కామ్‌లో మధ్యంతర బెయిల్‌ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌
►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు
►కంటికి శస్త్రచికిత్స అవసరం అంటూ పిటిషన్‌ వేసిన బాబు లాయర్లు
►ఇప్పటికిప్పుడు శస్త్రచికిత్స అవసరం లేదని సీఐడీ తరపు లాయర్ల వాదన
►ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిల్‌ ఇవ్వాలన్న బాబు లాయర్లు
►చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్యులు ఇచ్చిన నివేదికలు కోర్టుకు సమర్పించిన సీఐడీ
►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని, పైగా బరువు పెరిగారని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సీఐడీ లాయర్లు

09:52 AM, అక్టోబర్‌ 31, 2023
సీడీఆర్‌ పిటిషన్‌ తీర్పు నేడు
►సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు కేస్ అప్ డేట్
►సీఐడీ అధికారుల కాల్ డేటా పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
►అరెస్ట్‌ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డ్ ను భద్రపరచాలంటూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్‌ 
►అరెస్ట్‌ వెనుక కుట్ర కోణం ఉందంటూ బాబు లాయర్ల వాదన
►ఇతర వ్యక్తుల డైరెక్షన్‌లోనే సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారని వాదన
►కాల్ డేటా పిటిషన్ అసలు విచారణ అర్హత లేదని వాదించిన సీఐడీ తరపు న్యాయవాదులు
►అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు, భద్రతకు భంగం కలుగుతుందన్న సీఐడీ లాయర్లు
►అరెస్ట్‌లో ఎవరి ప్రమేయం లేదని సీఐడీ లాయర్ల వాదన
►వాదనలు పూర్తి.. నేడు తీర్పు వెల్లడించనున్న ఏసీబీ జడ్జి

09:22 AM, అక్టోబర్‌ 31, 2023
ఇంటి భోజనంతో బరువు పెరిగిన చంద్రబాబు
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52వ రోజు రిమాండ్ ఖైదీగా  కొనసాగుతున్న చంద్రబాబు
►బాబు ఆరోగ్యంపై ప్రతిరోజూ హెల్త్ బులెటిన్ విడుదల
►మరోవైపు చంద్రబాబు ఆరోగ్యాన్ని సాకుగా చూపించి మధ్యంతర బెయిల్  కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు న్యాయవాదులు
►హైకోర్టులో  చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ వెలువడనున్న తీర్పు
►చంద్రబాబుకు రోజూ ఇంటి భోజనం
►జైల్లో చంద్రబాబు బరువు పెరిగారని స్పష్టం చేసిన అధికారులు
►జైలుకు వచ్చినప్పుడు 66 కిలోలు ఉన్న చంద్రబాబు ప్రస్తుతం 67.5 కిలోలు ఉన్నారని వెల్లడి
►చంద్రబాబు కుడి కంటి క్యాటరాక్ట్ సర్జరీ అత్యవసరంగా చేయాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
►ప్రస్తుతం ఇమ్మెచ్యూర్డ్ కాటరాక్ట్ ఉందని జీజీహెచ్‌ వైద్యులు ఇచ్చిన రిపోర్టును సమర్పించిన జైలు అధికారులు

08:45 AM, అక్టోబర్‌ 31, 2023
లోకేష్‌ బేబీని వదలని ఆర్జీవీ

►చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీ అం‍డ్‌ కోను విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తున్న దర్శకుడు రాం గోపాల్‌ వర్మ
►తాజాగా నారా లోకేష్‌ను బేబీ అంటూ టీజింగ్‌
►సీఎం జగన్‌పై నారా లోకేష్‌ ఎక్స్‌లో అడ్డగోలు వ్యాఖ్యలు
► గుడ్‌ నైట్‌ బేబీ అంటూ సింపుల్‌గా లోకేష్‌కు రిప్లై ఇచ్చిన ఆర్జీవీ
 

08:32 AM, అక్టోబర్‌ 31, 2023
నారా వారి లిక్కరు స్కామ్‌
►చంద్రబాబుపై లిక్కర్‌ స్కామ్‌ కేసు నమోదు చేసిన సీఐడీ
►గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపనల నేపథ్యంలో కేసు నమోదు
►ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు
►ఐపీసీ సెక్షన్ 166,167,409,120(B), రెడ్ విత్ 34 మరియు సెక్షన్ 13(1)(d) రెడ్ విత్ 13(2) పిసి యాక్ట్, 1968 గా కేసు నమోదు
►కేసులో A-3 గా చంద్రబాబును చేర్చిన సీఐడీ అధికారులు
►చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు మెమో రూపంలో తెలిపిన సీఐడీ అధికారులు
►మద్యం షాపులు, మద్యం కంపెనీల కు అక్రమ దారుల్లో లబ్ది చేకూర్చిన చంద్రబాబు ప్రభుత్వం
►మద్యం షాపులు (a4) ప్రివిలైజ్ ఫీజు తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం
►ప్రతి ఏటా రూ.1,300 కోట్లు ప్రభుత్వానికి నష్టం
►2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి దాదాపు రూ.2900 కోట్ల ఆదాయం
►తెలంగాణలో ఉన్న ప్రివిలైజ్ ఫీజు.. ఏపీలో తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం
►అప్పట్లో లిక్కర్ సిండికేట్ తో కుమ్మక్కై తగ్గించేసిన చంద్రబాబు ప్రభుత్వం
►టీడీపీ ఎంపీ ఎస్పీ వై రెడ్డి సంస్థ  ఎస్పీ వై ఆగ్రో ఇండస్ట్రీకి లబ్ది చేకూరుస్తూ వడ్డీ తగ్గింపు
►హైకోర్టు ఆదేశాలని అమలు చేయకుండా ఏకపక్షంగా వడ్డీ తగ్గింపు
►కేబినెట్ ఆమోదం లేకుండానే వడ్డీ తగ్గించిన చంద్రబాబు ప్రభుత్వం
►ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత హడావిడిగా లిక్కర్ కంపెనీలకు భారీగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
►టీడీపీ నేతల లిక్కర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
►త్రిసభ్య కమిటీ సిఫార్సులు కి విరుద్ధంగా లిక్కర్ కంపెనీలకు అనుమతులు
►మాజీ మంత్రి యనమల రామ కృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు చెందిన పీఎంకే డిస్టీలరీస్‌కి అనుమతి
►మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టీలరీస్‌కి అనుమతి
►అవసరానికి మించి లిక్కర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
►2019 ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కొన్ని బ్రాండ్ల కు హడావుడిగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
►సరఫరా కంపెనీలకు భారీ లబ్ది చేకూర్చేందుకు అనుమతులు
►అన్ని వ్యవహరల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించిన సీఐడీ
►బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన సీఐడీ
►ఈ కేసులో ఏ-1గా అప్పటి ఎక్సైజ్ కమీషనర్ శ్రీనివాస నరేష్, ఏ-2గా మాజీమంత్రి కొల్లు రవీంద్ర,  ఏ-3గా చంద్రబాబు నాయుడు
►రెండు బేవరేజ్ లు, మూడు డిస్టిలరీలకి లబ్ది చేకూర్చడానికి క్విడ్ ప్రోకి పాల్పడినట్లు ఆరోపణలు
►2012 లో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీని 2015 లో మార్చి అడ్డుకోలుగా ఈ కంపెనీలకి మేలు చేసి‌నట్లు ఆధారాలు
 

07:57 AM, అక్టోబర్‌ 31, 2023
స్కిల్‌ స్కాంలో బాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌..  తీర్పు రిజర్వ్‌

► ఏపీ హైకోర్టులో టీడీపీ నేతల పిటిషన్ పై విచారణ వాయిదా
► విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
► గత ప్రభుత్వ నిర్ణయాల పునఃసమీక్షకు ప్రభుత్వం వేసిన సిట్, కేబినెట్ సబ్ కమిటీని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్
► 1411 జీవో, 344 జీవోను సవాల్ చేస్తూ పిటిషన్లు
► ఈ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌తో పాటు అనుబంధ పిటిషన్‌ వేసిన బాబు లాయర్లు
►కంటికి శస్త్రచికిత్స అవసరమని, మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి
► వాదనలు పూర్తి, ఇవాళ తీర్పు

07:35 AM,  అక్టోబర్‌ 31, 2023
పవన్ ఎప్పుడు పరిపక్వమవుతాడో?
►టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా
►కాసాని జ్ఞానేశ్వర్ కి జ్ఞానోదయం అయింది
►మరి జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌ ఎప్పుడు పరిపక్వమవుతాడో?
►ట్వీట్‌తో పవన్‌కు చురకలంటిన మంత్రి అంబటి రాంబాబు
►టీటీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా
►తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చంద్రబాబు ఆదేశం
►నారా లోకేష్‌ కనీసం స్పందించలేదని రాజీనామా లేఖలో కాసాని విమర్శలు

07:13 AM,  అక్టోబర్‌ 31, 2023
చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ
►పదుల కొద్దీ పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు
►వరుసగా ఎదురు దెబ్బలు.. ఎక్కడా దక్కని ఊరట
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్ట్‌
►ఆపై ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు, ఫైబర్‌ నెట్‌ కేసు
►తాజాగా వెలుగులోకి మరో అవినీతి బాగోతం 
►కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ
►మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చినందుకు చంద్రబాబుపై మరో కేసు నమోదు
►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు
►చంద్రబాబుకు లేని రోగాలను అంటగడుతూ సానుభూతి కోసం ప్రయత్నాలు
►తెలంగాణ బరి నుంచి ఓటమి భయంతో తప్పుకున్న తెలుగుదేశం

