రూ.49లక్షలతో పట్టుబడిన ఆ ఎమ్మెల్యేలకు మధ్యంతర బెయిల్‌! | Calcutta High Court Granted Interim Bail To 3 Jharkhand MLAs | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌ ఎమ్మెల్యేలకు మధ్యంతర బెయిల్‌

Published Thu, Aug 18 2022 6:59 AM | Last Updated on Thu, Aug 18 2022 6:59 AM

Calcutta High Court Granted Interim Bail To 3 Jharkhand MLAs - Sakshi

రూ.49 లక్షల నగదుతో పట్టుబడిన ముగ్గురు జార్ఖండ్‌ ఎమ్మెల్యేలకు కలకత్తా హైకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో రూ.49 లక్షల నగదుతో పట్టుబడిన ముగ్గురు జార్ఖండ్‌ ఎమ్మెల్యేలకు కలకత్తా హైకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చాప్, నామన్‌ బిక్సల్‌ కొంగరీ జూలై 30న అరెస్టయిన సంగతి తెలిసిందే. వారు ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేయగా, రూ.49 లక్షల నగదు లభ్యమయ్యింది.

ఈ వ్యవహారంపై బెంగాల్‌ సీఐడీ బృందం దర్యాప్తు చేస్తోంది. నిందితులకు మూడు నెలలపాటు మధ్యంతర బెయిల్‌ ఇస్తూ డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కోల్‌కతా మున్సిపల్‌ ఏరియాను దాటి వెళ్లొద్దని ఆదేశించింది. పాస్‌పోర్టులను అధికారులకు అప్పగించాలని, ప్రతీవారం విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

ఇదీ చదవండి: మూడొంతుల మందిపై క్రిమినల్‌ కేసులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement