
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు ఊరట లభించింది. ల్యాండ్ స్కామ్ కేసులో సోరేన్‌కు బెయిల్ మంజూరైంది. సోరేన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో, ఆయన జైలు నుంచి బయటకు అవకాశం ఉంది.
ఇక, ఐదు నెలల తర్వాత జైలు నుంచి హేమంత్ సోరేన్ విడుదల కానున్నారు. అయితే, ఆయనపై పెండింగ్ కేసులు ఏవీ లేకపోవడంతో నేడు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ల్యాండ్ స్కామ్‌లో ఈడీ.. హేమంత్ సోరేన్‌ను జనవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జైలుకు వెళ్లిన అనంతరం, సోరేన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.