ఇదీ చదవండి: IRR Case.. తోడు దొంగల రింగ్‌

06:59 AM,  అక్టోబర్‌ 31, 2023
ఖేల్‌ ఖతం.. దుకాణం బంద్‌
►తెలంగాణలో టీడీపీ బిగ్‌ షాక్‌ 
►టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా
►నారావారి తీరుపై రాజీనామా లేఖలో తీవ్ర అసంతృప్తి వెల్లగక్కిన కాసాని 
►తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పకపోతే ఎలా?: కాసాని
►బాలకృష్ణ తెలంగాణలో నేనుంటా అన్నడు.. ఇప్పుడు ఏమైందో తెలియదు
►లోకేశ్‌ చిన్న పిల్లవాడో, పెద్దవాడో అర్థంకాదు.. 20సార్లు ఫోన్‌ చేసినా ఎత్తలేదు
►లోకేష్ ఎవరికి దొరకరు
►హైదరాబాద్ లోనే ఉన్నా లోకేష్ పట్టించుకోలేదు
►లోకేష్ ఇక్కడ పెత్తనం ఎందుకు చేస్తున్నారు
►తెలంగాలో పోటీ చేయవద్దని లోకేష్‌ ఎలా చెబుతారు ?
►ఆంధ్రాలో టీడీపీకి బీజేపీ కావాలట.. తెలంగాణలో వద్దట.. ఇదేం పద్ధతి..
►పార్టీలో చేరినప్పుడు రామ్మోహన్‌రావుకు రూ.11 లక్షలు ఇచ్చా.. 
►కాంగ్రెస్‌కు ఓటేయాలని పార్టీలోని కమ్మ వాళ్లు ప్రచారం చేస్తున్నారు 


 

06:43 AM,  అక్టోబర్‌ 31, 2023
మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై నేడు తీర్పు

►స్కిల్‌ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌
►మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌కు అనుబంధ పిటిషన్‌ వేసిన బాబు లాయర్లు
►చంద్రబాబు కంటి శస్త్రచికిత్స కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలంటూ పిటిషన్‌
►పిటిషన్‌పై సోమవారం కొనసాగిన విచారణ.. ఇరువైపులా వాదనలు వినిపించిన లాయర్లు  
►రాజకీయ ప్రతీకారంతోనే చంద్రబాబుపై తప్పుడు కేసు అని బాబు తరపు లాయర్ల వాదన
►52 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు.. సీఐడీ దర్యాప్తును సాగదీస్తోంది: బాబు లాయర్లు
►అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలి: బాబు లాయర్లు
►న్యాయస్థానం ఇచ్చిన గత ఆదేశాల మేరకు చంద్రబాబు వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాం: సీఐడీ తరపు లాయర్లు
►పిటిషనర్‌కు జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం:సీఐడీ తరపు లాయర్లు
►కంటికి శస్త్రచికిత్స తక్షణం అక్కర్లేదు: సీఐడీ తరపు లాయర్లు
►చంద్రబాబుకున్న సాధారణ అనారోగ్య సమస్యలను పెద్దవి చేసి చూపుతున్నారు: సీఐడీ తరపు లాయర్లు 
►వైద్య నివేదిక ప్రకారం బరువు విషయంలో పెద్ద తేడా లేదు: సీఐడీ తరపు లాయర్లు 
►మధ్యంతర బెయిలు ఇవ్వొద్దు: సీఐడీ తరపు లాయర్లు
►పిటిషన్‌పై సోమవారం ముగిసిన వాదనలు 
►తీర్పు రిజర్వ్‌.. నేడు వెల్లడించనున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు 

06:24 AM,  అక్టోబర్‌ 31, 2023
చంద్రబాబుపై సీఐడీ మరో కేసు
►వెలుగులోకి నారావారి లిక్కర్‌ స్కామ్‌
►చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ 
► గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన సీఐడీ
► అవినీతి నిరోధక చట్టం కింద ( ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్)  చంద్రబాబుపై కేసు
► మద్యం కంపెనీలకు అక్రమ అనుమతుల కేసులో A-3 గా చంద్రబాబు
► చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానానికి తెలిపిన సీఐడీ అధికారులు
► ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు
► పిటిషన్ ను అనుమతించిన ఏసీబీ కోర్టు
► కేసుకు FIR నంబర్ - 18/2023 కేటాయింపు

06:15 AM,  అక్టోబర్‌ 31, 2023
జైల్లో చంద్రబాబు @52వ రోజు

► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌
►సెప్టెంబర్‌ 9వ తేదీన ఉదయం నంద్యాలలో అరెస్ట్‌ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.371 కోట్లు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని అభియోగం 
►ఆధారాలతో అరెస్ట్‌ చేసిన ఏపీ సీఐడీ 
►అరెస్ట్‌ సమయం నుంచి మొదలైన డ్రామా
►రిమాండ్‌ విధించిన విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ఏసీబీ కోర్టు)  
►ఇప్పటిదాకా ఐదుసార్లు జ్యూడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
► రేపటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్‌
►రాజమండ్రి సెంట్రల్ జైలు 52వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది..  ఇంటి భోజనం.. టవర్‌ ఏసీ సదుపాయం
►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు
►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు

ఇదీ చదవండి: ఫైబర్‌ నెట్‌ కుంభకోణం సూత్రధారి బాబే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement