ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. తన భార్య అనారోగ్యం కారణంగా ఆరు వారాలు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ సిసోడియాకు చుక్కెదురైంది. తన భార్యను చూసుకునేందుకు తానొక్కడినే ఉన్నానని, అందువలన మధ్యంతర ప్రాతిపదికన బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ కోసం ఆశగా ఎదురుచూసిన ఆయనకు మరోసారి నిరాశే మిగిలింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన సిసోడియా.. మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే, భార్యను చూసేందుకు సిసోడియాకు అనుమతించింది. ఏదైనా ఒకరోజు తన నివాసం వద్ద కానీ, ఆసుపత్రిలోనైనా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో భార్యను కలిసేందుకు ఆమోదం తెలిపింది.
భార్యను కలిసేందుకు సిసోడియాకు కోర్టు శనివారం అనుమతిచ్చినప్పటికీ, సిసోడియా నివాసానికి వెళ్లేసరికి అప్పటికే ఆయన భార్య ఆసుపత్రిలో చేరారు. దాంతో సిసోడియా తన భార్యను కలవలేకపోయారు. ఈ నేపథ్యంలో, భార్య కలిసేందుకు సిసోడియాకు కోర్టు మరో అవకాశం ఇచ్చింది.
మనీష్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, ఇటీవల సిసోడియా భార్య అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్యను చూడడానికి గత శుక్రవారం జైలు నుంచి బయటకు రావడానికి హైకోర్టు అనుమతించింది. అయితే.. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా మార్చి 9న అరెస్టు అయ్యారు.
ఇదీ చదవండి:బ్రిజ్‌భూషణ్ అరెస్ట్‌కు రెజ్లర్ల డిమాండ్.. లభించని అమిత్ షా హామీ
Comments
Please login to add a commentAdd a comment